Rajgopal reddy
-
ప్రజలు మాతోనే ఉన్నారు : రాజగోపాల్ రెడ్డి
-
చౌటుప్పల్‌లో అనుకున్న మెజార్జీ రాలేదు
-
కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్న రాజగోపాల్ రెడ్డి
-
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఈసీ నోటీసు
-
నేడు నామినేషన్ దాఖలు చేయనున్న రాజగోపాల్ రెడ్డి
-
మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డితో స్ట్రెయిట్ టాక్
-
మునుగోడులో ఎవరు గెలుస్తారో నాకు తెలుసు
న్యూ ఢిల్లీ: తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై.. భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి మండిపడ్డారు. మునుగోడులో గెలవబోయేది ఎవరో తనకు తెలుసని.. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఏదో చేయాలనుకుంటున్నారని పేర్కొన్నారు. హోంమంత్రి అమిత్ షాతో భేటీ అనంతరం.. ఢిల్లీలో శుక్రవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇవాళ తాను అందుబాటులో ఉండనని తెలిసే చండూరులో రేవంత్ సభ పెట్టారని ఆక్షేపించారు వెంకటరెడ్డి. పీసీపీ ప్రెసిడెంట్ అందరినీ ఇబ్బందిపెడుతున్నారు. నన్ను ఓడించేందుకు ప్రయత్నించిన చెరుకు సుధాకర్‌ను పార్టీలో చేర్చుకున్నారు. నా లోక్‌సభ పరిధిలో నన్ను అడగకుండానే రేవంత్ ఎలా మీటింగ్ పెడతారు? లోకల్ ఎంపీకి చెప్పకుండా సభ పెట్టడం తప్పు. తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేసిన వ్యక్తిని నేను. పదవుల కోసం వెంటపడే వ్యక్తి కాదు. నేను ఎవరికీ భయపడను. పాత కాంగ్రెస్ నేతలందరినీ పార్టీ నుంచి వెళ్లగొడుతున్నావు. కాంగ్రెస్ వాళ్లంతా పోతే టీడీపీ వాళ్లని చేర్చుకుంటారా?. మునుగోడులో ఎవరు గెలుస్తారో నాకు తెలుసు. నేను పార్టీ మారితే అందరికీ చెప్పే వెళ్తాను. కాంగ్రెస్‌ను రేవంత్ ఏం చేయాలనుకుంటున్నాడో.. సోనియా, రాహుల్ దగ్గర తేల్చుకుంటాం అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా.. ఈ రోజు మూడు ముఖ్యమైన సమావేశాలు జరిపినట్లు తెలిపారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి.. తెలంగాణకు రూ. వెయ్యి కోట్ల వరద సహాయం చేయమని అడిగినట్లు చెప్పారు. అంతేకాదు ప్రజా సమస్యల పరిష్కారానికే హోం మంత్రిని కలిసినట్లు స్పష్టత ఇచ్చారు. మునుగోడు సభ కంటే అభివృద్ధి ముఖ్యం కాదా అని ప్రశ్నించారు. అమిత్‌షాను తెలంగాణలో ఏరియల్ సర్వే చేయమని కోరానని, రూల్ 377 కింద ఫ్లడ్స్ విషయాన్ని లేవనెత్తానని. ఆర్థిక శాఖ సంప్రదింపుల సమావేశానికి హాజరయ్యానని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. ఇదీ చదవండి: హోం మంత్రి అమిత్ షాను విడివిడిగా కలిసిన కోమటిరెడ్డి బ్రదర్స్ -
కోమటిరెడ్డి రాజగోపాల్ పార్టీ మార్పు ప్రచారంపై ఏఐసిసి రియాక్షన్
-
ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత
-
భూత వైద్యుడిలా మాట్లాడతారేంటి?
