rangappa
-
లారీలు, బస్సులున్నాయి ఇంకా పెళ్లికాలేదని..
హిందూపురం: అమ్మాయిలకు ప్రేమపేరుతో మాయమాటలు చెప్పి పెళ్లిళ్లు చేసుకుంటున్న గోరంట్ల మండలం బుదిలివాండ్లపల్లికి చెందిన రంగప్ప (30) అనే మోసగాన్ని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ మహబూబ్‌బాష చెప్పారు. వివరాలు ఇలా ఉన్నాయి. హిందూపురంలోని ఓ యువతికి ఐదునెలల క్రితం ఒక అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి మాటలు కలిసి తన వివరాలు తెలిపే క్రమంలో బెంగళూరులో ఒంటరిగా ఉంటున్నానని, అనాథనని తనకు లారీలు, బస్సులున్నాయని నమ్మించాడు. ఇంకా పెళ్లికాలేదని చెప్పుకొచ్చాడు. అలా మాటలు కలిపి ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానని ముగ్గులోకి దించాడు. అమ్మాయి తల్లిదండ్రులు కట్నకానుకల కింద బంగారు నగలు, భారీగా నగదును ముట్టజెప్పారు. డబ్బుదస్కం అందినవెంటనే మోసగాడు ముఖం చాటేశాడు. ఫోన్ కూడా ఎత్తేవాడు కాదు. బయటపడిన బండారం అనుమానం వచ్చిన యువతి తల్లిదండ్రులు విచారించగా రంగప్ప మోసగాడని తెలింది. అతనికి ఇంతకు మునుపే ముగ్గురు, నలుగురు యువతులను ఇలాగే ప్రేమ, పెళ్లిళ్లు పేరిట మోసం చేసినట్లు తెలిసిందన్నారు. బాధితురాలు, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రంగప్పను వన్‌టౌన్ పోలీసులు అరెస్టుచేసి విచారించారు. చిలమత్తూరు మండలంలోని పాతచామలపల్లిలో ఓ యువతితో పెళ్లిఅయ్యి ఇద్దరు సంతానం ఉన్నారని తెలిసింది. అలాగే బెంగళూరులో మరో యువతి నమ్మించి పెళ్లి చేసుకున్నాడు. ఇంకా రెండుచోట్ల వివాహాలపేరిట మోసం చేసినట్లు తెలిసింది. ఇతన్ని అరెస్టుచేసి కోర్టుకు హాజరుపర్చుతున్నామని డీఎస్పీ తెలిపారు. -
పోలీసుల అదుపులో నిత్య పెళ్లికొడుకు!
అనంతపురం,హిందూపురం: అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్న నిత్య పెళ్లికొడును హిందూపురం వన్‌టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. గోరంట్ల మండలం బూదివాండ్లపల్లికి చెందిన రంగప్ప ఒకరికి తెలియకుండా మరొకరిని అలా ముగ్గురు నలుగురిని పెళ్లి చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇటీవలే హిందూపురంలో అనాథ అని నమ్మబలికి ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. అసలు విషయం తెలిశాక బాధితురాలు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ‘నిత్య పెళ్లి కొడుకు’ రంగప్పను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం. -
ఎంతపని చేశావయ్యా దేవుడా..
పండుగ సరుకులు తెస్తానంటివి.. అంతలోనే మా నుంచి దూరమైపోయావా! ఎంత పని చేశావయ్యా దేవుడా... అనే రోదనలతో ఆ ప్రాంతం దద్దరల్లింది. ఐదు దశాబ్దాలుగా కలిసిమెలిసి ఉన్న భర్త.. విగతజీవుడై పడి ఉండగా ఇల్లాలి వేదనకు అంతులేకుండా పోయింది. మలి సంధ్యలో తనకు తోడు లేకుండా పోయాడన్న వేదన ఆమెను కలిచి వేసింది. – ఓడీ చెరువు ఓడీచెరువు మండలం మహమ్మదాబాద్ క్రాసింగ్ వద్ద గురువారం చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో నందివారిపల్లికి చెందిన బైముతక రంగప్ప(65) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. వినాయక చవితి పండుగకు కావాల్సిన సరుకులు తీసుకువచ్చేందుకు స్కూటర్‌పై వెళ్లిన అతను తిరుగు ప్రయాణమై వస్తుండగా మహమ్మదాబాద్ క్రాసింగ్ సమీపంలోని బ్రిడ్జ్ వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. ఘటనలో లారీ కిందకు స్కూటర్ వెళ్లిపోయింది. వెనుక చక్రాలు రంగప్ప తలపై నుంచి దూసుకెళ్లాయి. తల నుజ్జునుజైంది. కుడి భుజం, చేయి నలిగిపోయాయి. ఘటన జరిగిన వెంటనే లారీ డ్రైవర్ వాహనాన్ని ఆపి పారిపోయాడు. సమాచారం అందుకున్న మృతుడి కుటుంబసభ్యులు ఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. నాన్నా మా అందర్నీ వదలిపోతివా.. అంటూ కుమారుడు, కుమార్తె రోదనలు స్థానికులను కలిచి వేశాయి,. మృతుడి భార్య గంగులమ్మ రోదిస్తూ.. స్పృహ కోల్పోయారు. ఘటన స్థలాన్ని అమడగూరు ఎస్ఐ చలపతి, హెడ్‌కానిస్టేబుల్ నాగభూషణం పరిశీలించి, కేసు నమోదు చేశారు. -
ఎంతపని చేశావయ్యా దేవుడా..
