Ram Reddy Damodar Reddy
-
దామన్నా... ‘బ్యాగుంది’
బ్యాగు భుజాన వేసుకుంటే చాలు.. అంతా బాగే!. ఇదీ మాజీ మంత్రి, పార్టీ సూర్యాపేట అభ్యర్థి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ఎన్నికల సెంటిమెంట్. ఎన్నికల్లో పోటీచేసే ప్రతిసారీ ఆయన చంకన లెదర్బ్యాగ్ వేసుకొని కనిపిస్తుంటారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఆయన అభిమానులు ఢిల్లీ నుంచి ఓ బ్యాగును పంపిస్తుంటారు. దానినే ఆయన ప్రచార సమయంలో వాడుతుంటారు. ఈసారి మాత్రం అమెరికాలో ఉండే ఆయన సోదరుడి కుమారుడు లెదర్ బ్యాగ్‌ను పంపించారు. మొన్న.. మొదటి దఫా నామినేషన్ దాఖలుకు సూర్యాపేట ఆర్డీఓ కార్యాలయం వద్దకు వాహనంలో వచ్చిన దామోదర్‌రెడ్డి.. లెదర్ బ్యాగ్ భుజాన వేసుకొని కారులోంచి దిగారు. ప్రజలకు అభివాదం చేస్తూ నామినేషన్ దాఖలుకు వెళ్లారు. ఓ లెటర్ ప్యాడ్, పెన్ను, టవల్‌తో పాటు మరికొన్ని వస్తువులను ఆయన సెంటిమెంట్‌గా అందులో భద్రపరుచుకుంటారట. -
భక్తి శ్రద్ధలతో చంద్రపట్నం
సాక్షి, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్‌పల్లిలోని లింగమంతులస్వామి (పెద్దగట్టు) జాతరలో భాగంగా మం గళవారం చంద్రపట్నం వేసే కార్యక్రమాన్ని యాదవ పూజారులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పెద్దగట్టు హక్కుదారులైన మెంతనబోయిన, మున్న, గొర్ల (రెడ్డి) వంశీయులు తెచ్చి న పూజా సామగ్రి, తెల్లపిండి, పచ్చపిండి, కుంకుమలతో క్రమ పద్ధతిలో దేవతా మూర్తు ల చిత్రాలను అచ్చుగా వేశారు. దానిపై పసు పు, కుంకుమ, తెల్లపిండి వేసి అందంగా అలంకరించారు. అనంతరం లింగమంతుల స్వామి విగ్రహాలు ఉన్న దేవరపెట్టెను చంద్రపట్నంపై ఉంచి పూజలు చేశారు. తర్వాత పట్నం ముందు బైకాన్లు బియ్యంతో పోలు పోసి తమలపాకులు, కుడుక, పోకలు, ఖర్జూరాలు ఉంచి కల్యాణ తంతుకు అన్నీ సన్నద్ధం చేశారు. మెంతనబోయిన, మున్న, గొర్ల వం శాలకు చెందిన పెద్దలకు బైకాన్లు కంకణం కట్టి, బొట్టు అప్పగించారు. వివాహ ఘడియ దాటిపోయిందని లింగమంతుల కల్యాణం నిలిచిపోవడం, ఆ తర్వాత మెంతనబోయిన వారు కటార్లు, మున్న, గొర్ల వంశీయులు ఆసరాలు ఇచ్చే తంతు నిర్వహించారు. అనంతరం మెంతనబోయిన వంశీయులు పూజలు చేసి కేసారం గ్రామానికి పయనమయ్యారు. కార్యక్రమాలను కలెక్టర్ సురేంద్రమోహన్, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డితోపాటు, ఇతర అధికారులు దగ్గరుండి పర్యవేక్షిం చారు. చంద్రపట్నం చూసేందుకు భక్తులు లక్షలాదిగా తరలి వచ్చి మొక్కులు తీర్చుకున్నా రు. జాతరలో భాగంగా నాలుగో రోజైన బుధవారం నెలవారం నిర్వహించనున్నారు. -
'వైఎస్ఆర్ సీపీ సమైక్య తీర్మానం పెడితే అడ్డుకుంటాం'
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నట్లు సమైక్య తీర్మానం పెడితే తెలంగాణ ఎమ్మెల్యేలంతా అడ్డుకుంటామని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్ రెడ్డి గురువారం హైదరాబాద్‌లో తెలిపారు. తెలంగాణ తీర్మానాన్ని అసెంబ్లీలో పెట్టాలని కొన్నేళ్లుగా తాము కొరినా పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.సమైక్య తీర్మానాన్ని ఇప్పుడెలా ప్రవేశపెడతారని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని విభజించాలని లేఖ ఇచ్చిన ఇచ్చిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విభజన బిల్లుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సీమాంధ్ర కేంద్రమంత్రులు,ఎంపీలు మాదిరిగా అసెంబ్లీలో సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు రాష్ట్ర విభజనకు సహకరిస్తారని రాంరెడ్డి దామోదరరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ బిల్లును వెంటనే శాసనసభకు పంపాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల పర్యవేక్షుడు దిగ్విజయ్ సింగ్ రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో ఆయన్ని అడ్డుకుంటే జరిగే పరిణామాలకు వారే బాధ్యులు అవుతురని ఆయన సీమాంధ్ర నేతలు, ఉద్యోగులకు పరోక్షంగా హెచ్చరించారు. అలాగే సభలో తెలంగాణ బిల్లు అడ్డుకుంటే భాగ్యనగరంలోని సీమాంధ్రులకు ఏదైన జరిగితే కూడా వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు.