Rakesh Maria and Director General of Police
-
తెరపైకి ఆ పోలీస్ కమీషనర్ బయోపిక్..
Mumbai Former Police Commissioner Rakesh Maria Biopic By Rohit Shetty: బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి యాక్షన్ అండ్ కామెడీ సినిమాలకు పెట్టింది పేరు. ఇటీవల అక్షయ్ కుమార్‌తో సూర్యవంశీ తెరకెక్కించి హిట్ కొట్టాడు. అమెజాన్ ఓటీటీ కోసం ఇండియన్ పోలీస్ ఫోర్స్ అనె వెబ్ సిరీస్‌ను రోహిత్ శెట్టి డైరెక్ట్ చేయనున్న విషయం తెలిసిందే. తాజాగా రోహిత్ శెట్టి మరో సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. అది కూడా ముంబై ఎక్స్ పోలీస్ కమీషనర్ రాకేష్ మారియా బయోపిక్‌ను తెరకెక్కించనున్నాడు రోహిత్. రాకేష్ మారియా తన కెరీర్లో సాధించిన విజయం ఆధారంగా ఈ బయోపిక్ రూపుదిద్దుకోనుంది. ఈ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్నట్లు రోహిత్ శెట్టి అధికారికికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా రోహిత్ శెట్టి మాట్లాడుతూ 'రాకేష్ మారియా తన 36 ఏళ్ల అద్భుతమైన ఉద్యోగ ప్రయాణంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఆయన 1993 ముంబైలో జరిగిన పేలుళ్ల నుంచి అండర్ వరల్డ్ ముప్పు, 2008లోని 26/11 ముంబై ఉగ్రదాడుల వరకు ఎన్నో చూశారు. నిజ జీవితంలోని ఈ సూపర్ కాప్ ధైర్య, సాహసాల ప్రయాణాన్ని తెరపైకి తీసుకురావడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను.' అని తెలిపారు. కాగా ఐపీఎస్ అధికారి అయిన రాకేష్ మారియా 1981వ బ్యాచ్ నుంచి సివిల్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. 1993లో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా (ట్రాఫిక్) ఉన్న రాకేష్ మారియా ముంబై వరుస పేలుళ్ల కేసును ఛేదించారు. తర్వాత ముంబై పోలీస్ క్రైమ్ బ్రాంచ్‌కు డీసీపీగా, ఆ తర్వాత జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ అధికారిగా మారారు. 2008లో 26/11 ముంబై దాడులను పరిశోధించే బాధ్యతను కూడా మారియాకు అప్పగించారు. చదవండి: ప్రముఖ సింగర్ కన్నుమూత.. కరోనా కారణంగా చికిత్స ఆలస్యం ! అల్లు అర్జున్‌కు నెట్‌ఫ్లిక్స్ స్పెషల్ విషెస్.. దేనికంటే ? -
అమరులకు ఘననివాళి
సాక్షి, ముంబై: ముంబైలో జరిగిన 26/11 ఘటనలో ముష్కరుల దాడిలో బలైన అమాయకులకు, అమరవీరులకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తోపాటు ఇతర మంత్రులు, రాజకీయనాయకులు, సామాన్య ప్రజలు నివాళులర్పించారు. ముంబైనగరంపై ముష్కరుల దాడులు జరిగి బుధవారం నాటికి ఆరేళ్లు పూర్తిఅయ్యాయి. ఈ నేపథ్యంలో ముంబై, ఠాణే, పుణేలతోపాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో నివాళి అర్పించారు. అదే విధంగా రక్తదాన శిబిరాలు, ర్యాలీలు నిర్వహించారు. పుణేలో ఉన్న దేవేంద్ర ఫఢ్నవిస్ అమరులకు నివాళులర్పించిన అనంతరం ఇచ్చిన సందేశంలో పోలీసు శాఖను మరింత ఆదునికీకరించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని దేవేంద్ర ఫడ్నవిస్ ప్రకటించారు. పోలీసులకు అత్యాధునిక ఆయుధాలను అందిస్తామన్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పుణే పర్యటనలో ఉన్నందున ప్రొటోకాల్‌లో భాగంగా రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావుతోపాటు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫఢ్నవిస్ కూడా ఆయన వెంటే ఉన్నారు. మరోవైపు ముంబై మరీన్లైన్స్ పోలీసు జింఖానాలో పోలీసు అమరవీరుల స్మారకం వద్ద ఉదయం 10 గంటలకు అనేక మంది నివాళులు అర్పించారు. విద్యాశాఖ మంత్రి వినోద్ తావ్డే, ప్రకాష్ మెహతాతోపాటు మహారాష్ట్ర డీజీపీ సంజీవ్ దయాల్, ముంబై పోలీసు కమిషనర్ రాకేష్ మారియా నివాళులు అర్పించినవారిలో ఉన్నారు. అదే విధంగా అమరువీరుల కుటుంబ సభ్యులతో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా నివాళులు అర్పించారు. ఇదిలా ఉండగా, సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ అమరవీరులను మరచిపోయారంటూ ఎన్సీపీ నాయకులు అజిత్ పవార్ ఆరోపించారు.