దక్షిణాఫ్రికా క్రికెట్లో ఫిక్సింగ్ కలకలం
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా క్రికెట్ మరో సారి ఫిక్సింగ్ వార్తల్లో నిలిచింది. దక్షిణాఫ్రికా జాతీయ జట్టుకు గతంలో ప్రాతినిధ్యం వహించిన మాజీ క్రికెటర్ ఒకరు ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు బయటపడింది. ఇటీవల జరిగిన దక్షిణాఫ్రికా దేశవాళీ టి20 టోర్నీ ‘రామ్‌స్లామ్’లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. సదరు ఆటగాడు ఎవరనేది స్పష్టంగా తెలియకపోయినా... తమ బోర్డు నిబంధనల ప్రకారం ఇప్పటికే విచారణ మొదలు పెట్టినట్లు క్రికెట్ సౌతాఫ్రికా ప్రకటించింది.