- లారీ ఢీకొని వ్యవసాయ కూలీ మృతి - మిన్నంటిన ఆర్తనాదాలు పండుగ సరుకులు తెస్తానంటివి.. అంతలోనే మా నుంచి దూరమైపోయావా! ఎంత పని చేశావయ్యా దేవుడా... అనే రోదనలతో ఆ ప్రాంతం దద్దరల్లింది. ఐదు దశాబ్దాలుగా కలిసిమెలిసి ఉన్న భర్త.. విగతజీవుడై పడి ఉండగా ఇల్లాలి వేదనకు అంతులేకుండా పోయింది. మలి సంధ్యలో తనకు తోడు లేకుండా పోయాడన్న వేదన ఆమెను కలిచి వేసింది. - ఓడీ చెరువు: ఓడీచెరువు మండలం మహమ్మదాబాద్ క్రాసింగ్ వద్ద గురువారం చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో నందివారిపల్లికి చెందిన బైముతక రంగప్ప( 65) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. వినాయక చవితి పండుగకు కావాల్సిన సరుకులు తీసుకువచ్చేందుకు స్కూటర్‌పై వెళ్లిన అతను తిరుగు ప్రయాణమై వస్తుండగా మహమ్మదాబాద్ క్రాసింగ్ సమీపంలోని బ్రిడ్జ్ వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. ఘటనలో లారీ కిందకు స్కూటర్ వెళ్లిపోయింది. వెనుక చక్రాలు రంగప్ప తలపై నుంచి దూసుకెళ్లాయి. తల నుజ్జునుజైంది. కుడి భుజం, చేయి నలిగిపోయాయి. ఘటన జరిగిన వెంటనే లారీ డ్రైవర్ వాహనాన్ని ఆపి పారిపోయాడు. సమాచారం అందుకున్న మృతుడి కుటుంబసభ్యులు ఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. నాన్నా మా అందర్నీ వదలిపోతివా కుమారుడు, కుమార్తె రోదనలు స్థానికులను కలిచివేశాయి,. మృతుడి భార్య గంగులమ్మ రోదిస్తూ.. స్పృహ కోల్పోయారు. ఘటన స్థలాన్ని అమడగూరు ఎస్ఐ చలపతి, హెడ్‌కానిస్టేబుల్ నాగభూషణం పరిశీలించి, కేసు నమోదు చేశారు. -
చోరీ అయిన విగ్రహం లభ్యం
రాయదుర్గం రూరల్ : ధర్మపురి అడవిలో చోరీ అయిన బేలోడు ఆంజనేయస్వామి రాతి విగ్రహం, పాదాలు సోమవారం గుమ్మఘట్ట మండలం చెరువుదొడ్డిలో లభ్యమైంది. రాయదుర్గంలోని 74 ఉడేగోళం, రాయదుర్గం, కొంతానపల్లి, రాతిబావివంక, చదం, æబేలోడు, చెరువుదొడ్డి, సౌళూరు, తాళ్లకెర, బుడిమేపల్లి, గోవిందయ్య దొడ్డి తదితర గ్రామాల ప్రజలు ఆంజనేయస్వామిని ఆరాధ్యదైవంగా పూజించేవారు. తొమ్మిదో తేదీన రాతివిగ్రహం, పాదాలు కనిపించకపోవడాన్ని గొర్రెలకాపరులు గుర్తించి సమీప గ్రామస్తులకు సమాచారమందించారు. ఈ మేరకు భక్తులు పదో తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం భక్తులు క్షేత్రస్థాయిలో సమీప గ్రామాలన్నింటినీ తిరిగి స్వామి విగ్రహం కోసం గాలించారు. అయితే స్వామి వారి రాతి విగ్రహాన్ని ఎత్తుకుపోయి చెరువుదొడ్డి గ్రామ సమీపంలో ఆదివారం ప్రతిష్టాపన చేస్తుండగా రంగప్ప (40) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మహిమ గల స్వామి వారిని తీసుకెళితే తన మహత్యాన్ని చూపించారని ఆయా గ్రామాల ప్రజలు చర్చించుకుంటున్నారు.