ఈసారి టైటిల్ సాధిస్తాం | He can be sure of the title | Sakshi
Sakshi News home page

ఈసారి టైటిల్ సాధిస్తాం

Published Wed, Nov 11 2015 12:37 AM | Last Updated on Sun, Sep 3 2017 12:20 PM

ఈసారి టైటిల్ సాధిస్తాం

ఈసారి టైటిల్ సాధిస్తాం

హైదరాబాద్ ఏసెస్ జట్టు ధీమా
జెర్సీ ఆవిష్కరణ
చాంపియన్స్ టెన్నిస్ లీగ్

 
హైదరాబాద్: గతేడాది కంటే ఈసారి మెరుగ్గా రాణించి... చాంపియన్స్ టెన్నిస్ లీగ్ (సీటీఎల్) టైటిల్‌ను సాధిస్తామని హైదరాబాద్ ఏసెస్ జట్టు యజమాని రాజేశ్ దండు ధీమా వ్యక్తం చేశారు. ‘గతేడాది ఫైనల్ చేరే అవకాశాన్ని త్రుటిలో చేజార్చుకున్నాం. అయితే ఈసారి మాత్రం అలాంటి ఫలితం పునరావృతం కాదు’ అని తమ జట్టు జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.

భారత టెన్నిస్ దిగ్గజం విజయ్ అమృత్‌రాజ్ ఆధ్వర్యంలో జరిగే చాంపియన్స్ టెన్నిస్ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటాయి. ఈనెల 23న ముంబైలో మొదలయ్యే ఈ లీగ్ డిసెంబరు 6న హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్ స్టేడియంలో జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. హైదరాబాద్ జట్టులో స్విట్జర్లాండ్ స్టార్ మార్టినా హింగిస్‌తోపాటు క్రొయేషియా స్టార్ ఇవో కార్లోవిచ్, థామస్ జొహాన్సన్ (స్వీడన్), జీవన్ నెదున్‌చెజియాన్, సామ సాత్విక, ఆదిల్ కల్యాణ్‌పూర్ (భారత్) ఉన్నారు. విజేత జట్టుకు రూ. కోటి, రన్నరప్ జట్టుకు రూ. 50 లక్షలు ప్రైజ్‌మనీగా ఇస్తారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement