మధుయాష్కీపై చెక్ బౌన్స్ కేసు
సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ చెల్లని చెక్కు ఇచ్చి మోసం చేశారంటూ ఆయనపై నాంపల్లి మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో బుధవారం చెక్ బౌన్స్ కింద ఫిర్యాదులు దాఖలయ్యాయి. కరీంనగర్ జిల్లా కోరుట్లకు చెందిన రామస్వామిగౌడ్, పడాల నారాయణగౌడ్, భూంరెడ్డి ఈ ఫిర్యాదు దాఖలు చేశారు. తమ నుంచి రూ. 90 లక్షలు అప్పుగా తీసుకున్నారని, ఇందుకోసం ఆయన ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయని పేర్కొన్నారు.