హెచ్‌సీయూ
ర్యాంకింగ్‌లో మేటి..
విశ్వవిద్యాలయాలకు అంతర్జాతీయంగా ఇస్తున్న ర్యాంకుల్లో భారత్‌కు తగిన గుర్తింపు లభించటంలేదు. ఈ క్రమంలో దేశంలోని అన్ని కళాశాలలకు మానవవనరుల మంత్రిత్వ శాఖ ర్యాంకింగ్స్‌ను ఇస్తూ, పోటీతత్వ వాతావరణాన్ని ఏర్పరిచింది. డిపార్ట్మెంట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ సహకారంతో నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్స్ ఫ్రేంవర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) ఈ ర్యాంకులు రూపొందించింది. ఈ ర్యాంకింగ్స్‌లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌కు నాలుగో స్థానం దక్కింది.
యూనివర్సిటీ : ప్రొఫైల్
వినూత్న కోర్సులెన్నో..
ప్రస్తుత జాబ్ మార్కెట్ అవసరాలకనుగుణంగా ఎన్నో కొత్త కోర్సులకు హెచ్‌సీయూ రూపకల్పన చేసింది. ఈ క్రమలో ఎంఎస్సీలో ఐదేళ్ల కెమికల్ సెన్సైస్, సిస్టమ్స్ బయాలజీ, ఆప్టోమెట్రీ అండ్ విజన్ సెన్సైస్, హెల్త్ సైకాలజీ, ఎర్త సెన్సైస్ వంటి కోర్సులకు అంకురార్పణ చేసింది. ఇంటర్మీడియెట్‌లో ఎంపీసీ/బైపీసీ ఉత్తీర్ణులు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. సోషల్ సెన్సైస్‌లో కూడా ఆంత్రోపాలజీ, సోషియాలజీ వంటి ఐదేళ్ల ఎంఏ కోర్సులున్నాయి. రెండేళ్ల ఎంఎస్సీలో సాధారణ సబ్జెక్టులతోపాటు ఓషన్ అండ్ అట్మాస్ఫియరిక్ సెన్సైస్ వంటి విభిన్న కోర్సును ఆఫర్ చేస్తోంది.
సౌకర్యాల్లో ఉత్తమం
పరిశోధనలు, టీచింగ్, లైబ్రరీ.. వంటి అన్ని సదుపాయాలు విద్యార్థులకు ఎంతో అనుకూలం. 13 యునీక్ స్కూళ్లలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌లో ఎంటెక్ చేసిన విద్యార్థులకు జాబ్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. 90 నుంచి 95 శాతం మంది విద్యార్థులకు విదేశాల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. బయోటెక్నాలజీ, మెడికల్ సెన్సైస్ వంటి విభాగాల్లో పరిశోధనలు పెరుగుతున్నాయి. మా దగ్గర పేటెంట్స్ కౌంట్ కూడా ఎక్కువగానే ఉంటోంది.
విద్యార్థులకు ఇతర దేశాల్లో పరిశోధనలు చేసుకునేందుకు ఆర్థిక ప్రోత్సాహం కూడా అందిస్తున్నాం. అత్యాధునిక, డిజిటలైజేషన్‌తో ఉన్న లైబ్రరీ యూనివర్సిటీ సొంతం. దీనికోసం ఏటా రూ.1.65 కోట్లు ఖర్చుపెడుతున్నాం. లేబొరేటరీల్లో అత్యుత్తమమైన పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ఇక టీచింగ్‌లో అడ్వాన్స్డ్ టీచింగ్ మెథడ్స్ అయిన ఆడియో విజువల్ మెథడ్స్‌తోపాటు ఇంటరాక్షన్ సెషన్స్, ఎక్స్పరిమెంట్స్ వంటి వాటిని ఉపయోగిస్తాం. తద్వారా విద్యార్థులకు నాణ్యమైన బోధన అందిస్తున్నాం.
- ప్రొఫెసర్ జె.మనోహర్‌రావు,ఎకనామిక్స్ విభాగం, హెచ్‌సీయూ.