సాక్షి, హైదరాబాద్: కరోనా (కోవిడ్–19)పై పిట్ట కథలు చెప్పి ప్రజలను మభ్యపెట్టడం మానుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాంగ్రెస్ శాసన సభాపక్ష (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క సూచించారు. సీఎం కేసీఆర్ ఒక ఆర్ఎంపీ డాక్టర్‌లాగా, భూత వైద్యుడిలా మాట్లాడకూడదని, ఇది నిజ జీవితం.. సినిమా కాదని గ్రహించాలన్నారు. కరోనా మన రాష్ట్రానికి రానే రాదని, పారాసిటమాల్ మాత్ర వేసుకుంటే తగ్గిపోతుందని చెప్పే పిట్ట కథలు మానుకోవాలన్నారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద పార్టీ ఎమ్మెల్యేలు రాజగోపాల్‌రెడ్డి, సీతక్క, పొడెం వీరయ్యలతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కరోనా వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తాము అసెంబ్లీలో చెప్పడానికి ప్రయత్నిస్తే.. కాంగ్రెస్ పార్టీని సీఎం కేసీఆర్ కరోనా వైరస్‌తో పోల్చి మాట్లాడారని, అసలు ఆయనకు బుద్ధుందా అని ప్రశ్నించారు. సామాజ్య్రవాదులను గడగడలాడించిన కాంగ్రెస్ పార్టీనుద్దేశించి చేసిన వ్యాఖ్యలకు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కరోనా సోకిన వ్యక్తిని ప్రజా జీవితానికి దూరంగా ఐసోలేషన్ రూంలో ఉంచాలని, అలాంటిది నగరం నడిబొడ్డున గాంధీ ఆస్పత్రిలో ఉంచారని విమర్శించారు. నిజ జీవితం సినిమాలా ఉండదని, బాలకృష్ణ సినిమాలో లాగా తొడగొడితే బిల్డింగులు కూలిపోయినట్టు కాదని ఎద్దేవా చేశారు. కరోనా వైరస్ తెలంగాణలో రావాలంటే గజ్జున వణుకుతుందని కేసీఆర్ చెప్పారని, ఆయన్ను చూసి కరోనా గజ్జున వణికితే డబ్ల్యూహెచ్‌వోకు చెప్పి ప్రపంచ దేశాలు తిప్పుతామని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం మాటలు చెప్తే సరిపోదని, కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఏం మాట్లాడుతున్నారో అర్థం అవుతుందా..: రాజగోపాల్‌రెడ్డి సీఎం కేసీఆర్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సోనియాను దేవతతో పోల్చి కాంగ్రెస్ పార్టీని పొగిడిన ఆయన ఇప్పుడు వైరస్ అంటున్నారన్నారు. ఒడ్డు చేరేంత వరకు ఓడ మల్లయ్య.. ఒడ్డు చేరాక బోడి మల్లయ్యలాగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ వైఖరి చూస్తుంటే ఆ రోజు సోనియాను ఒప్పించి తెలంగాణను ఎందుకు తెచ్చామా అనే బాధ కలుగుతోందని, ఉమ్మడి రాష్ట్రంలోనే ఉంటే బాగుండేదని అనిపిస్తోందన్నారు. కేసీఆర్ కుటుంబం కోసమే తెలంగాణ వచ్చినట్టు ఉందన్నారు. కేసీఆర్ తర్వాత కేటీఆర్ ఆయన తర్వాత మనుమడు హిమాన్షు సీఎం అని ప్రచారం జరుగుతోందన్నారు. కేసీఆర్ మాటలతోనే ప్రజల్లో అనుమానాలు: సీతక్క ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. కరోనా లేదు కాకరకాయ లేదు అని మాట్లాడిన సీఎం కేసీఆర్ ఇప్పుడు కరోనా గురించి చేస్తున్న హడావుడి చూస్తుంటేనే ఏదో జరిగిపోతోందనే అనుమానం ప్రజలకు కలుగుతోందని వ్యాఖ్యానించారు. కరోనాను నియంత్రించాలని సభలో తాను కోరితే గాలి మాటలు మాట్లాడుతున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారని ఆవేదన వ్యక్తం చేశారు. -
లీకువీరుడు అప్పుడూ.. ఇప్పుడూ ఒకరే!
-
లీకువీరుడు అప్పుడూ.. ఇప్పుడూ ఒకరే!
అది 2014 సంవత్సరం. మెడికల్ పీజీ ప్రవేశపరీక్ష పేపర్ లీకైన విషయం పెద్ద ఎత్తున సంచలనం రేపింది. అందులో కీలక నిందితుడు రాజగోపాల రెడ్డి. అతడిని విజయవాడ పోలీసులు అరెస్టు చేసి, తర్వాత విడుదల చేశారు. కట్ చేస్తే.. 2016 సంవత్సరం.. తెలంగాణలో నిర్వహించిన ఎంసెట్ 2 మెడికల్ ఎంట్రన్స్ పేపర్ లీకైందని సీఐడీ నిర్ధారించింది. ఇందులోనూ కీలక నిందితుడు రాజగోపాలరెడ్డే!! అప్పుడూ ఇప్పుడూ కూడా అదే వ్యక్తి మెడికల్ ప్రవేశపరీక్ష పేపర్లను లీక్ చేస్తూ కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నాడు. ఈ విషయం తాజాగా తెలంగాణ సీఐడీ విచారణలో తేలింది. ఎంసెట్ పేపర్ లీకేజి విషయంలో ఇప్పటివరకు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో గతంలో నిందితుడైన రాజగోపాలరెడ్డితో పాటు కన్సల్టెన్సీ యజమాని విష్ణు, దళారీ రమేష్‌లతో పాటు.. తిరుమల్ రెడ్డి అనే మరో వ్యక్తి కూడా ఉన్నాడు. వీరిలో విష్ణుకు ఒక కన్సల్టెన్సీ ఉంది. దాని ద్వారా వేరే రాష్ట్రాలలో ఉన్న వైద్య కళాశాలలతోపాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రైవేటు వైద్య కళాశాలల్లో మేనేజిమెంటు కోటా సీట్లు ఇప్పిస్తానంటూ విద్యార్థుల తల్లిదండ్రులతో బేరాలు కుదుర్చుకునేవాడని అంటున్నారు. ఈ నలుగురితో పాటు మరో ఇద్దరు నిందితులు కూడా ఈ కేసులో ఉన్నారని, వాళ్లు పరారీలో ఉన్నారని సమాచారం. కేసు ఛేదించిందిలా... సీఐడీ అధికారులు ముందుగా బ్రోకర్ల కాల్ డేటా సేకరించారు. ర్యాంకులు వచ్చిన పిల్లల తల్లిదండ్రుల కాల్ డేటా కూడా చూస్తే రెండూ కలిశాయి. వాళ్లిద్దరు కొన్ని వందల సార్లు మాట్లాడుకున్నట్లు తేలింది. జేఎన్టీయూ సిబ్బంది ఇద్దరి పేర్లు కూడా ఈ కాల్ డేటాలో వచ్చాయి. ఒకరు ప్రొఫెసర్, మరొకరు నాన్ టీచింగ్ స్టాఫ్ అని తెలిసింది. లీకేజి స్కాం విలువ 50 కోట్లు, కాగా.. మొత్తం 74 మంది విద్యార్థులు ప్రయోజనం పొందారని చెబుతున్నారు. ఈ కేసు దర్యాప్తు వివరాలన్నింటినీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు డీజీపీ అందజేశారు. లీకు ఎలా చేశారంటే... బెంగళూరు కేంద్రంగా మొత్తం వ్యవహారం నడిచింది. రాజగోపాలరెడ్డి (63) ఉషా ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని నిర్వహిస్తున్నాడు. మేనేజిమెంట్ కోటాలో వైద్యసీట్ల విక్రయానికి దళారీగా వ్యవహరించేవాడు. అక్రమ మార్గంలో మెడికల్ సీట్లు అమ్ముకుంటున్నాడంటూ బెంగళూరులో కూడా ఇతడిపై నాలుగు కేసులు ఉన్నాయి. ఢిల్లీలో పేపర్ల ముద్రణ జరుగుతుందని ముందే తెలిసిన రాజగోపాలరెడ్డి.. హైదరాబాద్‌లో ఉన్న కన్సల్టెన్సీ ద్వారా ఎంబీబీఎస్ కోచింగ్ సెంటర్లలో బాగా స్థితిమంతులైన పిల్లల వివరాలు సేకరించి, వాళ్ల తల్లిదండ్రులతో బేరం కుదుర్చుకున్నాడు. సాధారణంగా ఇలాంటి ప్రధానమైన పరీక్షలకు మూడు సెట్ల పేపర్లను సిద్ధం చేస్తారు. ఏ సెట్‌ను ఉపయోగించేదీ ఆరోజు ఉదయమే ప్రకటిస్తారు. అందుకే మొత్తం మూడు సెట్ల పేపర్లనూ లీక్ చేయించాడు. ఏ సెట్ వచ్చినా వాటిలోని ప్రశ్నలన్నీ తెలుసు కాబట్టి.. సులభంగా ర్యాంకులు సాధించేలా ఆ విద్యార్థులను రెండురోజుల పాటు బెంగళూరులో సిద్ధం చేశారు. సరిగ్గా పరీక్షరోజు ఉదయమే వాళ్లను విమానాల్లో హైదరాబాద్ రప్పించారు. దాంతో ముందు అనుకున్నట్లుగానే మంచి ర్యాంకులు వచ్చాయి. -
ధర్మం.. అధర్మం మధ్య పోరాటం
