Rajib Banerjee
-
బీజేపీ అనే వైరస్‌కు వ్యాక్సిన్ మమతే.. అభిషేక్ బెనర్జీ తీవ్ర విమర్శలు
అగర్తలా: తృణమూల్ కాంగ్రెస్‌లోకి వలసలు మొదలయ్యాయి. పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి రజీబ్ బెనర్జీ, త్రిపుర బీజేపీ ఎమ్మెల్యే అశిష్‌దాస్ శనివారం త్రిపురలోని అగర్తలాలో జరిగిన ఒక కార్యక్రమంలో టీఎంసీ గూటికి చేరారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ సమక్షంలో తృణమూల్ తీర్థం పుచ్చుకున్నారు. 2011, 2016లో పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ప్రభుత్వంలో మంత్రిగా చేసిన రజీబ్ గత ఎన్నికల సమయంలో బీజేపీలో చేరి దోమ్జూర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. తృణమూల్ అధికారంలోకి రావడంతో బీజేపీ నుంచి మళ్లీ మాతృసంస్థకి చేరుకున్నారు. గోవా నుంచి త్రిపుర వరకు పార్టీని విస్తరించడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా అగర్తాలలో తృణమూల్ కాంగ్రెస్ సభ నిర్వహించింది. ఈసారి త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్, రైట్ అందరినీ మట్టికరిపిస్తామని అభిషేక్ధీమా వ్యక్తం చేశారు. ‘‘బీజేపీ అనే వైరస్‌కి వ్యాక్సిన్ ఒక్కటే ఉంది. దాని పేరు మమతా బెనర్జీ. త్రిపుర ఓటర్లు ఆ వైరస్‌కి రెండు డోసుల వ్యాక్సిన్ ఇవ్వాలి. మొదటిది వచ్చే నెలలో జరిగే స్థానిక ఎన్నికల్లోనూ, 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ రెండో డోసు ఇవ్వాలి’’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అగర్తలా ర్యాలీ నిర్వహించాలని గత కొద్ది రోజులుగా టీఎంసీ ప్రయత్నిస్తున్నప్పటికీ అక్కడ రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం అడ్డు చెబుతూ వస్తోంది. కరోనా నిబంధనల వల్ల ర్యాలీలకు అనుమతించేది లేదని పోలీసులు తెగేసి చెప్పారు. దీంతో టీఎంసీ కోర్టుకెళ్లింది. చివరికి త్రిపుర హైకోర్టు ర్యాలీకి అనుమతించింది. -
మమతకు మరో షాక్ :కీలక మంత్రి గుడ్‌బై
సాక్షి, కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో వరుస పరిణామాలు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)ని తీవ్ర ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టి వేస్తున్నాయి. తాజా కేబినెట్ మంత్రి రాజీవ్ బెనర్జీ తన పదవికి రాజీనామా చేశారు. మంత్రి పదవికి తాను రాజీనామా చేస్తున్నట్టు రాజీవ్ స్వయంగా ట్విటర్లో వెల్లడించారు. త్వరలోనే రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న తరుణంలో వరుసగా కీలక నేతలు పార్టీని వీడటం, అదీ బీజేపీ కండువా కప్పుకోవడం తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఎదురుదెబ్బగా భావించాలి. దోంజూర్కు చెందిన తృణమూల్ ఎమ్మెల్యే, రాష్ట్ర అటవీశాఖ మంత్రి అయిన రాజీవ్ బెనర్జీ చాలా కాలంగా అసమ్మతిని వ్యక్తం చేస్తున్న ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కూడా బీజేపీలో చేరతారనే అంచనాలు భారీగా నెలకొన్నాయి. ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి బెంగాల్ పర్యటనకు ముందు రాజీవ్ రాజీనామా ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా ఇప్పటికే టీఎంసీ ఎంపీ సువేందు అధికారి బీజేపీలో చేరారు. ఆయన నేతృత్వంలో మరో ఏడుగురు తృణమూల్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్ అయిన సంగతి తెలిసిందే. అలాగే శాంతిపూర్‌కు చెందిన ఎమ్మెల్యే అరిందాం భట్టాచార్య కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. This is to inform you that I am resigning as the Minister in Charge, Department of Forest, West Bengal from today. pic.twitter.com/dfVq6aVxUj — Rajib Banerjee (@RajibBaitc) January 22, 2021 -
లక్షల్లో మెజారిటీ సాధించారు!
కోల్ కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు అభ్యర్థులు లక్షల మెజారిటీతో విజయం సాధించి సంచలనం సృష్టించారు. 500 లోపు మెజారిటీతో గెలిచిన నాయకులు కూడా ఉన్నారు. నీటిపారుదల శాఖ మంత్రి రజీబ్ బెనర్జీ డిస్టింక్షన్ లో పాసయ్యారు. తన సమీప స్వతంత్ర అభ్యర్థి ప్రొతిమ దుత్తాపై 107,701 ఓట్ల ఆధిక్యంతో విజయదుందుభి మోగించారు. కేశపూర్ నుంచి పోటీ చేసిన మరో టీఎంసీ నేత సియలీ సాహ.. సీపీఎం అభ్యర్థి రామేశ్వర్ దొలయ్ పై 101,151 ఓట్లతో విజయకేతనం ఎగురవేశారు. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన మనోజ్ చక్రవర్తి 92,273 ఓట్లతో గెలిచారు. టీఎంసీ ఎంపీ సువేందు అధికారి 81,230 ఓట్ల మెజారిటీతో సత్తా చాటారు. తృణమూల్ నేతలు ఆశిష్ చక్రవర్తి, ఆసిమా పాత్రా, సుకుమార్ హన్సడా 50 వేల ఓట్ల పైగా ఆధిక్యంతో విజయాలు సాధించారు. కొంతమంది నాయకులు అత్యల్ప మెజారిటీతో గెలుపు సాధించారు. టీఎంసీ నుంచి అబ్దుర్ రెహమాన్ 280 స్వల్ప మెజారిటీతో గెలిచారు. ఇక పలువురు తృణమూల్ అభ్యర్థులు సీపీఎం చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. టీఎంసీ నాయకులు ఏటీఎం అబ్దుల్లా(492), బెంగాలీ నటుడు సోహం చక్రవర్తి(616) పరాజయం పాలయ్యారు. అశోక్ కుమార్ దిండా(సీపీఐ), సాజల్ పాంజా(టీఎంసీ), రవీంద్రనాథ్ ఛటర్జీ(టీఎంసీ), తుషార్ కాంతి భట్టాచార్య(కాంగ్రెస్) కూడా 1000 కంటే తక్కువ ఓట్లతో ఓడిపోయారు.