Groom arrested
-
సాఫ్ట్వేర్ ఉద్యోగినంటూ భర్త రెండో పెళ్లి.. మొదటి భార్య సడెన్ ఎంట్రీతో షాక్.. తర్వాత
గుంటూరు ఈస్ట్: మాయమాటలు చెప్పి రెండో పెళ్లికి సిద్ధపడిన వ్యక్తిని పట్టాభిపురం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మచిలీపట్నంకు చెందిన షేక్ సుభాని గుంటూరుకు చెందిన యువతి కుటుంబానికి తాను సాఫ్ట్వేర్ ఉద్యోగినని చెప్పి మోసగించి రెండో పెళ్లికి సిద్ధపడ్డాడు. కల్యాణ మండపంలో పెళ్లి జరుగుతుండగా, సుభాని మొదటి భార్య యువతి తల్లిదండ్రులకు సుభాని మోసాన్ని తెలియజేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు మంగళవారం పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు. మాయమాటలు నమ్మి మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని తల్లిదండ్రులను పోలీసులు కోరారు. మోసగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చదవండి: ఆఫీస్‌కు వచ్చి పని చేయాల్సిందే.. చివరికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ షాకింగ్ నిర్ణయం -
ఇంటర్ విద్యార్థినితో ప్రేమ.. మరో యువతితో పెళ్లి.. వివాహం రోజే!
సాక్షి, గుంటూరు: పెళ్లి పందిరి నిరసనలకు వేదికగా మారింది. పెళ్లి కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేయటంతో వివాహం రద్దు అయ్యింది. కట్నం కింద ఇచ్చిన నగదు ఇవ్వాలని వధువు కుటుంబసభ్యులు, బంధువులు పట్టుబట్టడంతో వివాదం జరిగింది. పెళ్లి కుమార్తెకు న్యాయం చేయాలని కోరుతూ ముట్లూరు రోడ్డులో బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన సంఘటన చేబ్రోలు మండలం పాతరెడ్డిపాలెంలో సోమవారం చోటుచేసుకుంది. చేబ్రోలు మండలం పాతరెడ్డిపాలెం గ్రామానికి చెందిన ఎం పవన్‌కుమార్‌కు చుండూరు మండలం ఆలపాడు గ్రామానికి చెందిన యువతితో వివాహం నిశ్చయం అయింది. కట్నం కింద కొంత డబ్బులు ఇచ్చారు. సోమవారం వివాహం జరగాల్సి ఉంది. పవన్‌కుమార్ ఇదేప్రాంతానికి చెందిన ఇంటర్ విద్యార్థినిని ప్రేమించాడు. వీరి వివాహానికి యువకుని తల్లిదండ్రులు నిరాకరించారు. సోమవారం వివాహం జరుగుతుందని తెలిసిన ప్రేమికురాలు పవన్‌ను నిలదీసింది. మూడు రోజుల కిందట కళాశాల వద్దకు వస్తానని చెప్పిన యువకుడు రాకపోవటంతో మనస్థాపానికి చెందిన యువతి కళాశాల రెండో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గాయాలతో బయటపడిన విద్యార్థిని గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతుంది. మోసం చేసిన పవన్‌కుమార్‌ను నల్లపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పెళ్లి రద్దు అయ్యింది. విషయం తెలుసుకున్న పెళ్లి కుమార్తె కుటుంబసభ్యులు సోమవారం మధ్యా హ్నం పాతరెడ్డిపాలెం వచ్చారు. కట్నం కింద ఇచ్చిన డబ్బులు ఇవ్వాలని, ఆడపిల్లకు న్యాయం చేయాలని కోరుతూ స్థానిక ముట్లూరు రోడ్డులో ఎండలో ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు జోక్యం చేసుకొని ఇరువర్గాలకు చెందిన వారితో మాట్లాడి పెళ్లి కుమార్తె కుటుంబసభ్యులు ఇచ్చిన డబ్బులు చెల్లించటానికి అంగీకరించటంతో సమస్య పరిష్కారమైంది. ఎస్ఐ వై సత్యనారాయణ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. చదవండి: దొంగనోట్లు మారుస్తూ పట్టుబడిన భార్యాభర్తలు -
పెళ్లైన గంటల వ్యవధిలో వరుడి అరెస్ట్.. కారణం ఏంటంటే
చండీగఢ్: దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తుంది. మహమ్మారి కట్టడి కోసం ప్రభుత్వాలు పలు ఆంక్షలు విధిస్తున్నాయి. ముఖ్యంగా వివాహాది శుభకార్యాలకు 50 మందికి మించి అనుమతించడం లేదు. ఈ నేపథ్యంలో పంజాబ్‌కు చెందిన ఓ నవ వరుడిని వివాహం అయిన గంటల వ్యవధిలోనే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంతకు అతడు చేసిన నేరం ఏంటంటే.. వివాహం అనంతరం సదరు వరుడి కుటుంబ సభ్యులు జలంధర్‌లోని ఓ ఆలయంలో రిసెప్షన్ నిర్వహించారు. ఈ వేడుకకు సుమారు 100 మంది హాజరయ్యారు. దీని గురించి పోలీసులకు తెలియడంతో వారు వరుడితో పాటు అతడి తండ్రి మీద కేసు నమోదు చేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇక వరుడు చెప్పిన విషయం విని పోలీసులు ఆశ్చర్యపోయారు. రిసెప్షన్ వేడుకకు వచ్చిన వారిలో చాలా మంది తమకు తెలియదన్నారు. అసలు వీరంతా ఎక్కడి నుంచి వచ్చారో తమకు తెలియదని వాపోయాడు. ఇక వేడుకకు వచ్చిన వారిని వెళ్లిపోమ్మని చెప్పడం బాగుండదని.. అందుకే తాము మౌనంగా ఉన్నామన్నారు. ఇక రిసెప్షన్ వేడుకకు హాజరైన వారిలో కొందరు పోలీసులును చూసి అక్కడి నుంచి తప్పించుకున్నారు. ఈ సందర్భంగా జలందర్ డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ.. ‘‘సదరు వరుడు, అతడి కుటుంబ సభ్యులు వారాంతపు కర్ఫ్యూని ఉల్లంఘించారు. అంతేకాక ఫంక్షన్ నిర్వహించడానికి ముందు మా వద్ద నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదు. అందుకే వారి మీద ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశాం’’ అన్నారు. కరోనా కట్టడి కోసం పంజాబ్ ప్రభుత్వం రాష్ట్రంలో వారాంతపు కర్ఫ్యూ విధిస్తుంది. దాంతో పాటు జిమ్‌లు, సినిమా హాళ్లు, పార్కులు, కోచింగ్ సెంటర్లు, క్రీడా సముదాయాలు మూసివేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వివాహాలు, అంత్యక్రియలకు 20 మందికి మాత్రమే అనుమతిచ్చింది. దహన సంస్కారాలకు కేవలం 10మందికి మాత్రమే అనుమతి. మినహాయించిన దానికన్నా ఎక్కువ మందితో నిర్వహించే కార్యక్రమాలకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపింది. చదవండి: వైరల్: ‘ఆక్సిజన్ కావాలంటే ఈ నాయకులకు కాల్ చేయండి’ -
పోలీసుల అదుపులో నిత్య పెళ్లికొడుకు!
అనంతపురం,హిందూపురం: అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్న నిత్య పెళ్లికొడును హిందూపురం వన్‌టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. గోరంట్ల మండలం బూదివాండ్లపల్లికి చెందిన రంగప్ప ఒకరికి తెలియకుండా మరొకరిని అలా ముగ్గురు నలుగురిని పెళ్లి చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇటీవలే హిందూపురంలో అనాథ అని నమ్మబలికి ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. అసలు విషయం తెలిశాక బాధితురాలు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ‘నిత్య పెళ్లి కొడుకు’ రంగప్పను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం. -
కట్నం కారు ఇస్తేనే తాళి కడతా
