rakshith
-
కష్టం వృథా కాలేదు – తమ్మారెడ్డి భరద్వాజ
‘‘నా నలభైఏళ్ల కెరీర్లో నాకు గుర్తుండిపోయే చిత్రం ‘పలాస’. ఈ సినిమాలో నటీనటుల అద్భుతమైన హావభావాలకు ప్రేక్షకులు మైమరచిపోతున్నారు. అద్భుతమైన రివ్యూస్ వచ్చాయి. మా కష్టం వృథా కాలేదని భావిస్తున్నాను’’ అన్నారు దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. రక్షిత్, నక్షత్ర జంటగా కరుణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస’. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్ అట్లూరి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ నెల 6న విడుదలైంది. తమ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని చిత్రబృందం చెబుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో రక్షిత్ మాట్లాడుతూ– ‘‘మా సినిమాకు మంచి రివ్యూస్ రావడం హ్యాపీ. సినిమాలోని ప్రతి సన్నివేశం గురించి ప్రేక్షకులు మాట్లాడుకోవడం చూస్తుంటే సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా విజయం మరిన్ని మంచి సినిమాలు చేయడానికి ధైర్యాన్నిచ్చింది’’ అన్నారు కరుణకుమార్. ‘‘దర్శకుడి ఆలోచన, నిర్మాత ప్రయత్నం సినిమాను నిలబెట్టాయి. నటీనటుల పాత్రలతో పాటు నా పాత్రకూ మంచి స్పందన లభిస్తోంది’’ అన్నారు సంగీత దర్శకుడు–నటుడు రఘుకుంచె. ‘‘పలాస’లాంటి చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు హీరోయిన్ నక్షత్ర. -
ఆ సినిమా చూశాక ధైర్యం వచ్చింది : నాగశౌర్య
‘‘పలాస 1978’ లాంటి కథలు చేయాలని ఉన్నా లోపల చాలా భయం ఉంటుంది. ఇలాంటి కథలు నిర్మించాలంటే నిర్మాతకు చాలా ధైర్యం ఉండాలి. అయితే ఈ సినిమా చూశాక చాలా ధైర్యం వచ్చింది’’ అన్నారు హీరో నాగశౌర్య. రక్షిత్, నక్షత్ర జంటగా కరుణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ నెల 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ– ‘‘నా 40 ఏళ్ల సినీ కెరీర్లో ‘పలాస 1978’ మంచి సినిమా అని నమ్మకంగా చెప్పగలను. ఈ సినిమా పోస్టర్‌పై నా పేరు ఉన్నందుకు గర్వపడుతున్నాను’’ అన్నారు. ‘‘తమిళంలో వెట్రిమారన్లాంటి దర్శకుల్ని చూసి స్ఫూర్తి పొందుతుంటాం.. కానీ మనకూ అలాంటి దర్శకులున్నారని కరుణ్‌కుమార్ గుర్తు చేశాడు’’ అన్నారు దర్శకుడు మారుతి. ‘‘పలాస’ నా ఫస్ట్ సినిమాగా చేద్దామనుకోలేదు. నాకు చాన్స్ ఇచ్చిన ప్రసాద్‌గారికి, తమ్మారెడ్డి భరద్వాజగారికి రుణపడి ఉంటాను’’ అన్నారు కరుణ్‌కుమార్. నిర్మాతలు రాజ్ కుందుకూరి, ‘మధుర’ శ్రీధర్, సంగీత దర్శకులు రఘు కుంచె, కళ్యాణీ మాలిక్, పాటల రచయిత భాస్కర భట్ల, సిరాశ్రీ తదితరులు మాట్లాడారు. -
గ్యాంగ్‌స్టర్ సినిమాలంటే ఇష్టం
రక్షిత్, నక్షత్ర జంటగా కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్ అట్లూరి నిర్మించారు. ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసిన పూరి జగన్నాథ్ మాట్లాడుతూ– ‘‘ఇలాంటి గ్యాంగ్‌స్టర్ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. అందరూ తిడుతున్నారని గ్యాంగ్‌స్టర్ సినిమాలు తీయడం లేదు. ‘పలాస 1978’ టీజర్ నాకు చాలా చాలా నచ్చింది. హీరో హీరోయిన్లు బాగున్నారు. కరుణ కుమార్ పనితనం నచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘పూరీగారు మా టీజర్‌ను విడుదల చేయడం అదృష్టంగా భావిస్తున్నాం. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్, ఓ సొగసరి పాటతో పాటు టీజర్‌కు కూడా మంచి స్పందన వస్తోంది. త్వరలో సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు కరుణ కుమార్. ఈ సినిమాలో నటించడంతో పాటు సంగీతం కూడా అందించారు రఘు కుంచె. -
