rangavalulu
-
సచివాలయంలో సంక్రాంతి శోభ
ఏపీ సచివాలయ ఆవరణలో గురువారం నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి. సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కర్రసాము, కత్తి సాము, తప్పెటగుళ్లు, హరిదాసులు, గంగిరెద్దులు, సన్నాయి, మేళతాళాలు, ఎడ్లబళ్లు, మహిళా ఉద్యోగినులు వేసిన రంగవల్లులు సంక్రాంతి శోభ తెచ్చాయి. కూచిపూడి నృత్యకారిణి మల్లిశెట్టి అనూష నాయుడు శిష్య బృందం నృత్యం, భవిరి రవి మిమిక్రీ, సచివాలయ ఉద్యోగులు ప్రదర్శించిన శ్రీకృష్ణ రాయబారం పద్య నాటకం అలరించాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంకటరామిరెడ్డి, ఉపాధ్యక్షురాలు ఎన్.సత్యసులోచన, కార్యదర్శి పి.శ్రీకృష్ణ పాల్గొన్నారు. – సాక్షి, అమరావతి -
జాగ్రత్త.. ముగ్గులోకి దించి ముంచేస్తారు
సాక్షి, హైదరాబాద్ : గ్రామాల్లోకంటే నగరాల్లో ముగ్గుల సందడి ఎక్కువైంది. తామంటే తామంటూ పోటీలు పడి వేస్తున్నారు. ఇక బహుమతులని చెబుతుండటంతో వారి ఆరాటానికి అంతే లేకుండా పోయింది. ముఖ్యంగా సంక్రాంతి కావడంతో నలుగురికి తమను తాము గొప్పగా పరిచయం చేసుకోవాలనే ఉత్సాహంతో ప్రతి ఒక్కరు ముగ్గులేసేందుకు ముచ్చటపడుతున్నారు. ఈ పాయింట్‌ను దొంగలు క్యాచ్ చేసుకున్నారు. తమ బ్రెయిన్‌కు పదును పెట్టి, పోలీసుల కళ్లుగప్పి దర్జాగా దోపిడీలకు ప్రణాళిక రచించి వెంటనే అమల్లోకి తెచ్చారు. కాలనీల్లోకి వెళ్లి సంక్రాంతి సందర్భంగా తాము ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని, గెలిచినవారికి పెద్ద పెద్ద బహుమతులు కూడా ఇస్తామని ప్రకటించారు. వారి అసలు ప్లాన్ తెలియక ముచ్చటపడిన మగువలంతా అందంగా ముస్తాబై బయటకు రావడమే కాకుండా తమ నగలను కూడా నలుగురికి కనిపించేలా వేసుకొని ముగ్గులు వేసేందుకు రావడం మొదలైంది. అలా వచ్చి ముగ్గులో నిమగ్నమవగానే చైన్ స్నాచర్లను తమ చేతి వాటం చూపించడం మొదలుపెట్టారు. వరుసగా బైక్‌లపై వచ్చి వారి చైన్లు లాక్కెళ్లడం మొదలు పెట్టారు. ఇప్పుడు మియాపూర్, కూకట్పల్లి ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతుండటంతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. -
సంక్రాంతి శోభ