rajyasabha candidate
-
‘దళితులను చంద్రబాబు కించపరుస్తున్నాడు’
సాక్షి, ప్రకాశం : సానుభూతి పొందడానికి దళిత వ్యక్తిని ఎన్నికల్లో పోటీలో ఉంచి చంద్రబాబు దళితులను కించపరుస్తున్నారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విమర్శించారు. రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు దళితులతో రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం ఉన్న 21 మంది ఎమ్మెల్యే సీట్లతో రాజ్య సభ సీటు గెలిచే అవకాశం లేకున్న చంద్రబాబు దళిత వ్యక్తి వర్ల రామయ్యను పోటీలో పెట్టడం సానుభూతికోసమేనన్నారు. మంగళవారం మార్కాపురంలో విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. 2016లో దళిత వ్యక్తి టీ పుష్పరాజ్‌ను రాజ్యసభకు పంపుతానని చెప్పి చివరి నిమిషంలో టీజీ వెంకటేష్‌ను రాజ్యసభకు పంపిన చరిత్ర చంద్రబాబుదని దుయ్యబట్టారు. 2018లో దళిత వ్యక్తి వర్ల రామయ్యకు సీటు ఇస్తానని చెప్పి రెండు గెలిచే సీట్లు ఉన్న సీఎం రమేష్, కనకమేడల రవీంద్ర కుమార్‌ను రాజ్యసభకు పంపించి రామయ్యను మోసం చేశారని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందరికీ సమన్యాయం చేస్తున్నారని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. -
రాజ్యసభకు ‘కళింగ’ సామంత
భువనేశ్వర్: విద్యాసంస్థలు స్థాపించి వేలాది మందికి ఉచితంగా విద్య, వసతి సౌకర్యాలు కల్పిస్తున్న ఒడిశాకు చెందిన విద్యావేత్త, సామాజిక కార్యకర్త అచ్యుత సామంత ఆ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్యసభ సభ్యులందరిలోకి పేద ఎంపీగా నిలిచారు. గురువారం బీజేడీ తరఫున ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. సామంత సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆయన పేరు మీద సొంత ఆస్తిపాస్తులు లేవు. బ్యాంకు ఖాతాలోరూ. 3.6 లక్షల నగదు, ఊరిలో 84 వేల విలువైన వారసత్వ ఆస్తే ఉంది. ఒడిశాలో కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ(కేఐఐటీ), కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్(కేఐఎస్ఎస్) విద్యాసంస్థల ద్వారా ఒకటో తరగతి నుంచి పీజీ వరకూ ఉచిత విద్య అందిస్తున్నారు. ఉచిత వసతి, భోజనం, వైద్యసేవలందిస్తున్నారు. -
సాయిరెడ్డి నైతిక విలువలకు కట్టుబడ్డారు: వైఎస్ జగన్
హైదరాబాద్ : రాజకీయాలు అంటే ప్రజా జీవితానికి సంబంధించినవని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. సుదీర్ఘ సమావేశం అనంతరం వైఎస్ జగన్ ... రాజ్యసభ అభ్యర్థిగా పార్టీ ప్రధాన కార్యదర్శి విజయ సాయిరెడ్డి పేరును ప్రకటించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ మనుషుల మధ్య సంబంధాలను డబ్బుతో కొనాలని చంద్రబాబు యత్నిస్తున్నారన్నారు. చంద్రబాబు ఇవాళ చేస్తున్న రాజకీయాలు దుర్మార్గమైనవని ఆయన మండిపడ్డారు. ఎమ్మెల్యేలను కొంటున్న చంద్రబాబు అదే ఎమ్మెల్యేలను నట్టేట ముంచుతున్నారని విమర్శించారు. ఒక్క మాట కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుకొచ్చిందని వైఎస్ జగన్ అన్నారు. పార్టీ ఎలాంటి సందర్భాల్లో పుట్టుకొచ్చిందో అందరికీ తెలుసన్నారు. సాయిరెడ్డి విలువలకు కట్టుబడ్డారని, అక్రమ కేసుల్లో తనకు వ్యతిరేకంగా చెప్పమని ఆయనపై ఒత్తిడి తెచ్చారని వైఎస్ జగన్ అన్నారు. కానీ సాయిరెడ్డి సత్యాన్ని నమ్ముకున్నారని, వాస్తవాలనే చెప్తానని స్పష్టం చేశారన్నారు. అందుకే తనపై కేసుల సందర్భంగా ఆయనను కూడా నిందితుడిగా చేర్చారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఎన్ని ఒత్తిడులు ఎదురైనా సాయిరెడ్డి నైతిక విలువలకు కట్టుబడి, అండగా ఉన్నారన్నారు. విశ్వసనీయులకు సరైన స్థానం కల్పిస్తామనే సంకేతం పంపడానికే ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించినట్లు వైఎస్ జగన్ తెలిపారు.