వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శుల నియామకం
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ కార్యదర్శులుగా ముగ్గురిని నియమించారు. భవనం భూషణ్ (గుంటూరు వెస్ట్), రాజుల భాస్కర్‌రెడ్డి (పులివెందుల), వరికూటి కొండారెడ్డి (కందుకూరు) పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శులుగా నియమితులయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్టు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వెలువడిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.