సీటీఎల్ చాంప్ పుణే మరాఠాస్ | Pune wins the CTL title | Sakshi
Sakshi News home page

సీటీఎల్ చాంప్ పుణే మరాఠాస్

Published Thu, Nov 27 2014 1:04 AM | Last Updated on Sat, Sep 2 2017 5:10 PM

సీటీఎల్ చాంప్ పుణే మరాఠాస్

సీటీఎల్ చాంప్ పుణే మరాఠాస్

న్యూఢిల్లీ: మొదటి చాంపియన్స్ టెన్నిస్ లీగ్ (సీటీఎల్) టైటిల్‌ను పుణే మరాఠాస్ జట్టు సొంతం చేసుకుంది. బుధవారం ఇక్కడి ఆర్‌కే ఖన్నా స్టేడియంలో జరిగిన ఫైనల్లో పుణే 27-23 గేమ్‌ల తేడాతో ఢిల్లీ డ్రీమ్స్‌పై విజయం సాధించింది. లెజెండ్స్ మ్యాచ్ మినహా మిక్స్‌డ్ డబుల్స్, మహిళల సింగిల్స్, పురుషుల డబుల్స్, పురుషుల సింగిల్స్‌లో పుణే విజేతగా నిలవడం విశేషం. చాంపియన్‌గా నిలిచిన మరాఠాస్‌కు రూ. 1 కోటి, రన్నరప్ ఢిల్లీకి రూ. 50 లక్షలు ప్రైజ్‌మనీగా లభించాయి.

 ఫైనల్ పోరు తొలి మ్యాచ్ (లెజెండ్స్)లో జువాన్ కార్లోస్ ఫెరీరో 6-3 స్కోరుతో ప్యాట్ క్యాష్‌పై విజయం సాధించి ఢిల్లీకి శుభారంభం అందించాడు. అయితే ఆ తర్వాత వరుసగా పుణేదే పైచేయి అయింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో పుణే జోడి బాగ్దాటిస్-రద్వాన్‌స్కా 6-5తో ఢిల్లీ జంట అండర్సన్-జంకోవిక్‌లను ఓడించింది. ఆ తర్వాత మహిళల సింగిల్స్‌లో రద్వాన్‌స్కా 6-4తో జంకోవిక్‌ను చిత్తు చేసింది.

పురుషుల డబుల్స్‌లో అదే ఫలితం ఎదురైంది. బాగ్దాటిస్-సాకేత్ మైనేని ద్వయం 6-5తో అండర్సన్-సనమ్ సింగ్‌పై గెలుపొందింది. ఈ దశలో పుణే 21-20 గేమ్‌ల ఆధిక్యంలో నిలిచి విజయంపై కన్నేసింది. చివరిదైన పురుషుల సింగిల్స్‌లో బాగ్దాటిస్ 6-3తో అండర్సన్‌ను చిత్తు చేయడంలో పుణే టీమ్ సంబరాలు జరుపుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement