Rajmohan reddy
-
నాలుగు నెలల్లో జగన్ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం : ఎంపీ మేకపాటి
చేజర్ల, న్యూస్‌లైన్: మరో నాలుగు నెలల్లో రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం తథ్యమని ఆ పార్టీ కేంద్రపాలకమండలి సభ్యుడు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. మండలంలోని కోటితీర్థం, యనమదల, బిల్లుపాడు గ్రామా ల్లో శనివారం మేకపాటి గౌతమ్‌రెడ్డి చేపట్టిన పాదయాత్రలో ఎంపీ పాల్గొన్నారు. మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో జగన్ సీఎం కాబోతున్నారన్నారు. జగన్‌కు ప్రజల దీవెనలు, కార్యకర్తల అండదండలున్నాయన్నారు. కాంగ్రెస్, టీ డీపీ పన్నిన కుట్రలు, కుతంత్రాలు జగన్మోహన్రెడ్డిపై ఉన్న అభిమానం ముందు నిలువలేకపోయాయన్నారు. నియోజకవర్గంలో వైఎస్సార్సీపీని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు కార్యకర్తలు సైనికుల్లా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు గౌతమ్‌రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారన్నారు. ప్రజల్లో ఒక్కడిగా ఉండి ఆత్మకూరు అభివృద్ధికి గౌతమ్ కృషి చేస్తారన్నారు. ఢిల్లీలో ప్రధానిని నిర్ణయించే కీలకపాత్ర జగన్ పోషిస్తారన్నారు. జగన్ నాయకత్వంలో రాష్ట్రానికి స్వర్ణయుగం వస్తుందన్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకించి సమైక్యాంధ్రకు కృషి చేస్తున్న మహోన్నత వ్యక్తి జగన్మోహన్రెడ్డి అని కొనియాడారు. జిల్లాలో వైఎస్సార్సీపీ అన్ని అసెంబ్లీ స్థానాలతో పాటు పార్లమెంటు సీటును కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆత్మకూరు నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి గౌతమ్‌రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్, మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, ఆత్మకూరు మండల కన్వీనర్ ఇందూరు నారసిం హారెడ్డి, నాయకులు పులిమి జగన్మోహన్రెడ్డి, మందా రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
సమైక్య రాష్ట్రానికి జగనే సీఎం
ఆత్మకూరు/అనుమసముద్రంపేట, న్యూస్‌లైన్: సమైక్య రాష్ట్రానికి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ కేంద్రపాల క మండలి సభ్యుడు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. అనుమసముద్రంపేట మండలం హసనాపురం నుంచి ఆది వారం వైఎస్సార్‌కాంగ్రెస్ ఆత్మకూరు నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి గౌతమ్‌రెడ్డి పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భం గా హసనాపురం సెంటర్లో ఏఎస్‌పేట మండల కన్వీనర్ పందిళ్లపల్లి సుబ్బారెడ్డి, పందిళ్లపల్లి గోపిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో ఎంపీ మేకపాటి మాట్లాడారు. జగన్మోహన్రెడ్డిని ఎదుర్కొనే పరిస్థితి రాష్ట్రంలో ఏ పార్టీకి లే దన్నారు. ఉప ఎన్నికల్లో ప్రజలు ఢిల్లీ పీఠం ద ద్దరిల్లేలా బుద్ధి చెప్పారన్నారు. ప్రజాతీర్పు ధా టికి ఢిల్లీ పెద్దలు బెంబేలెత్తారన్నారు. మహానే త రాజశేఖరరెడ్డి వల్ల లబ్ధి పొందిన వారే ఆయ న కుటుంబానికి ద్రోహం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి ఓటర్లు తగిన బుద్ధి చె ప్పారని, మళ్లీ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి జీవించి ఉంటే రా ష్ట్రాన్ని చీల్చే ధైర్యం ఎవరికి ఉండేది కాదన్నా రు. తెలుగుజాతి గౌరవం ఢిల్లీకి దాసోహం కా కూడదనే ఉద్దేశంతో జగన్మోహన్రెడ్డి వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ స్థాపించారని ఎంపీ పే ర్కొన్నారు. ఆత్మకూరు నియోజకవర్గ సమన్వయకర్త గౌతమ్‌రెడ్డిపై అభిమానం చూపాలని, మీ రుణం తీర్చుకుంటామని ఆయన హామీ ఇ చ్చారు. జగన్‌కు గౌతమ్‌రెడ్డి సన్నిహితుడన్నా రు. గౌతమ్‌రెడ్డి నాయకత్వంలో ఆత్మకూరు ని యోజకవర్గం అభివృద్ధి చెందుతుందని చెప్పా రు. వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్, సీనియర్ నేత నేదురుమల్లి పద్మనాభరెడ్డి, సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి సమన్వయకర్తలు కిలివేటి సంజీవయ్య, పాశం సునీల్‌కుమార్, కొమ్మి లక్ష్మయ్యనాయు డు, సీఈసీ సభ్యులు బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, ఆత్మకూరు, అనంతసాగరం, సంగం మండలాల కన్వీనర్లు ఇందూ రు నారసింహారెడ్డి, రాపూరు వెంకట సుబ్బారెడ్డి, ఐవీ కృష్ణారెడ్డి, పార్టీ నేతలు బిజివేముల వెంకటసుబ్బారెడ్డి,అల్లారెడ్డి సతీష్‌రెడ్డి, ఆనందరెడ్డి, దయాకర్‌రెడ్డి, జిల్లా ప్రచారకమిటీ కార్యదర్శి పాండురంగారెడ్డి పాల్గొన్నారు. నాలుగేళ్ల పాలన అస్తవ్యస్తం వింజమూరు : మహానేత వైఎస్సార్ మరణానంతరం నాలుగేళ్ల రాష్ట్ర పాలన అస్తవ్యస్తంగా మారిందని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ గువ్వల కృష్ణారెడ్డి నివాసంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర విభజన కోరుతూ కేంద్రానికి లేఖ ఇచ్చినప్పుడు ఆ పార్టీ నేతలు మూకుమ్మడి రాజీనామాలు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. విభజనపై జాతీయస్థాయి నాయకులు తమ వ్యతిరేకతను బాహాటంగా ప్రకటించడం వెనక జగన్మోహన్రెడ్డి కృషి ఉందన్నారు. ఆయన వెంట జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు గణపం బాలకృష్ణారెడ్డి, స్థానిక నాయకులు మలిరెడ్డి విజయ్‌కుమార్‌రెడ్డి, మద్దూరి చిన్ని కృష్ణారెడ్డి, రామాకోటారెడ్డి, గణపం మాలకొండారెడ్డి, గోపిరెడ్డి రమణారెడ్డి, దాట్ల విజయభాస్కర్‌రెడ్డి ఉన్నారు. -
ఎకరా ఎండినా ఒప్పుకోం
కావలి, న్యూస్‌లైన్ : కావలి కాలువ ఆయకట్టు పరిధిలో ఒక్క ఎకరా కూడా సాగునీరు లేక ఎండినా ఒప్పుకునేది లేదని వైఎస్సార్సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. శనివారం వైఎస్సార్సీపీ కావలి నియోజకవర్గ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డితో కలిసి ఆయన కావలి కాలువ ఆయకట్టు పరిధిలో ఎండుతున్న పంట పొలాలను పరిశీలించారు. రైతుల నుంచి పంటల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ రైతులు ఎకరాకు రూ.10 వేలకు పైన పెట్టుబడి పెట్టి సాగు చేసుకుంటుంటే ఇప్పుడు నీరు లేక ఎండిపోవడం ఎంతో బాధాకరమన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేసి పంటలు ఎండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సంగం బ్యారేజీ ఆధునికీకరించి ఉంటే ఈ సాగునీటి కష్టాలు తప్పేవన్నారు. ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించిన కావలి కాలువలో నీటి పారుదల సామర్థ్యం తక్కువగా ఉందన్నారు. గత సీజన్లో కూడా సాగునీరు అందక పంటలు ఎండిపోయి, రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. కావలి కాలువ వెడల్పు చేసి వెయ్యి క్యూసెక్కులు పారించేలా చేస్తే రైతులకు సాగునీటి సమస్య ఉండదన్నారు. రాష్ట్రంలో రానున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కావలి కాలువ ఆధునికీకరణ చేస్తామన్నారు. ఆయకట్టు పరిధిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యను సోమశిల ప్రాజెక్టు ఎస్ఈ సోమశేఖర్‌తో ఫోన్లో ఎంపీ మాట్లాడారు. కలెక్టర్ శ్రీకాంత్ పంట పొలాలు ఎండకుండా తగిన జాగ్రత్తలు తీసుకునేందుకు అధికారులకు సూచనలు ఇస్తున్నారన్నారు. కావ లి కాలువ ఆయకట్టు రైతులు పడుతున్న సమస్యలను