
అనంతపురం,హిందూపురం: అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్న నిత్య పెళ్లికొడును హిందూపురం వన్‌టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. గోరంట్ల మండలం బూదివాండ్లపల్లికి చెందిన రంగప్ప ఒకరికి తెలియకుండా మరొకరిని అలా ముగ్గురు నలుగురిని పెళ్లి చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇటీవలే హిందూపురంలో అనాథ అని నమ్మబలికి ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. అసలు విషయం తెలిశాక బాధితురాలు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ‘నిత్య పెళ్లి కొడుకు’ రంగప్పను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment