ప్రపంచంలోనే తొలి నవల ‘కాదాంబరి’
తిరుపతి : ఏడవ శతాబ్దంలో భానుడు రచించిన కాదాంబరి భారతీయ సాహిత్యంలోనే కాకుండా ప్రపంచ సాహిత్యంలో కూడా తొలినవల. ఈ నవల తొలి నవలగా ప్రపంచంలోనే గుర్తింపు పొందిందని సంస్కృత విద్యాపీఠంకు చెందిన ప్రొఫెసర్ రాణి సదాశివమూర్తి పేర్కొన్నారు.
బాణభట్టు సంస్కృతంలో రచించిన కాదాంబరి రచన కావ్యాన్ని విద్వాన్ విశ్వం తెలుగులో 54 ఏళ్ల క్రితం హృద్యంగా అనువదించారని గుర్తు చేశారు. ఈఏడాది పునర్ముద్రణ పొందిన ఈ రచన కావ్యం పరిచయ సభ సంస్కృత విద్యాపీఠం వీసీ మురళీధర్ శర్మ చాంబర్లో నిర్వహించారు. ఈసభలో ‘బాణుడి జీవితం– సాహిత్యం’ అనే అంశంపై రాణి సదాశివమూర్తి మాట్లాడుతూ చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించడం వల్లబాణుడు లోకసంచారం చేసి తన 24వ ఏట శ్రీహర్షుడి ఆస్థానంలో కవిగా చేరారన్నారు. హర్షుని మరణానంతరం తన స్వగ్రామానికి తిరిగి వచ్చి ప్రజల కోరిక మేరకు హర్షచరిత్రను చరిత్రగా కాకుండా రసవత్తరమైన కావ్యంగా రచించారన్నారు. ఇదితొలి గద్యకావ్యమని తర్వాత కాదంబరి రచించారన్నారు. బాణుడికి శబ్ధ ప్రయోగంలో ఎంతపట్టు వుందో అర్థప్రయోగంలో కూడా అంతపట్టు వుందన్నారు. ఈకార్యక్రమంలో తిరుపతి ఆకాశవాణి డైరెక్టర్ నాగసూరి వేణుగోపాల్, తెలుగు భాషోధ్యమ సమతి అధ్యక్షురాలు గంగవర పు శ్రీదేవి, విద్యాపీఠం అధ్యాపకుడు గంగిశెట్టి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.