rallapadu
-
రాళ్లపాడు రైతులను పట్టించుకోని బాబు
-
రాళ్లపాడుకు జలసిరులు
వర్షాధారిత ప్రాజెక్ట్‌గా మిగిలిన రాళ్లపాడుకు మహర్దశ పట్టింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న చర్యలతో జలసిరులు పొంగనున్నాయి. 1.1 టీఎంసీల సామర్థ్యం కలిగిన రాళ్లపాడు ప్రాజెక్ట్ నియోజకవర్గ రైతాంగానికి ప్రధాన సాగునీటి వనరు. ఈ ప్రాజెక్ట్ కింద ఉన్న భూములను సస్యశ్యామలం చేయాలనే తలంపుతో ముఖ్యమంత్రి ఇప్పటికే సోమశిల జలాలను కేటాయించగా, తాజాగా వెలిగొండ నుంచి కూడా నీటి వాటాను కల్పిస్తూ చర్యలు తీసుకున్నారు. ఈ నిర్ణయంతో రాళ్లపాడులో నిరంతరం జలకళ తాండవియనుంది. కందుకూరు(పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా): రాళ్లపాడు ప్రాజెక్ట్.. రతనాల ప్రాజెక్ట్‌గా మారనుంది. కేవలం వర్షాధారితంగా నీటిని నింపుకునే ఈ ప్రాజెక్ట్‌కు ఇక నుంచి పుష్కలంగా నీటి వనరులు అందనున్నాయి. అటు పెన్నా, ఇటు కృష్ణా నది జలాలు తరలి రానున్నాయి. ఇప్పటికే సోమశిల ప్రాజెక్టు నుంచి ఉత్తర కాలువ ద్వారా రాళ్లపాడు ప్రాజెక్టుకు పెన్నానది జలాలు వస్తుండగా, భవిష్యత్‌లో వెలిగొండ ప్రాజెక్టు నుంచి కృష్ణా నది జలాలు రానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం జీఓ కూడా విడుదల చేసింది. మరో పక్క రాళ్లపాడు ప్రాజెక్ట్ ఆయకట్టు పరిధిని పెంచేందుకు ఎడమ కాలువ పొడిగింపునకు రూ.27 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. దీంతో రాళ్లపాడు ప్రాజెక్టు కింద సాగయ్యే పంటలకు, తాగునీటి అవసరాలకు పుష్కలంగా నీరు అందనుంది. నీటి వనరులతో సస్యశ్యామలం రాళ్లపాడు ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 1.1 టీఎంసీలు. అధికారిక, అనధికారిక ఆయకట్టు కలుపుకుని మొత్తం 25 వేల ఎకరాలు సాగు అవుతుందని అంచనా. ఈ ప్రాజెక్ట్ పరిధిలోని 130 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. అటు పంటలకు, ఇటు తాగునీటి అవసరాలకు దాదాపు 2.2 టీఎంసీల నీరు అవసరం అవుతుంది. తాజా నిర్ణయంతో సోమశిల జలాలు 1.5 టీఎంసీలు, వెలిగొండ జలాలు 1.17 టీఎంసీలు మొత్తం 2.67 టీఎంసీల నీరు అదనంగా ప్రాజెక్టులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రాజెక్ట్ కింద 20.14 కి.మీ. పొడవు ఉండే కుడి కాలువ పరిధిలో లింగసముద్రం, గుడ్లూరు, కొండాపురం మండలాల్లో 14,500 ఎకరాల ఆయకట్టు ఉంది. 3 కి.మీ. పొడవు ఉండే ఎడమ కాలువ కింద లింగసముద్రం, వలేటివారిపాళెం మండలాల్లో 1,500 ఎకరాల ఆయకట్టు ఉంది. పూర్తిగా వర్షాధార ప్రాజెక్ట్ కావడంతో వర్షాలు పడి ప్రాజెక్ట్ నిండితేనే పంటలు పండుతాయి. గడిచిన దశాబ్దన్నర కాలంలో కేవలం రెండు, మూడు సార్లే పూర్తి స్థాయిలో పంటలు పండాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో సోమశిల ఉత్తర కాలువ ద్వారా 1.5 టీఎంసీల నీటిని రాళ్లపాడు ప్రాజెక్ట్‌కు కేటాయించారు. 