జెడ్పీటీసీ సమావేశం రసాభాస
వికారాబాద్: జెడ్పీటీసీ సభ్యులు, ఎమ్మెల్యేల వాగ్వాదంతో శుక్రవారం జరిగిన రంగారెడ్డి జిల్లా పరిషత్ సమావేశం రసాభాసగా మారింది. జెడ్పీటీసీలను మాట్లాడనివ్వడం లేదని కాంగ్రెస్ సభ్యులు ఆరోపించారు. ఎమ్మెల్యేలు కూడా జెడ్పీటీసీలు సభ్యులేనని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అనడంతో గందరగోళం రేగింది.
ప్రాణహిత-చేవెళ్ల, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులపై స్పష్టత లేదని కాంగ్రెస్ నేత రామ్మోహన్ రెడ్డి అన్నారు. జిల్లాకు రావాల్సిన నీటి వాటాను తగ్గించారని ఆరోపించారు. అయితే ప్రత్యేక సమావేశం పెట్టి అనుమానాలు నివృత్తి చేస్తామని మంత్రి మహేందర్ రెడ్డి హామీయివ్వడంతో సభ్యులు శాంతించారు.