రాముడుపాలెంలో ఉపసభాపతి పుష్కరస్నానం
నడకుదురు (చల్లపల్లి) :
ఏపీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ కుటుంబసమేతంగా మంగళవారం ఉదయం రాముడుపాలెం పుష్కరఘాట్‌లో స్నానమాచరించారు. వారికి ప్రజా ప్రతినిథులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. బుద్ధప్రసాద్, ఆయన సతీమణి విజయలక్ష్మి, కుమారుడు మండలి వెంకట్రామ్ (రాజా), ఎంపీపీ యార్లగడ్డ సోమశేఖర ప్రసాద్‌లు పుష్కరస్నానం చేశారు. అనంతరం సర్పంచ్ పుట్టి వీరాస్వామి నూతన వస్త్రాలు బహూకరించగా, అర్చకస్వాములు, జంగందేవరలు ఆశీర్వచనం పలికారు.