Rajesh dandu
-
అలాంటి స్క్రిప్ట్ రావడం నా అదృష్టం : సంయుక్త
వరుస సినిమాలలో దూసుకెళ్తోంది సంయుక్త. ఇప్పటికే ఆమె హీరోయిన్గా నటిస్తున్న ఐదు సినిమాల్లో నటిస్తోంది. తాజాగా మరో కొత్త సినిమాకు సైన్ చేసింది.. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన వంటి సెన్సేషనల్ హిట్ చిత్రాలను అందించిన సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ రాజేష్ దండా నిర్మించనున్న ఈ చిత్రానికి యోగేష్ కెఎంసి దర్శకత్వం వహించనున్నారు. మాగంటి పిక్చర్స్‌తో కలిసి హాస్య మూవీస్ ప్రొడక్షన్ నంబర్ 6ని నిర్మించనున్నారు. సంయుక్త ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈరోజు రామానాయుడు స్టూడియోస్‌లో పలువురు ప్రత్యేక అతిథుల సమక్షంలో పూజా కార్యక్రమాలతో ఆ చిత్రం గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది.ఈ సందర్భంగా సంయుక్త మాట్లాడుతూ.. ‘ఈ సినిమా కథ వినాలని కొన్ని నెలలుగా అనుకుంటున్నాను. షూటింగ్ బిజీ వలన కుదరలేదు. ఫైనల్ గా రెండ్రోజుల క్రితం కథ విన్నాను, కథ అద్భుతంగా ఉంది. డైరెక్టర్ గారు కొన్ని ఇయర్స్ గా స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నారు. స్క్రిప్ట్ అద్భుతంగా వచ్చింది. ఇలాంటి స్క్రిప్ట్ రావడం నా అదృష్టం. ఈ సినిమాని ఫిమేల్ సెంట్రిక్ మూవీ అని లేబుల్ చేయడం ఇష్టం లేదు. ఇది బలమైన మహిళా ప్రధాన పాత్రతో ఆకట్టుకునే కథ. ఫిమేల్ సెంట్రిక్ అనగానే టూ మచ్ థ్రిల్లర్ లేదా ఎంపవర్మెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. మిగతా సినిమాల్లా సహజంగా ప్రజెంట్ చేసే కథలు ఎందుకు రావడలేదని భావిస్తున్నా తరుణంలో ఇలాంటి అద్భుతమైన కథ వచ్చింది. ఇందులో ఫీమేల్ లీడ్ ఉన్న కథే.. కానీ ఈ కథని హీరో కూడా చేయొచ్చు’ అన్నారు.‘సంయుక్త ఒకే సిట్టింగ్‌లో స్క్రిప్ట్‌కి ఓకే చెప్పి నెక్స్ట్ డే కి పూజ పెట్టుకోవడం అనేది నా కెరీర్ లో ఇదే ఫస్ట్ . అంత స్క్రిప్ట్ ఎక్సయిట్మెంట్ ఉన్న సినిమా ఇది’ అని నిర్మాత రాజేశ్ దండా అన్నారు. -
ఈసారి టైటిల్ సాధిస్తాం
హైదరాబాద్ ఏసెస్ జట్టు ధీమా జెర్సీ ఆవిష్కరణ చాంపియన్స్ టెన్నిస్ లీగ్ హైదరాబాద్: గతేడాది కంటే ఈసారి మెరుగ్గా రాణించి... చాంపియన్స్ టెన్నిస్ లీగ్ (సీటీఎల్) టైటిల్‌ను సాధిస్తామని హైదరాబాద్ ఏసెస్ జట్టు యజమాని రాజేశ్ దండు ధీమా వ్యక్తం చేశారు. ‘గతేడాది ఫైనల్ చేరే అవకాశాన్ని త్రుటిలో చేజార్చుకున్నాం. అయితే ఈసారి మాత్రం అలాంటి ఫలితం పునరావృతం కాదు’ అని తమ జట్టు జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. భారత టెన్నిస్ దిగ్గజం విజయ్ అమృత్‌రాజ్ ఆధ్వర్యంలో జరిగే చాంపియన్స్ టెన్నిస్ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటాయి. ఈనెల 23న ముంబైలో మొదలయ్యే ఈ లీగ్ డిసెంబరు 6న హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్ స్టేడియంలో జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. హైదరాబాద్ జట్టులో స్విట్జర్లాండ్ స్టార్ మార్టినా హింగిస్‌తోపాటు క్రొయేషియా స్టార్ ఇవో కార్లోవిచ్, థామస్ జొహాన్సన్ (స్వీడన్), జీవన్ నెదున్‌చెజియాన్, సామ సాత్విక, ఆదిల్ కల్యాణ్‌పూర్ (భారత్) ఉన్నారు. విజేత జట్టుకు రూ. కోటి, రన్నరప్ జట్టుకు రూ. 50 లక్షలు ప్రైజ్‌మనీగా ఇస్తారు.