1.17 టీఎంసీల వెలిగొండ జలాలు వెలిగొండ ప్రాజెక్టు నుంచి 1.17 టీఎంసీల నీటిని కేటాయిస్తూ రెండు రోజుల క్రితం ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. నీటి కేటాయింపుతో పాటు కాలువ పనులకు రూ.6.14 కోట్లు కేటాయించారు. వెలిగొండ ప్రాజెక్టు నుంచి ఉదయగిరికి నీటిని తరలించే ఈస్ట్రన్ మెయిన్ కెనాల్ నుంచి రాళ్లపాడు ప్రాజెక్ట్‌లోకి నీటిని మళ్లించనున్నారు. ఇక్కడి నుంచి రాళ్లపాడు వరకు మొత్తం 57 కి.మీ. దూరం ఉంది. కేవలం 4 కి.మీ. కాలువ తవ్వడం ద్వారా ఉప్పువాగు నుంచి నక్కలగండి చెరువుకు మళ్లించి అక్కడి నుంచి మన్నేరు ద్వారా రాళ్లపాడు ప్రాజెక్టులోకి నీటిని తరలించాలనేది ప్రతిపాదన. త్వరలో టెండర్ల కేటాయించి, పనులు ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. ఎడమ కాలువ పొడిగింపునకు రూ.27 కోట్లు రామాయపట్నం పోర్టు భూమి పూజకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాళ్లపాడు ప్రాజెక్టు అభివృద్ధికి నిధులు కేటాయించారు. ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు ప్రాజెక్టు ఎడమ కాల్వ పొడిగింపు పనులు చేపట్టేందుకు రూ.27 కోట్లు మంజూరు చేశారు. ప్రస్తుతం 3 కి.మీ. పొడవు ఉన్న కాలువను 15.95 కి.మీ. మేర పొడిగించనున్నారు. తద్వారా కాలువ పరిధిలో ఉన్న ఆయకట్టు 1,500 ఎకరాల నుంచి 4 వేల ఎకరాలకు పెరుగుతోంది. చీమలపెంట, శాఖవరం, వీఆర్ కోట, కలవళ్ల, నలదలపూరు గ్రామాల చెరువులకు నీరు అందుతోంది. వర్షాధారితంగా చేరే నీటితో పాటు అదనంగా సోమశిల జలాలు 1.5 టీఎంసీలు, వెలిగొండ జలాలు 1.17 టీఎంసీలు మొత్తం 2.67 టీఎంసీలు రావడంతో ప్రాజెక్ట్ పరిధిలో ఆయకట్టు 40 వేల ఎకరాల వరకు పెరుగుతుందని అంచనా. ఎడమ కాలువ -
ప్రాజెక్టులపై ఇంత నిర్లక్ష్యమా..?
► రాళ్లపాడు పరిరక్షణకు కదంతొక్కిన రైతులు ► ఆయకట్టు రైతులకు నీళ్లిచ్చి ఆదుకోవాలని డిమాండ్ ► సోమశిల ఉత్తరకాల్వను పూర్తి చేయడంలో సర్కారు నిర్లక్ష్యంపై ఆగ్రహం ► వైఎస్సార్సీపీ సమన్వయకర్త తూమాటి ఆధ్వర్యంలో ధర్నా కందుకూరు : కందుకూరు నియోజకవర్గానికి జీవనాడి లాంటి రాళ్లపాడు ప్రాజెక్టు పట్ల్ల సర్కారు నిర్లక్ష్య వైఖరిపై ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్ పనులు పూర్తి చేయడంలో ప్రభుత్వ అలసత్వాన్ని నిరసిస్తూ సోమవారం భారీ ప్రదర్శన నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తూమాటి మాధవరావు ఆధ్వర్యంలో సోమవారం స్థానిక పామూరు బస్టాండ్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్, అంకమ్మదేవాలయం మీదుగా పోస్టాఫీస్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం పోస్టాఫీస్ సెంటర్లో రాళ్లపాడు ప్రాజెక్టు పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాళ్లపాడుకు నీరందించే సోమశిల ఉత్తరకాల్వ నిర్మాణం, ప్రాజెక్టు ఎడమకాల్వ పొడగింపు పనులు పూర్తి చేయాలని, రాళ్లపాడు నుంచి నీళ్లు తరలించే జీఓ నంబర్ 40 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాధవరావు మాట్లాడుతూ రాళ్లపాడు ప్రాజెక్టుకు నీరందించే సోమశిల ఉత్తర కాల్వ నిర్మాణ పనులు పూర్తి చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. చింతలదీవి అనే గ్రామం వద్ద