తుంగతుర్తి, న్యూస్‌లైన్: విశ్వాసానికి, విశ్వాసఘాతానికి.. ధర్మానికి, ఆధర్మానికి మధ్య జరుగుతున్న పోరాటమే ఈ ఎన్నికలని కాంగ్రెస్ పార్టీ నల్లగొండ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలు అన్నారు. మంగళవారం తుంగతుర్తిలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే హక్కు కాంగ్రెస్ పార్టీకే ఉందన్నారు. 60 సంవత్సరాల పోరాట ఫలితంగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు సోనియా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారన్నారు. 1969, 2009 ఉద్యమాల్లో 1200మంది ఆత్మబలిదానాలు చేసుకున్నారని.. వారి త్యాగఫలితమే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. సీమాంధ్రలో కాంగ్రెస్‌పార్టీ పతనమై పోతుం దని తెలిసి కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి సోనియా తెలంగాణ ఇచ్చారన్నారు. అందుకు ఫలితంగా అత్యధికమంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి సోనియా రుణం తీర్చుకోవాలన్నారు. తెలంగాణ ప్రజలకు సోనియా ఒక దేవతలాంటిదన్నారు. తాము రౌడీలకు భయపడేది లేదన్నారు. డబ్బుతో మంచితనాన్ని కొనలేమని అన్నారు. తెలంగాణ రాకుండా చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డిలు ఎన్నో కుట్రలు చేశారన్నారు.తెలంగాణ ఇస్తే కాంగ్రెస్‌లో విలీనం అవుతామని చెప్పిన కేసీఆర్ నేడు మాట మార్చడం సిగ్గుచేటన్నారు. కేసీఆర్ అన్నంపెట్టిన తల్లికి సున్నంపెట్టాడని విమర్శించారు. 30 సంవత్సరాలుగా తుంగతుర్తి నియోజకవర్గం అభివృద్ధికి ఆమడదూరంలో ఉందన్నారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వృద్ధులకు రూ.1000, వికలాంగులకు, వితంతువులకు రూ.1500 ఇస్తామన్నారు. ఎస్సారెస్పీ కాలువలను పూర్తిచేసి రైతులకు నీరందిస్తామన్నారు. పాలేరు జలాలను ప్రతి గ్రామానికీ అందేలా కృషి చేస్తామన్నారు. పాలేరు జలాలు తేవడానికి రూ.98కోట్లతో పనులు ప్రారంభించామని అన్నారు. ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేస్తామన్నారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అద్దంకి దయాకర్, తండు శ్రీనివాస్‌యాదవ్, సీహెచ్ రాజగోపాల్‌రెడ్డి, ఎర్ర యాదగిరి, రఘునందన్‌రెడ్డి, దొనకొండ రమేష్, లక్ష్మీనర్సింహారెడ్డి, బాలరాజు, కైలాస్, కృష్ణమూర్తి, వేణుగోపాల్‌రెడ్డి, తోట సోమయ్య, చినపాక యాదగిరి, కోడి శ్రీను, విజయకుమార్‌రెడ్డి, కడియం పరమేష్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. -
కిరణ్‌కు మానవత్వం లేదు
పరిగి, న్యూస్‌లైన్: తెలంగాణ ఉద్యమంలో వెయ్యి మందికి పైగా విద్యార్థులు చనిపోతే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఒక్కమాట కూడా మాట్లాడకపోవటం ఆయనకు మానవత్వం లేదని గుర్తు చేస్తోందని ఎంపీ కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం రాత్రి పరిగిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సోనియా గాంధీ దయతో సీఎం అయిన కిరణ్ ఏ మాత్రం కృతజ్ఞత లేకుండా అధిష్టానం నిర్ణయాన్ని తప్పుబడుతున్నారని మండిపడ్డారు. బుద్ధి గడ్డితిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఆయనకు సీఎం అయ్యే ఏ ఒక్క అర్హత లేదన్నారు. తెలంగాణ ఏర్పాటును ఆపుతామనడం సీమాంధ్ర నాయకుల భ్రమేనన్నారు. ఇప్పటికైనా తెలంగాణ ఏర్పాటుకు అడ్డుతగలటం మానుకోవాలని హితవు పలికారు. హైదరాబాద్‌లో స్వేచ్ఛగా బతికేందుకు హామీ ఇస్తున్నామన్నారు. పీసీసీ కార్యదర్శి టి.రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం సోనియా గాంధీ తెలంగాణ ఇస్తున్నారని గుర్తు చేశారు. దీనికి తెలంగాణ ప్రజలంతా పార్టీలకతీతంగా ఆమె పట్ల కృతజ్ఞత తో మెలగాలన్నారు. ఫిబ్రవరిలోపు తెలంగాణ ఏర్పాటు ఖాయమన్నారు. కొత్త రాష్ట్రంలోనే ఎన్నికలు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో పార్టీ పరిగి మండల అధ్యక్షుడు బి.నారాయణ్‌రెడ్డి, గండేడ్ మండల అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మేఘమాల, మహిళా నాయకులు సురేఖారెడ్డి, విజయలక్ష్మి పాల్గొన్నారు. -
ఎంపీ, ఎమ్మెల్యే వర్గీయుల ఘర్షణ
ఆత్మకూరు(ఎం), న్యూస్‌లైన్ : ఆలేరు నియోజకవర్గంలో ఇప్పటికే రెండు వర్గాలుగా చీలిన కాంగ్రెస్ పార్టీ మరోమారు రోడ్డు న పడింది. ఆత్మకూర్.ఎం మండలకేంద్రంలో ఆదివారం భువనగిరిఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ వర్గీయులు వీరంగం సృష్టిం చారు. పరస్పరం ఘర్షణకు దిగా రు. చొక్కాలు పట్టుకొని, కుర్చీలు విసురుకున్నారు. దీంతో సుమారు మూడు గంటలపాటు తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళితే.. ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు మచ్చ చంద్రమౌళి గౌడ్ గుండాల మండలంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతూ మండల కేంద్రంలోని ఎమ్మెన్నార్ ఫంక్షన్ హాల్లో ఆగా రు. ఆయనను కలుసుకునేందుకు యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆకుల శ్రీను నాయకత్వంలో సుమారు 120 మంది కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. చంద్రమౌళిగౌడ్ స్థానిక విలేకరులతో మాట్లాడడం ముగియగానే ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ అనుచరులైన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కె. నరేందర్ గుప్తా ఆధ్వర్యంలో కొందరు కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. ‘మాకు తెలియకుండా మండలంలో సమావేశం నిర్వహించడానికి మీ రెవరూ’ అంటూ చంద్రమౌళి గౌడ్‌ను నిలదీశారు. తాను సమావేశం నిర్వహించడం లేదని, కార్యకర్తలను కలుసుకునేందుకు మా త్రమే వచ్చానని చంద్రమౌళిగౌడ్ సమాధానమిచ్చారు. తమ మండలంలో ఎలాంటి సమావేశం పెట్టడానికి వీల్లేదని, ఫంక్షన్ హాల్‌ను విడిచి వెళ్లాలంటూ ఎమ్మెల్యే వర్గీయులు డిమాండ్ చేశారు. అందుకు వారు నిరాకరించారు. దీంతో ఇరువర్గాల నాయకుల మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. ఒక వర్గం వారు ఎమ్మెల్యే జిందాబాద్ అంటూ నినదించగా మరో వర్గం వారు ఎంపీ జిందాబాద్ అంటూ ప్రతి నినాదాలు చేశారు. ఎమ్మెల్యే వర్గానికి చెందిన కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు లోడి శ్రీను, ఎంపీ వర్గానికి చెందిన ఆకుల శ్రీను, ఏకు సుమన్ రెడ్డిలు చొక్కాలు పట్టుకొని ఘర్షణ పడ్డారు. దీంతో ఇరు వర్గాల వారు పరస్పరం కుర్చీలు విసురుకున్నారు. ఈ దశలో ఫంక్షన్హాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాల వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. తాము ఫిర్యాదు చేయనిదే పోలీసులు ఎందుకు వచ్చారంటూ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నరేందర్ గుప్తా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే ఫంక్షన్హాల్లో ఇరు వర్గాల వారు వేరు వేరుగా కూర్చొని సాయంత్రం వరకు నినాదాలు చేసుకున్నారు. చీకటి పడడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇద్దరూ సమానమే.. తమకు ఎంపీ రాజగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్ ఇద్దరూ సమానమేనని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కె. నరేందర్ గుప్తా అ న్నారు. తమకు సమాచారం ఇవ్వకుండా సమావేశం నిర్వహించినందుకు అడ్డుకున్నామని చెప్పారు.