చింతచెట్టు నుంచి జారి పడి కూలీ మృతి
గోరంట్ల(సోమందేపల్లి): మండలంలోని బుడ్డపల్లి గ్రామంలో చింతచెట్టు నుంచి జారీ పడి రామకిష్టప్ప (55) మృతి చెందిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రామచంద్రప్ప చింత పొలంలో చింతకాయలను దులపడానికి కూలీకి వెళ్లాడు. చెట్టు ఎక్కగా ప్రమాదపుశాత్తు జారి కింద పడడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.