భూసేకరణ సమస్యను పరిష్కరించడంలో సర్కారు విఫలం అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు ఎడమ కాల్వ పొడగింపు పనులు మూడేళ్లుగా ప్రారంభానికి నోచుకోలేదని, భూసేకరణ గ్రామాల్లో సోషల్ ఇంపాక్టు సర్వే పూర్తి చేయడం కూడా ప్రభుత్వానికి చేతకాదా అని నిలదీశారు. ఈ కారణంతో పనులు ఆగాయంటే ప్రభుత్వ పనితీరు ఏవిధంగా ఉందో, కందుకూరు నియోజకవర్గం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చునన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా నేడు రైతులు గ్రామాలు వదిలి ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్తున్నారని ఇంతకంటే సిగ్గుచేటు ఇంకొకటి లేదని మండిపడ్డారు. అధికారులకు వినతి పత్రాలు: అనంతరం ఆర్డీఓ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించి రాళ్లపాడు ప్రాజెక్టు రైతుల సమస్యలపై ఆర్డీఓ మల్లికార్జునకు వినతి పత్రం అందజేశారు. రాళ్లపాడు రైతులను ఆదుకోకపోతే గ్రామాలు ఖాళీ అవుతాయని చెప్పారు. స్పందించిన ఆర్డీఓ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. తర్వాత రాళ్లపాడు ప్రాజెక్టు కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించి ప్రాజెక్టు డీఈ శ్రీనివాసమూర్తికి వినతి పత్రం అందజేశారు. రాళ్లపాడు పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని, సమస్యను పరిష్కారం అయ్యే విధంగా ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రాళ్లపాడు ప్రాజెక్టు ఆయకట్టు మాజీ చైర్మన్ ఘనిపినేని నరశింహారావు, గుడ్లూరు జడ్పీటీసీ దోర్శిల వెంకట్రామిరెడ్డి, కందుకూరు, వలేటివారిపాలెం, లింగసముద్రం, ఉలవపాడు మండలాల కన్వీనర్లు కొత్తా రాఘవరెడ్డి, దామా ప్రవీణ్, చంద్రశేఖరరావు, కొండారెడ్డిపాలెం, బసిరెడ్డిపాలెం, అమ్మవారిపాలెం సర్పంచ్‌లు సురేష్, నరసింహ, మాలకొండయ్యలు, నాయకులు షేక్ రఫి, గణేశం గంగిరెడ్డి, దాసరి మాల్యాద్రి, వెంకటస్వామి, సుదర్శి శ్యామ్, ఎస్.సుధాకర్, థామస్, రాఘవ, వెంకట్, రాజారెడ్డి, వెంట్రామిరెడ్డి, నగళ్ల నారయ్య, హాజీమలాంగ, సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు. జీఓ 40 అత్యంత దుర్మార్గం: ఒకపక్క ప్రాజెక్టుకు నీరు వచ్చే పూర్తి చేయకుండా మరోపక్క రాళ్లపాడు ప్రాజెక్టు నుంచి కామథేనువు ప్రాజెక్టు నుంచి నీటిని తరలించేందుకు ప్రభుత్వం జీవో నంబర్ 40ని విడుదల చేయడం మరీ దుర్మార్గంగా ఉందని తూమాటి పేర్కొన్నారు. ప్రాజెక్టులో నీరు లేక నాలుగేళ్లుగా కరువుకాటకాలతో అల్లాడుతుంటే ప్రాజెక్టు నుంచి నీటిని ఎలా తరలిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే కామథేను పశు అభివృద్ధి కేంద్రం భూముల్లోంచే సోమశిల కాల్వ వస్తున్నా అక్కడి నుంచి నీటిని మళ్లించకుండా, రాళ్లపాడు ప్రాజెక్టు నుంచి వెనక్కి 12కిలోమీటర్లు నీటిని తరలించడంలో ప్రభుత్వ ఉద్దేశం ఏంటని నిలదీశారు. ఇది పూర్తిగా రాళ్లపాడు ప్రాజెక్టును నిర్వీర్యం చేసు కుట్రను ప్రభుత్వం చేస్తుందని, దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.