ఒకప్పుడు అది నరకం..ఇప్పుడు నందనవనం!
రాఖా: సిరియా రాజధాని రాఖాలోని అల్-నైమ్ స్క్వేర్(ట్రాఫిక్ సిగ్నల్) ఒకప్పుడూ బహిరంగంగా మరణశిక్షలు అమలు పరిచే భయంకరమైన వేదిక. కానీ ఇప్పడూ అది ప్రేమికులు, కుటుంబాలు, స్నేహితులు సమావేశమయ్యే అందమైన ప్రదేశం. అయితే ఈ ప్రాంతం ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల ఆక్రమణతో 2014 నుంచి 2017 వరకు ఆ ప్రదేశం రక్తం చిమ్ముతూ భయనకంగా ఉండేది.
(చదవండి: యాహూ! నేను పగలుగొట్టేశాను)
అంతేకాదు ఆ ప్రాంతంలో జిహాదీలు స్క్వేర్‌లో తమ ఇస్లామిక్ షరియా చట్టాన్ని అమలు చేస్తున్నారని, మతభ్రష్టులు లేదా నేరస్థులుగా భావించే వారిపై ధ్వజమెత్తడం, శిలువ వేయడం, శిరచ్ఛేదం చేయడం వంటివి చేశారు. దీంతో అక్కడ స్థానికులు ఆ ప్రదేశాన్ని "రౌండబౌట్ ఆఫ్ హెల్" గా పిలిచేవారు. ఆ ప్రదేశంలోని స్థానికుడు హుస్సేన్ అనే వ్యక్తి తాను ఆ సమయంలో తన గర్ల్‌ఫ్రెండ్‌ని కలవడానికి వెళ్లడానికి కూడా చాలా భయపడేవాణ్లి అంటూ చెప్పుకొచ్చాడు. ఐఎస్ఐఎస్లు నగరాన్ని వదిలి వెళ్లిన తర్వాత మళ్లీ ఇప్పుడిప్పుడే పూర్వ కళావైభవాన్ని సంతరించుకుంది.
అంతేకాదు ఇప్పుడిప్పుడే జిహాదీల చీకటియుగం నుంచి ప్రజలు బయటపడుతున్నారు. నిజానికి అల్-నైమ్ (స్వర్గం) అనేది ట్రాఫిక్ సర్కిల్‌తో చక్కగా రౌండ్ స్క్వేర్లా నిర్మించబడిన బహిరంగ ప్రదేశం. అక్కడ ఒకవైపు అందమైన పౌంటైన్లతో మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతులు మరోవైపు చక్కటి రెస్టారెంట్లతో సందడిగా ఉండే ఆహ్లాదకరమైన ప్రదేశం. కానీ ఇప్పటికీ సిరియావాసులకు ఆ ప్రదేశం వద్దకు రాగానే తాము అనుభవించిన నరకం, భయానక దృశ్యాలే కనిపిస్తాయి అనడంలో సందేహం లేదు.
(చదవండి: సూప్ నచ్చకపోతే మరీ అలా చేస్తావా!)