అక్కడే ఉన్న కావలి ఆర్డీఓ వెంకటరమణారెడ్డిని అడిగి తెలుసుకున్నారు. సంగం బ్యారేజీ వద్ద ఇసుక బస్తాలను వేసి ప్రస్తుతం నీటిని పారిస్తున్నామని ఆర్డీఓ ఎంపీ మేకపాటికి వివరించారు. ఎక్కువ ఎత్తులో ఇసుక బస్తాలను వేస్తే బ్యారేజీ కొట్టుకుని పోయే పరిస్థితి ఉందని ఆర్డీఓ చెప్పారు. సమస్యలు ఎన్ని ఎదురైనా ఎట్టి పరిస్థితుల్లో రైతుల అందరి పంట పొలాలకు నీరు చేరేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ మేకపాటి ఆర్డీఓకు సూచించారు. కావలి కాలువ నుంచి కావలి చెరువుకు నీటిని విడుదల చేయకుంటే ఆయకట్టు పరిధిలోని పంట పొలాలు పూర్తిగా ఎండిపోతాయని రైతులు ఎంపీకి మొరపెట్టుకున్నారు. అక్కడే ఉన్న నీటిపారుదలశాఖ డీఈ శ్రీదేవిని దీనిపై ఎంపీ వివరణ అడిగారు. వెంటనే నీటిని నింపే ఏర్పాట్లను చేయాలని సూచించారు. సాగు అవుతున్న పంట పొలాలు నీరు లేకుండా ఎండడం చూస్తూ ఎంతో ఆవేదన చెందుతున్నానని ఎంపీ మేకపాటి అన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్, కావలి నియోజకవర్గ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ కావలి కాలువ అధికారులు అవగాహన రాహిత్యం వల్లే రైతులకు సాగునీటి సమస్య వచ్చిందన్నారు. ఐఏబీ సమావేశానికి ముందే కావలి కాలువ కింద ఉన్న చెరువులకు సోమశిల ప్రాజెక్టులోని నీటితో నింపి ఉంటే ఇప్పుడు రైతులు ఈ సమస్యను ఎదుర్కొనే పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఇప్పుడు కాలువలోని నీటిని వదలడంతో ఆయకట్టు పరిధిలోని రైతులందరికీ ఆ నీరు అందక సమస్య ఏర్పడిందన్నారు. ప్రతి సీజన్లో రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యను చూసి ఈ సారైనా ఓ ప్రణాళిక ప్రకారం అధికారులు ముందుకెళ్లి ఉంటే బాగుం డేదన్నారు. కావలి రూరల్ మండలంలోని సర్వాయపాళెం, గౌరవరం, బోగోలు మండలం పాతబిట్రగుంట, దగదర్తి మండలం నారాయణపురం గ్రామాల్లో సాగునీరు లేక ఎండుతున్న పంట పొలాలను మేకపాటి పరిశీలించారు. కార్యక్రమంలో కావలి తహశీల్దార్ వెంకటేశ్వర్లు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కావలి పట్టణ నాయకులు పోనుగోటి శ్రీని వాసులురెడ్డి, కావలి రూరల్, అల్లూరు, బోగోలు, దగదర్తి మండలాల కన్వీనర్లు చింతం బాబుల్‌రెడ్డి, దండా కృష్ణారెడ్డి, పెంచలయ్య, గోగుల వెంకయ్య, వైఎస్సార్సీపీ యువజన విభాగం అల్లూరు మండల కన్వీనర్ మన్నెమాల సుకుమార్‌రెడ్డి, నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. -
నేడు పంటలను పరిశీలించనున్న ఎంపీ మేకపాటి
కావలి, న్యూస్‌లైన్: వైఎస్సార్సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి శనివారం బోగోలు, కావలి, దగదర్తి మండలాల్లో సాగునీరు లేక ఎండిన పంట పొలాలను పరిశీలిస్తారని పార్టీ కావలి నియోజకవర్గ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి తెలిపారు. కావలి రూరల్ మండలం గౌరవరం, సర్వాయపాళెం, బోగోలు పాతబిట్రగుంట, దగదర్తి మండలంలో ఆయన పర్యటన ఉంటుందన్నారు. రైతుల కష్టాలను తెలుసుకుని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తారని వివరించారు. -
మాటలు కాదు.. మనసు చూడండి