సాక్షి, బెంగళూరు : కట్న, కానుకలు అవసరం లేదన్నారు... తీరా పెళ్లి మండపంలో గొంతెమ్మ కోర్కెలు కోరడంతో పాటు పెళ్లి కుమార్తె తండ్రిని కూడా అవమానించారు. ఈ విషయం తెలుసుకున్న పెళ్లి కుమార్తె ప్రత్యేక అలంకరణతోనే మంటపానికి చేరుకుని పెళ్లి నిలిపి వేయించిన సంఘటన చత్తీస్ఘడ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాలు... బెంగళూరుకు చెందిన ఆశీశ్ ఇంటీరియర్ డిజైనర్. చత్తీస్ఘడ్ మురదాబాద్కు చెందిన జ్యోతి ఎంటెక్ పూర్తి చేసింది. ఓ వెబ్సైట్లో పెళ్లి వివరాలు పెట్టడంతో ఇరువైపుల వారు పరస్పరం మాట్లాడుకుని ఒక అంగీకారానికి వచ్చారు. ఈ సమయంలో ఎటువంటి కట్న కానుకల ప్రస్తావన రాలేదు. అన్ని విధాల నచ్చడంతో ఈనెల 14న చత్తీస్‌ఘడ్‌లోని మురదాబాద్‌లోని పార్క్స్కైర్ హోటల్లో జ్యోతి, ఆశీశ్ పెళ్లి ముహూర్తం నిర్ణయించారు. పెళ్లికి ముందు రోజు బంధువులతో కలిసి రిసెప్షన్ కూడా చేశారు. 14న ఉదయం పెళ్లి మరి కొద్ది క్షణాల్లో జరుగుతుందనగా పెళ్లి కుమారుడు తండ్రి కట్నం, కారు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో వధువు తండ్రి ఈ విషయాన్ని కుమార్తె జ్యోతి దృష్టికి తీసుకెళ్లాడు. ఉన్నత విద్యావంతురాలైన ఆమె పెళ్లి కుమారుడి మనసు మార్చడానికి యత్నించింది. ఉన్నత చదువులు అభ్యసించి ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నాం. మీరు కోరిన కోరికలు భవిష్యత్‌లో తీర్చుకుంటాం, పెళ్లి ఆపడం వద్దు అంటూ సవినయంగా పెళ్లి కుమారుడికి విన్నవించింది. అయినా ఆశీశ్, అతని తల్లిదండ్రులు, బంధువులు కట్నం ఇస్తేనే పెళ్లి లేదంటే లేదు అంటూ ఖరాకండిగా చెప్పేశారు. దీంతో జ్యోతి కూడా పెళ్లి మండటపంలోనే కట్న కానుకలు ఆశించే పెళ్లి కుమారుడు వద్దు, పెళ్లీ వద్దు అంటూ తెగేసి చెప్పింది. అంతటితో ఆగకుండా పెళ్లి మంటపం నుంచి వెళ్లి పోవాల్సిందిగా ఘాటుగా హెచ్చరించింది. దీంతో జ్యోతి తన తండ్రితో కలిసి ఆశీశ్, అతని తండ్రి నరేశ్‌పై మఝులా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ... పెళ్లికి ముందు కట్న కానుకల ప్రస్తావన లేదని, పెళ్లి ముహూర్తం సమయంలో కట్నం డిమాండ్ చేశారని, దీంతో పెళ్లి వద్దని నిర్ణయించుకున్నామని చెప్పారు. జ్యోతి సాహసోపేత నిర్ణయాన్ని అందరూ అభినందించారు. ఇదే సమయంలో పెళ్లి కుమారుడు ఆశీశ్, అతని తండ్రి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
పెళ్లి రోజునే చేతికి సంకెళ్లు
యువతిపై బలాత్కారం కేసులో అరెస్ట్ తిరువొత్తియూరు: విద్యార్థినిపై బలాత్కారం చేసిన కేసులో వివాహమైన కొద్ది గంటలకే వరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కుమరి జిల్లా తక్కలై ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల యువతి నాగర్‌కోవిల్‌లోని కళాశాలలో చదువుతోంది. ఈమెతో పరిచయం ఏర్పరచుకున్న కులిందురై ప్రాంతానికి చెందిన సురేష్ వివాహం చేసుకుంటానని మాయమాటలు చెప్పి నాగర్‌కోవిల్‌లోని ఓ లాడ్జికి తీసుకెళ్లి బలాత్కారం చేశాడు. ఇతని మిత్రులు కోవిల్‌కు చెందిన గోపాల్ (47), అరుగువిలైకు చెందిన దినేష్ (25), వాత్తియార్విలైకు చెందిన జ్ఞాన ప్రభు సైతం బలాత్కారానికి పాల్పడ్డారు. విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు వడచేరి పోలీసులు విచారణ జరిపి ముగ్గురిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న జ్ఞానప్రభు మదురై హైకోర్టు శాఖలో బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేశాడు. అందులో నవంబర్ 4న తన వివాహం జరిగే వరకు అరెస్టు నిలుపుదల చేయాలని పిటీషన్లో కోరాడు. పిటీషన్ పరిశీలించిన న్యాయమూర్తులు వివాహం జరిగే వరకు అరెస్ట్ చేయరాదని పోలీసులను ఆదేశించారు. దీంతో వివాహం జరిగిన రోజు సాయంత్రం 5 గంటలకు అతన్ని నాగర్‌కోవిల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనతో మండపంలోని వారు అవాక్కయ్యారు. జ్ఞానప్రభును శనివారం కోర్టులో హాజరుపరిచారు.