ఆత్మకూరు/అనుమసముద్రంపేట, న్యూస్‌లైన్: సమైక్య రాష్ట్రానికి వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ కేంద్రపాల క మండలి సభ్యుడు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. అనుమసముద్రంపేట మండలం హసనాపురం నుంచి ఆది వారం వైఎస్సార్‌కాంగ్రెస్ ఆత్మకూరు నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి గౌతమ్‌రెడ్డి పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భం గా హసనాపురం సెంటర్లో ఏఎస్‌పేట మండల కన్వీనర్ పందిళ్లపల్లి సుబ్బారెడ్డి, పందిళ్లపల్లి గోపిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో ఎంపీ మేకపాటి మాట్లాడారు. జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కొనే పరిస్థితి రాష్ట్రంలో ఏ పార్టీకి లే దన్నారు. ఉప ఎన్నికల్లో ప్రజలు ఢిల్లీ పీఠం ద ద్దరిల్లేలా బుద్ధి చెప్పారన్నారు.
ప్రజాతీర్పు ధా టికి ఢిల్లీ పెద్దలు బెంబేలెత్తారన్నారు. మహానే త రాజశేఖరరెడ్డి వల్ల లబ్ధి పొందిన వారే ఆయ న కుటుంబానికి ద్రోహం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి ఓటర్లు తగిన బుద్ధి చె ప్పారని, మళ్లీ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి జీవించి ఉంటే రా ష్ట్రాన్ని చీల్చే ధైర్యం ఎవరికి ఉండేది కాదన్నా రు. తెలుగుజాతి గౌరవం ఢిల్లీకి దాసోహం కా కూడదనే ఉద్దేశంతో జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ స్థాపించారని ఎంపీ పే ర్కొన్నారు. ఆత్మకూరు నియోజకవర్గ సమన్వయకర్త గౌతమ్‌రెడ్డిపై అభిమానం చూపాలని, మీ రుణం తీర్చుకుంటామని ఆయన హామీ ఇ చ్చారు. జగన్‌కు గౌతమ్‌రెడ్డి సన్నిహితుడన్నా రు.
గౌతమ్‌రెడ్డి నాయకత్వంలో ఆత్మకూరు ని యోజకవర్గం అభివృద్ధి చెందుతుందని చెప్పా రు. వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్, సీనియర్ నేత నేదురుమల్లి పద్మనాభరెడ్డి, సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి సమన్వయకర్తలు కిలివేటి సంజీవయ్య, పాశం సునీల్‌కుమార్, కొమ్మి లక్ష్మయ్యనాయు డు, సీఈసీ సభ్యులు బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, ఆత్మకూరు, అనంతసాగరం, సంగం మండలాల కన్వీనర్లు ఇందూ రు నారసింహారెడ్డి, రాపూరు వెంకట సుబ్బారెడ్డి, ఐవీ కృష్ణారెడ్డి, పార్టీ నేతలు బిజివేముల వెంకటసుబ్బారెడ్డి,అల్లారెడ్డి సతీష్‌రెడ్డి, ఆనందరెడ్డి, దయాకర్‌రెడ్డి, జిల్లా ప్రచారకమిటీ కార్యదర్శి పాండురంగారెడ్డి పాల్గొన్నారు.
నాలుగేళ్ల పాలన అస్తవ్యస్తం
వింజమూరు : మహానేత వైఎస్సార్ మరణానంతరం నాలుగేళ్ల రాష్ట్ర పాలన అస్తవ్యస్తంగా మారిందని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ గువ్వల కృష్ణారెడ్డి నివాసంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర విభజన కోరుతూ కేంద్రానికి లేఖ ఇచ్చినప్పుడు ఆ పార్టీ నేతలు మూకుమ్మడి రాజీనామాలు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు.
విభజనపై జాతీయస్థాయి నాయకులు తమ వ్యతిరేకతను బాహాటంగా ప్రకటించడం వెనక జగన్‌మోహన్‌రెడ్డి కృషి ఉందన్నారు. ఆయన వెంట జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు గణపం బాలకృష్ణారెడ్డి, స్థానిక నాయకులు మలిరెడ్డి విజయ్‌కుమార్‌రెడ్డి, మద్దూరి చిన్ని కృష్ణారెడ్డి, రామాకోటారెడ్డి, గణపం మాలకొండారెడ్డి, గోపిరెడ్డి రమణారెడ్డి, దాట్ల విజయభాస్కర్‌రెడ్డి ఉన్నారు.
సమైక్య రాష్ట్రానికి జగనే సీఎం
Published Mon, Dec 23 2013 2:53 AM | Last Updated on Fri, Aug 17 2018 8:19 PM
Advertisement