rakesh chowdhury
-
ఏనుగుల దాడిలో టీడీపీ యువనేత మృతి
తిరుపతి, సాక్షి: చంద్రగిరి మండలంలో ఘోరం చోటు చేసుకుంది. ఏనుగుల దాడిలో టీడీపీ యువనేత రాకేశ్ చౌదరి(33) మృతి చెందాడు. రాకేష్ చంద్రగిరి ఐటీడీపీ అధ్యక్షుడిగా, కందులవారిపల్లి ఉప సర్పంచ్‌గా ఉన్నాడు. తమ పార్టీ యువనేత హఠాన్మరణంపై తెలుగు దేశం పార్టీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలం చిన్నరామాపురం, కొంగరవారిపల్లిలో శనివారం రాత్రి ఏనుగులు సంచరించాయి. మామిడిమాను గడ్డ గ్రామ పంటపొలాలపై ఏనుగుల గుంపు దాడి చేస్తుందన్న సమాచారంతో రాకేష్‌తో పాటు మరికొందరు అక్కడికి వెళ్లారు. అరుస్తూ వాటిని కొంతదూరం తరిమారు. ఈ క్రమంలో.. అవి తిరగబడడంతో పరుగులు తీశారు. ఓ ఏనుగు వాళ్లపై దాడికి దిగడంతో అంతా చెట్లెక్కి లైట్లు ఆఫ్ చేసుకున్నారు. అయితే.. రాకేష్ వాళ్లలో ముందు ఉండడం, తెల్ల చొక్కా ధరించి ఉండడంతో, పైగా అతని చేతిలో లైట్ ఆన్ చేసి ఉండడంతో ఏనుగు అతనిపై దాడికి దిగింది. తొండంతో ఎత్తి చెట్లకు కొట్టి.. కిందపడేసి తొక్కింది. దీంతో రాకేష్ అక్కడికక్కడే మృతి చెందాడు.రాకేష్‌కు భార్య, ఒక కూతురు ఉన్నారు. ఈయన సీఎం కుటుంబానికి సన్నిహితుడిగా తెలుస్తోంది. రాకేశ్ మృతి వార్త తెలుసుకొని ఎమ్మెల్యే పులివర్తి నాని ఘటనాస్థలికి చేరుకొని స్థానికులతో మాట్లాడారు. -
రేప్ చేసి, వీడియోలు బయటపెడతానని..
కోల్‌కతా: ఉన్నత చదువుల కోసం ఒడిశా నుంచి కోల్‌కతా వెళ్లిన ఓ పెళ్లికాని మహిళ(30)పై ఓ వ్యాపారవేత్త దారుణానికి తెగబడ్డాడు. ఓ పార్టీలో కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమైన ఆ వ్యక్తి ఆమె పారిట శాపంలా మారాడు. దాదాపు ఏడాదిపాటు లైంగికి దాడికి పాల్పడ్డాడు. రెండు సార్లు అబార్షన్ కూడా చేయించాడు. క్రమంగా అతడి వేధింపులు మరింత ఎక్కువకావడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా వారు నిందితుడిని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే..ఒడిశాకు చెందిన 30 ఏళ్ల మహిళ కోల్‌కతాలో ఉండి చదువుకుంటోంది. తన స్నేహితురాళ్లతో కలిసి జోద్పూర్ గార్డెన్స్‌లో ఓ ఫంక్షన్‌కు వెళ్లింది. ఆ పార్టీలోనే రాకేశ్ చౌదరీ, ఆయన భార్య ఆమెకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఒకసారి పార్టీకి రావాలంటూ ఆహ్వానించిన రాకేశ్ ఆమెకు మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్స్ ఇచ్చాడు. ఆ తర్వాత బాధితురాలిని కోల్‌కతాలోని బైపాస్ రోడ్డులో ఉన్న తన గెస్ట్‌హౌజ్‌కి తీసుకెళ్లాడు. పూర్తిగా మద్యం తాగించి స్పృహకోల్పోయిన తర్వాత అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ క్రమంలో ఫొటోలు, వీడియోలు తీశాడు. తర్వాత తాను పిలిచిన ప్రతిసారి రాకుంటే ఫొటోలు బయటపెడతానని బెదరించి ఏడాదిపాటు దుర్మార్గానికి పాల్పడ్డాడు. రెండుసార్లు గర్భస్రావం చేయించాడు. ఆ తర్వాత కూడా అతడు వేధింపుల స్థాయి పెంచడంతో భరించలేని బాధితురాలు చివరికి పోలీసులను ఆశ్రయించడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆమెను వైద్య పరీక్షలకు తరలించారు.