
ఏపీ సచివాలయ ఆవరణలో గురువారం నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి. సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కర్రసాము, కత్తి సాము, తప్పెటగుళ్లు, హరిదాసులు, గంగిరెద్దులు, సన్నాయి, మేళతాళాలు, ఎడ్లబళ్లు, మహిళా ఉద్యోగినులు వేసిన రంగవల్లులు సంక్రాంతి శోభ తెచ్చాయి.
కూచిపూడి నృత్యకారిణి మల్లిశెట్టి అనూష నాయుడు శిష్య బృందం నృత్యం, భవిరి రవి మిమిక్రీ, సచివాలయ ఉద్యోగులు ప్రదర్శించిన శ్రీకృష్ణ రాయబారం పద్య నాటకం అలరించాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంకటరామిరెడ్డి, ఉపాధ్యక్షురాలు ఎన్.సత్యసులోచన, కార్యదర్శి పి.శ్రీకృష్ణ పాల్గొన్నారు. – సాక్షి, అమరావతి