Ramnagar Division
-
ముస్లిం యువకుడిని కాపాడినందుకు..
రామ్‌నగర్: అల్లరి మూకల నుంచి ముస్లిం యువకుడిని కాపాడి హీరోగా నిలిచిన ఉత్తరాఖండ్ పోలీసు అధికారి గగన్‌దీప్ సింగ్‌కు బెదిరింపులు వచ్చినట్టు బీబీసీ తెలిపింది. మే 22న 23 ఏళ్ల ఇర్ఫాన్ అనే యువకుడు 19 ఏళ్ల యువతితో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రామ్పూర్లోని ప్రముఖ గార్జియా దేవి ఆలయానికి వచ్చారు. ఆ సమయంలో కొంత మంది హిందూ కార్యకర్తలు ఇర్ఫాన్‌పై సాముహిక దాడికి పాల్పడ్డారు. అక్కడికి చేరుకున్న పోలీసుల వారి నుంచి యువకుడ్ని కాపాడే యత్నం చేశారు. వారి చేతుల్లో పిడిగుద్దులు తిన్న ఇర్ఫాన్ ఇన్స్పెక్టర్ గగన్‌దీప్‌ను గట్టిగా హత్తుకున్నాడు. వారి దాడి నుంచి యువకుడ్ని గగన్‌దీప్ రక్షించిన వీడియో, యువకుడ్ని హత్తుకుని కాపాడిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. గగన్‌దీప్‌ను ప్రసంశిస్తూ.. చాలా మంది ఆయన ఫొటోను షేర్ చేశారు. కానీ దాడికి గురైన ఆ యువకుడ్ని రక్షించినందుకు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఆయనకు బెదింపు కాల్స్ వచ్చినట్టు బీబీసీ వెల్లడించింది. అయితే ఈ వార్తలను గగన్‌దీప్ సింగ్ తోసిపుచ్చారు. తనకు ఎటువంటి బెదిరింపులు రాలేదని తెలిపారు. ప్రస్తుతం సెలవురోజును ఆస్వాదిస్తున్నాయని, బెదిరింపుల సమస్యే లేదని వివరణయిచ్చారు. ముస్లిం యువకుడిపై దాడిని కొంత మంది బీజేపీ నాయకులు బహిరంగంగా సమర్థించారు. హిందూ యువతిని తీసుకుని ముస్లిం యువకుడు తమ ఆలయానికి రావడం తప్పని స్థానిక బీజేపీ నేత రాకేశ్ నైన్వాల్ వ్యాఖ్యానించారు. ‘మేము మసీదుకు వెళ్లలేము. ఎందుకంటే మాకు అక్కడికి వెళ్లే హక్కు లేదు. అలాంటప్పుడు ఈ ముస్లిం యువకుడు మా ఆలయానికి ఎందుకు వెళ్లాడు? హిందూ సంస్కృతిని నాశనం చేయాలన్న ఉద్దేశంతోనే అతడు ఇలా చేశాడ’ని బీజేపీ ఎమ్మెల్యే రాజ్‌కుమార్ తుక్రాల్ అన్నారు. -
రాంనగర్లో డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణకు రూ.82.40 లక్షలు
♦ విడుదల చేసిన జలమండలి ♦ వెల్లడించిన కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డి ♦ అధికారులతో సమీక్షా సమావేశం ♦ సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు ముషీరాబాద్: రాంనగర్ డివిజన్లో డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణకు జలమండలి రూ.82.40 లక్షల నిధులు విడుదల చేసిందని కార్పొరేటర్ వి.శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ విషయమై చిలకలగూడ వాటర్‌వర్క్స్ డీజీఎం శ్రీధర్‌రెడ్డి, మేనేజర్ హకీం హుస్సేన్, శ్రీనివాస్‌లతో కార్పొరేటర్ బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. డివిజన్లోని 10 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. అక్కడ తీసుకుబోయే చర్యలు, ఖర్చు చేయనున్న నిధుల వివరాలు వెల్లడించారు.