ఆత్మకూరు, న్యూస్‌లైన్: ‘మాటలు కాదు మనసు చూడండి. ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ప్రజల మధ్యలోనే ఉంటా’ అంటూ వైఎస్సార్సీపీ ఆత్మకూరు నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి గౌతంరెడ్డి తెలిపారు. ఆత్మకూరులోని పంచాయతీరాజ్ అతిథిగృహంలో శుక్రవారం ముఖ్యనేతలు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తన కుమారుడు గౌతమ్‌రెడ్డిని అందరికీ పరిచయం చేశారు. అనంతరం గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ ఎప్పటికీ ప్రజలకు అందుబాటులోనే ఉంటానని చెప్పారు. ‘ఇది మా ఆత్మకూరు. ప్రజల మధ్యే ఉంటా. మీ మధ్యలో ఉండి నడిపిస్తాం’ అన్నారు. తాను ఎప్పుడో నియోజకవర్గానికి రా వాల్సి ఉందని, అయితే పార్టీ అధినేత కొన్ని ముఖ్యమైన పనులు అప్పగించడంతో కొంచెం ఆలస్యమైందన్నారు. ‘నేను ఎప్పటికీ మీ వాడినే’ అని అన్నారు. సొంతగడ్డకు మేలు చేయాలనే తలంపుతో రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పారు. ఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ధి ఎలా ఉంటుందో చేసి చూపిస్తామన్నారు. మీ అందరి ఆశీర్వా దం కోసం వచ్చానని, ఆశీర్వదించాలని కోరారు.గౌతమ్‌రెడ్డి ప్రసంగం అందరిని ఆకట్టుకొంది. ఈ కార్యక్రమం మాజీ ఎమ్మెల్సీ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. నెల్లూరురూరల్ నియోజకవర్గ సమన్వయకర్త కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఎంపీ మేకపాటిని ఆత్మకూరులో కలిశారు. భారీ ర్యాలీ తొలుత గౌతమ్‌రెడ్డి, ఎంపీ మేకపాటి, ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ మురళీధర్ తదితరులు మాజీ ఎమ్మెల్సీ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి నివాసానికి చేరుకున్నారు. అక్కడి నుంచి జేఆర్‌పేటలోని వెంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లారు. అక్కడి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పూజలు నిర్వహించి అక్కడి నుంచి పట్టణంలో పాదయాత్ర నిర్వహించారు. పట్టణంలో రోడ్డు విస్తరణ పనులతో కూలిపోయిన దుకాణాలను పరిశీలించారు. అనంతరం దర్గాకు వెళ్లి ప్రార్థనలు నిర్వహించారు. అక్కడి నుంచి జెడ్పీ బాలికల ఉన్నతపాఠశాల సమీపంలోని వైఎస్సార్ విగ్రహం వద్దకు వెళ్లి పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల కన్వీనర్లు రాపూరు వెంకటసుబ్బారెడ్డి, ఇందూరు నారసింహారెడ్డి, ఐవీ కృష్ణారెడ్డి, పందిళ్లపల్లి సుబ్బారెడ్డి, కుమారస్వామిరెడ్డి, సంజీవులు, బండ్లమూడి అనిత, గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త బాలచెన్నయ్య, బాలకొండయ్య, సొసైటీ డెరైక్టర్లు దేవరపల్లి శ్రీనివాసులురెడ్డి, రఘురామిరెడ్డి, మైనార్టీ నేత ఖాజావలి, పాండురంగారెడ్డి, విజయకుమార్, స్థానిక నేతలు సూరా భాస్కర్‌రెడ్డి, పూనూరు రమేష్‌రెడ్డి, ఉల్సా పెంచలయ్య, జమీర్, గుండాల మునిరెడ్డి, జమీర్, గడ్డం శ్రీనివాసులు రెడ్డి, సర్పంచులు వేణుగోపాల్‌రెడ్డి, రఘురామిరెడ్డి పాల్గొన్నారు. హజ్రత్, అమ్మాజీలను దర్శించుకున్న గౌతమ్‌రెడ్డి అనుమసముద్రంపేట : స్థానిక శ్రీహజ్రత్ సయ్యద్ ఖాజా రహంతుల్లా నాయబ్ రసూల్ వారిని వైఎస్సార్సీపీ ఆత్మకూరు నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి గౌతమ్‌రెడ్డి దర్శించుకున్నారు. ఆత్మకూరులో శుక్రవారం పరిచయ కార్యక్రమం అనంతరం గౌతమ్‌రెడ్డి ఏఎస్‌పేట దర్గాకు వెళ్లారు. గౌతమ్‌రెడ్డితో పాటు పార్టీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్, మాజీ ఎమ్మెల్సీ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, మండల కన్వీనర్ పందిళ్లపల్లి సుబ్బారెడ్డికి దర్గా సజ్జదా నషీన్ షాగులాం నక్షాబంద్ హఫీజ్ పాషా స్వాగతం పలికారు. హజ్రత్, అమ్మాజీల సమాధులపై గలేపులు, పూలచద్దర్లు వేశారు. గౌతమ్‌రెడ్డితో పాటు నాయకులకు దేవుని వస్త్రాన్ని అందజేశారు. అనంతరం స్థానిక బస్టాండ్ సెంటర్లోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు నాయకులు అల్లారెడ్డి ఆనంద్‌రెడ్డి, దేవరపాటి శ్రీనివాసులురెడ్డి, అనంతసాగరం మండల కన్వీనర్ వెంకటసుబ్బారెడ్డి పాల్గొన్నారు.