మున్సిపల్ కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలి
విజయనగరం కంటోన్మెంట్: కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల మధ్యన జనావాసాల్లో పశువులను వధించేందుకు అనుమతి మంజూరు చేసిన మున్సిపల్ కమిషనర్ సోమనారాయణ, హెల్త్‌ఆఫీసర్ రాజులపై చర్యలు తీసుకోవాలని ఏపీ గోసంరక్షణ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు లోగిశ రామకృష్ణ డిమాండ్ చేశారు. బుధవారం ఎన్సీఎస్ రోడ్డులోని పంచముఖాంజనేయస్వామి ఆలయంలో వారు విలేకరలతో మాట్లాడారు. ఈ సంరద్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 500 మంది సభ్యులున్న జమాతేఖురేషి అసోసియేషన్ వారికి ఆవులు, గేదెలతో పాటు పొలం దున్నే ఎద్దులను వ ధించేందుకు అనుమతులు ఇవ్వడం దారుణమన్నారు. మున్సిపాలిటీ తీర్మానం కూడా లేదన్నారు. కమిషనర్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీకి. జిల్లా మంత్రికి, కలెక్టర్ ఎంఎం నాయక్‌కు ఫిర్యాదు చేశామన్నారు. సమావేశంలో పట్టణ అధ్యక్షుడు మద్దిల సోంబాబు, ఇతర సభ్యులు గుగ్గిలం రామారావు, శ్రీమాన్ నారాయణ స్వామి, ఎం. అప్పారావు, జి. పైడితల్లి, ఐవీఆర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.