సీక్వెల్ పార్టీ
బడ్జెట్ 4 కోట్లు.. వసూళ్లు 50 కోట్లు. ఇలాంటి సినిమా తీస్తే తీసినవాళ్లు, కొన్నవాళ్లు పార్టీ చేసుకుంటారు. మంచి సినిమా చూసినందుకు ఆడియన్స్ పండగ చేసుకుంటారు. ‘కిరిక్ పార్టీ’ అలాంటి సినిమానే. 2016లో విడుదలైన ఈ రొమాంటిక్ కామెడీ మూవీకి రిషబ్ శెట్టి దర్శకత్వం వహించారు. రక్షిత్ శెట్టి మెయిన్ లీడ్ చేశారు. ఈ సూపర్ డూపర్ హిట్ మూవీకి సీక్వెల్ తీయాలనే ప్లాన్‌లో ఉన్నామని రక్షిత్ శెట్టి పేర్కొన్నారు. ఆల్రెడీ ‘కిరిక్ పార్టీ 2’ అనే టైటిల్‌ని కూడా రిజిస్టర్ చేసేశారు. అయితే రక్షిత్ ప్రస్తుతం ‘అవనే శ్రీమన్నారాయణ’ అనే సినిమాతోనూ, రిషబ్ శెట్టి వేరే సినిమాతోనూ బిజీగా ఉన్నారు. అవి పూర్తయ్యాక సీక్వెల్‌ని ప్రారంభించాలనుకుంటున్నారు. ‘‘మోస్ట్లీ ఈ ఏడాది మేలో స్టార్ట్ చేసే అవకాశం ఉంది’’ అని రక్షిత్ పేర్కొన్నారు. అన్నట్లు.. ‘కిరిక్ పార్టీ’ తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. నిఖిల్ హీరోగా ‘కిరాక్ పార్టీ’ పేరుతో ఈ సినిమా వచ్చే నెల 9న విడుదల కానుంది. -
విజయవాడ టు లండన్ బాబులు
‘‘సినిమాల్లో నటించడం వల్ల ఇందులోని ఇబ్బందులు తెలిశాయి. ఇప్పుడు సినిమాపై మరింత గౌరవం పెరిగింది’’ అన్నారు రక్షిత్. చిన్నికృష్ణ దర్శకత్వంలో ఆయన హీరోగా ఏవీఎస్ స్టూడియో సమర్పణలో మారుతి టాకీస్ పతాకంపై రూపొందిన సినిమా ‘లండన్ బాబులు’. తమిళ చిత్రం ‘ఆండవన్ కట్టళై’కు రీమేక్ ఇది. ఈ నెల 17న చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా రక్షిత్ మాట్లాడుతూ– ‘‘విజయవాడలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివాను. నాన్న వరప్రసాదరావుగారి ద్వారా మారుతిగారు తెలుసు. ఇంజనీరింగ్ చదివే రోజుల్లోనే సినిమాలపై ఆసక్తి ఉందా? అని నన్ను అడిగారాయన. ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మారుతిగారిని కలిశాను. ఈ సినిమాను తెరకెక్కించే ప్రక్రియలో భాగంగానే నన్ను హీరోగా ఎంపిక చేసుకున్నారు. ఓ దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువకులు విదేశాలకు వెళ్లి ఎక్కవ డబ్బులు సంపాదించాలనుకుంటారు. అందుకోసం వాళ్లు ఏం చేశారన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందించారు. నేను గాంధీ అనే రోల్ చేశాను. రిపోర్టర్ సూర్యకాంతంగా స్వాతి నటించారు. స్వాతి వంటి సీనియర్ నటితో నటించడం చాలా హ్యాపీగా ఉంది. సినిమాలో మా ఇద్దరి మధ్య లవ్ సీన్స్ ఉన్నాయి. స్వాతి నటన సినిమాకు ప్లస్. ఈ సినిమాతో ఫస్ట్ సక్సెస్ అందుకుంటానన్న నమ్మకం ఉంది. భవిష్యత్‌లో నటుడిగానే కొనసాగాలనుకుంటున్నాను. ఆడియన్స్‌ను ఎట్రాక్ట్ చేసే కథలను ఎంచుకోవాలనుకుంటున్నాను. డ్యాన్స్, డైలాగ్ డిక్షన్ ఇంప్రూవ్ చేసుకుంటున్నాను. నా నెక్ట్స్ మూవీ మారుతిగారితోనే ఉంటుంది’’ అన్నారు. -
పాస్‌పోర్ట్ తిప్పలు!
