‘ఎబోలా’పై అప్రమత్తం
హైదరాబాద్: ఎబోలా వైరస్ హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రతి జిల్లాకు ఒక ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్(వేగంగా స్పందించే వైద్య బృందం) ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఇందులో జనరల్ ఫిజీషియన్, ఎపిడిమాలజిస్ట్, మైక్రోబయాలజిస్ట్‌లు ఉంటారు. ఈమేరకు ఆరోగ్యశాఖ సంచాలకుడు ఆదేశాలు జారీ చేశారు.
అమెరికాలో ఎబోలా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే వారు ఎక్కువగా ఉన్నందున ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలిసింది. ర్యాపిడ్ రెస్పాన్స్ బృందంలోని వైద్యులకు వారం రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. కాగా, అంతర్జాతీయ ప్రయాణికులకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో థర్మల్ స్కానర్‌ను ఏర్పాటు చేసినట్టు ఎబోలా వైరస్ నియంత్రణాధికారి డాక్టర్ లక్ష్మీ సౌజన్య తెలిపారు.