చేజర్ల, న్యూస్‌లైన్: మరో నాలుగు నెలల్లో రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం తథ్యమని ఆ పార్టీ కేంద్రపాలకమండలి సభ్యుడు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. మండలంలోని కోటితీర్థం, యనమదల, బిల్లుపాడు గ్రామా ల్లో శనివారం మేకపాటి గౌతమ్‌రెడ్డి చేపట్టిన పాదయాత్రలో ఎంపీ పాల్గొన్నారు.
మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో జగన్ సీఎం కాబోతున్నారన్నారు. జగన్‌కు ప్రజల దీవెనలు, కార్యకర్తల అండదండలున్నాయన్నారు. కాంగ్రెస్, టీ డీపీ పన్నిన కుట్రలు, కుతంత్రాలు జగన్‌మోహన్‌రెడ్డిపై ఉన్న అభిమానం ముందు నిలువలేకపోయాయన్నారు. నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు కార్యకర్తలు సైనికుల్లా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు గౌతమ్‌రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారన్నారు. ప్రజల్లో ఒక్కడిగా ఉండి ఆత్మకూరు అభివృద్ధికి గౌతమ్ కృషి చేస్తారన్నారు. ఢిల్లీలో ప్రధానిని నిర్ణయించే కీలకపాత్ర జగన్ పోషిస్తారన్నారు.
జగన్ నాయకత్వంలో రాష్ట్రానికి స్వర్ణయుగం వస్తుందన్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకించి సమైక్యాంధ్రకు కృషి చేస్తున్న మహోన్నత వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి అని కొనియాడారు. జిల్లాలో వైఎస్సార్‌సీపీ అన్ని అసెంబ్లీ స్థానాలతో పాటు పార్లమెంటు సీటును కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆత్మకూరు నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి గౌతమ్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్, మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, ఆత్మకూరు మండల కన్వీనర్ ఇందూరు నారసిం హారెడ్డి, నాయకులు పులిమి జగన్‌మోహన్‌రెడ్డి, మందా రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.
నాలుగు నెలల్లో జగన్ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం : ఎంపీ మేకపాటి
Published Sun, Jan 19 2014 5:09 AM | Last Updated on Fri, Aug 17 2018 8:19 PM
Advertisement