'గేటు వద్ద కూడా ఉండొద్దు..'
న్యూఢిల్లీ: ఇస్లామాబాద్ లో జరిగిన సార్క్ హోంమంత్రుల సదస్సుకు భారత జర్నలిస్టులను అనుమతించని పాకిస్తాన్ వారిని కనీసం ప్రవేశ ద్వారం వద్ద కూడా ఉండనివ్వలేదని వెల్లడైంది. సార్క్ దేశాల ప్రముఖులను పాక్ హోంమంత్రి నిసార్ ప్రవేశ ద్వారం వద్ద ఆహ్వానిస్తున్నపుడు భారత జర్నలిస్టులు అక్కడే ఉన్నారు. భారత హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ రాగానే పాక్ జర్నలిస్టులు ఫోటోలు తీసేందుకు సన్నద్ధమవుతుండగా వీరూ వెళ్లారు. అయితే అక్కడ నుండి వెళ్లిపోవాలని, గేటు బయట నిలబడేందుకూ కూడా భారత్ జర్నలిస్టులకు అనుమతి లేదని పాక్ అధికారులు తేల్చి చెప్పారు.