రాజ్నాథ్తో చంద్రబాబు సమావేశం
న్యూఢిల్లీ : కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా విభజన చట్టంలో అమలు చేయాల్సిన అంశాలపై చర్చించినట్లు సమాచారం. కాగా అంతకు ముందు చంద్రబాబు...కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతితో భేటీ అయ్యారు. కృష్ణా బోర్డు వివాదంపై ఆయన చర్చించారు.