‘‘జీవితాన్ని సినిమా పెద్దగా చూపిస్తే, టీవీ చిన్నగా చూపెడుతుంది. కానీ, జీవితాన్ని జీవితంగా చూపెట్టేది నాటకం మాత్రమే. ఈ టీజర్, సాంగ్ చూస్తుంటే నాకు నాటకాల్లో పనిచేసిన రోజులు గుర్తుకొచ్చాయి. నిర్మాతగా మారుతిగారు నాకు ఇన్స్పిరేషన్. కొత్త కాన్సెప్ట్ సినిమాలు ఆడితేనే కొత్త వారు ఇండస్ట్రీకి రావడానికి ఆసక్తి చూపిస్తారు’’ అని దర్శకుడు హరీష్ శంకర్ అన్నారు. రక్షిత్, స్వాతి జంటగా చిన్నికృష్ణ దర్శకత్వంలో ఏవీఎస్ స్టూడియో సమర్పణలో దర్శకుడు మారుతి నిర్మిస్తున్న చిత్రం ‘లండన్ బాబులు’. కె. సంగీతం అందించిన ఈ సినిమాలోని తొలి పాటను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హరీష్ శంకర్, స్పెషల్ టీజర్‌ను దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేశారు. మారుతి మాట్లాడుతూ– ‘‘పాస్‌పోర్ట్ కోసం పడే తిప్పల్ని ఈ చిత్రంలో చెప్పాం. స్వాతిలో మంచి రైటర్, డైరక్టర్ కూడా ఉన్నారు. తనకి కథ నచ్చి, చేస్తాననగానే హ్యాపీగా అనిపించింది. ఈ సినిమా రెగ్యులర్‌గా ఉండదు. నేను నిర్మించే సినిమాలకు పేరు వేసుకోవడానికి చాలా ఆలోచిస్తాను. కానీ, ఈ చిత్రం బాగా నచ్చడంతో పేరు వేసుకున్నా’’ అన్నారు. ‘‘లండన్ వెళ్లాలనుకున్న ఓ యువకుడి కథే ఈ చిత్రం’’ అన్నారు చిన్నికృష్ణ. రక్షిత్, స్వాతి, ఎ.వి.ఎస్. ప్రకాశ్, మల్లిక్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్ కె. నాయుడు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: కిరణ్ తలసిల, దాసరి వెంకట సతీష్. -
లండన్ ప్రయాణం
రక్షిత్, కలర్స్ ‘స్వాతి’ జంటగా నటిస్తున్న చిత్రం ‘లండన్ బాబులు’. తమిళ చిత్రం ‘ఆండవన్ కట్టళై’’కి ఈ చిత్రం రీమేక్. ఏవీఎస్ స్టూడియోస్ సమర్పణలో దర్శక– నిర్మాత మారుతి తెలుగులో నిర్మిస్తున్నారు. చిన్నికృష్ణ దర్శకుడు. చిత్రం ఫస్ట్‌లుక్‌ను శనివారం విడుదల చేశారు. జూన్‌లో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘హీరో లండన్ ఎలా వెళ్లాడు? ఎందుకు వెళ్లాడన్నది చిత్రకథాంశం’’ అన్నారు నిర్మాత. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: కిరణ్ తలసిల, దాసరి వెంకట సతీష్.