ranga reddy court
-
రంగారెడ్డి జిల్లాలో న్యాయవాదుల ఆందోళన
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కోర్టు వద్ద న్యాయవాదులు బుధవారం ఆందోళనకు దిగారు. 'మాకు న్యాయం జరగాలంటే మా హైకోర్టు మాగ్గావాలే, ఉమ్మడి హైకోర్టు విభజనను అడ్డుకుంటున్న చంద్రబాబు నాయుడు ఖబద్డార్, ఉమ్మడి హైకోర్టుపై బాబు పెత్తనం నశించాలి' అంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. తక్షణమే తెలంగాణ హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. -
‘స్నేక్‌గ్యాంగ్’ అకృత్యాలపై నేడు తీర్పు
రంగారెడ్డి జిల్లా కోర్టులు (హైదరాబాద్‌సిటీ): నగరంలో పలు అత్యాచారాలు పాల్పడిన స్నేక్ గ్యాంగ్‌పై రంగారెడ్డి జిల్లా కోర్టు మంగళవారం తుది తీర్పు ఇవ్వనున్నది. 2014 జులై నెలలో నగర శివారు ప్రాంతంలోని పహాడీషరీప్‌లో పాముతో బెదిరించి ఓ యువతి పై స్నేక్ గ్యాంగ్ సామూహిక అత్యాచారం చేసింది. బాధిత యువతి ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసును విచారించిన పోలీసులు ఈ కేసులో తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితులు దయాని, ఖాదర్ బరాక్బ, తయ్యబ్ బసలమ, మహమ్మద్ పర్వేజ్, సయద్ అన్వర్, ఖజా అహ్మద్, మహమ్మద్ ఇబ్రహీం, అలీ బరాక్బ, సలామ్ హాండిలపై కోర్టు అభియోగ పత్రాలను పోలీసుల దాఖలు చేశారు. ఇందులో ఏడుగురు చర్లపల్లి జైల్లో విచారణ ఖైదీలుగా ఉన్నారు. మరో ఇద్దరు బెయిల్‌పై ఉన్నారు. పాములతో బెదిరించి 37 మంది అకృత్యాలకు పాల్పడిన ఈ స్నేక్‌గ్యాంగ్ కేసును విచారించిన రంగారెడ్డి జిల్లా కోర్టు మంగళవారం తీర్పు ఇవ్వనున్నది. -
అమిత్ సింగ్ కు 5 రోజుల కస్టడీ
హైదరాబాద్ : నగరంలో సంచలనం సృష్టించిన అక్కచెల్లెళ్ల హత్య కేసులో నిందితుడు అమిత్ సింగ్ ను ఐదురోజులు పోలీస్ కస్టడీకి రంగారెడ్డి కోర్టు శుక్రవారం అనుమతి ఇచ్చింది. చైతన్యపురిలోని యామిని, శ్రీలేఖలను అతి కిరాతకంగా హత్యచేసిన అమిత్ ను చైతన్యపురి పోలీసులు బుధవారం రంగారెడ్డి జిల్లా కోర్టులో హజరుపరిచారు. ఈ కేసును శుక్రవారం విచారణ చేపట్టిన రంగారెడ్డి కోర్టు పోలీస్ కస్టడీకి అనుమతించింది. -
సీఎంపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం
హైదరాబాద్: సీఎం కిరణ్‌కుమార్ రెడ్డిపై కేసు నమోదు చేయాల్సిందిగా రంగారెడ్డి కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. సీఎం కిరణ్ ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని రంగారెడ్డి కోర్టులోన్యాయవాది జనార్ధన్‌గౌడ్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు విచారణకు స్వీకరించిన కోర్టు సరూర్ నగర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన దర్యాప్తును పూర్తి చేసి నివేదిక సమర్పించాలని కోర్టు తెలిపింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 16కు వాయిదా వేసింది.