Rashes
-
వణికిస్తున్న వైరస్.. మీజిల్స్‌తో మరో బాలుడి మృతి
సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో మీజిల్స్ వైరస్ రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తోంది. వరుసగా మూడు రోజులు ఒక్కొక్కరు చొప్పున ముగ్గురు పిల్లలు మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 13కు చేరింది. గురువారం మధ్యాహ్నం గోవండీలోని మురికివాడలో నివాసముంటున్న ఓ 8 మాసాల బాలుడు మీజిల్స్ వైరస్‌తో మృతి చెందడం కలకలం రేపింది. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు మీజిల్స్ వైరస్‌తో 19 మంది పిల్లలు వివిధ ఆస్పత్రుల్లో చేరారు. దీంతో ముంబైలో ఈ సంఖ్య 252కు చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఖ్య మూడు వేలకుపైనే చేరుకుంది. గోవండీలో మృతి చెందిన 8 నెలల బాలుడు గత 20 రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. ఒంటిపై ఎర్రని దద్దుర్లు రావడంతో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడసాగాడు. దీంతో బాలుడి తల్లిదండ్రులు వెంటనే బీఎంసీ ఆస్పత్రిలో చేర్పించారు. చదవండి: (పసిపిల్లలపై మీజిల్స్ పంజా.. వ్యాధి లక్షణాలివే...) నవంబర్ 21వ తేదీ వరకు అతడి ఆరోగ్యంలో ఎలాంటి మార్పు జరగలేదు. దీంతో మెరుగైన వైద్యం కోసం బీఎంసీకి చెందిన ప్రత్యేక ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ వెంటిలేటర్‌పై చికిత్స అందించినప్పటికీ ఎలాంటి మార్పు కనిపించలేదు. చివరకు గురువారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచాడు. శరీరంలోని అవయవాలన్నీ పాడైపోవడంతో అతడు మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. నగరంలో మృతుల సంఖ్య పెరిగిపోవడంతో బీఎంసీ వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతం చేసింది. బీఎంసీ ఆరోగ్య సిబ్బంది బైకళా, వర్లీ, వడాల, ధారావి, తూర్పు బాంద్రా, తూర్పు అంధేరీ, ఉత్తర మలాడ్, గోవండీ, చెంబూర్, కుర్లా, భాండూప్ తదితర ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ చేస్తున్నారు. మీజిల్స్ వైరస్‌ను నియంత్రించేందుకు బీఎంసీ ఆరోగ్య శాఖ సిబ్బంది ప్రాధాన్యత ఇస్తున్నారు. తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకుండా తమ పిల్లలకు వ్యాక్సినేషన్ చేయించాలని వాడవాడ, ఇంటింటికి తిరుగుతూ జన జాగృతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు బీఎంసీ సిబ్బంది 46,03,388 ఇళ్లలో అధ్యయనం చేశారు. అందులో మీజిల్స్ వైరస్ అనుమానితులు 3,695 మంది పిల్లలున్నట్లు గుర్తించారు. వీరందరికి ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తూ మందులు, వ్యాక్సినేషన్ చేస్తున్నారు. -
Tomato Fever: ఒళ్లంతా దురద.. జ్వరం, అలసట.. టొమాటో ఫీవర్ అంటే?
ఓ పక్క దేశంలోని చాలా ప్రాంతాల్లో కోవిడ్ మరోసారి విజృంభిస్తోందన్న వార్తల నేపథ్యంలో.. కేరళ రాష్ట్రంలో పిల్లలను ‘టొమాటో ఫీవర్’ వణికిస్తోంది. నిజానికి పిల్లలకు ఏదైనా చిన్న సమస్య వస్తేనే తల్లిదండ్రులు తల్లడిల్లిపోతుంటారు. అలాంటిది ఐదేళ్లలోపు చిన్నారులకే ఎక్కువగా వచ్చే ఈ జ్వరంతో మరింతగా ఆందోళనపడుతున్నారు. నాలుగైదు వారాలుగా వ్యాధి విస్తృతంగా ఉన్న కేరళతో పాటు తమిళనాడు, కర్ణాటకలను బెంబేలెత్తిస్తున్న ‘టొమాటో ఫీవర్’పై అవగాహన కోసం ఈ కథనం. కొద్దిగా ఆసక్తికరమైన పేరుతో ఉన్న ఈ జ్వరం డెంగీ లేదా చికన్‌గున్యా తరహాకు చెందిదా లేక ఇతరత్రా మరేదైనా గ్రూపునకు చెందిన వైరస్‌నా అన్న విషయం ఇంకా నిర్ధారణగా తెలియదు. అయితే ఇది రెస్పిరేటరీ సిన్సీషియల్ వైరస్సా (ఆర్ఎస్వీ) లేక అడినో వైరస్సా లేదా రైనోవైరసా అనే అంశం మీద నిపుణుల్లో ఇంకా చాలా సందేహాలే ఉన్నాయి. ఈ విషయమై వైరాలజీ, వైద్యవర్గాలు ఇంకా పరిశోధనలు కొనసాగిస్తున్నాయి. లక్షణాలు : ► తీవ్రమైన జ్వరం (హైఫీవర్) ► ఎర్రటి టొమాటోపండు రంగులో ఉండే మచ్చలు (బ్లిస్టర్స్) / ర్యాష్ ► ఒళ్లంతా దురద. ► చర్మం ఎండిపోయినట్లుగా ఉండటం (డీహైడ్రేషన్) ► అలసట ► కీళ్లనొప్పులు ► కడుపులో కండరాలు పట్టేయడం ► వికారం / వాంతులు ► నీళ్లవిరేచనాలు ► దగ్గు ► ముక్కుకారుతుండటం ► కొన్నిసార్లు కొంతమంది పిల్లల్లో ఒంటిపై మచ్చలతో పోలిస్తే... కాళ్లూ–చేతులపై ఉండే మచ్చల రంగు ఒకింత మారి ఉన్నట్లు అనిపిస్తుంటుంది. చికిత్స: ఇది దానంతట అదే తగ్గిపోయే వ్యాధి. నిర్దిష్ట చికిత్స అంటూ ఏదీ లేదు. లక్షణాలను బట్టి చికిత్స (సింప్టమాటిక్ ట్రీట్మెంట్) అందిస్తారు. పిల్లలకు ఉపశమనం కోసం గోరువెచ్చని నీటితో స్నానం చేయిస్తుండాలి. బాగా విశ్రాంతి తీసుకోనివ్వాలి. కంటినిండా నిద్రపోయేలా చూడాలి. సూచన : పేరుకు మాత్రమే దీన్ని టొమాటో ఫ్లూ / టొమాటో ఫీవర్ అంటారు. నిజానికి దీనికీ టొమాటోలకూ ఎలాంటి సంబంధం లేదు. ఇది సాధారణ ప్రజలూ గుర్తుపెట్టుకోడానికి వీలుగా పెట్టిన పేరు మాత్రమే. ఇది టొమాటోల వల్ల ఎంతమాత్రమూ రాదు. కాబట్టి ఇది సోకినవారు, ఇతరులూ టొమాటోలను నిరభ్యంతరంగా తినవచ్చు. వాటిలోని పోషకాలు, విటమిన్లతో మంచి వ్యాధినిరోధక శక్తి చేకూరుతుందనీ, ఫలితంగా టోమాటోఫీవర్తో పాటు అనేక జబ్బులను నివారించవచ్చనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. చదవండి: Health Tips: తరచూ చింత చిగురును తింటే.. నివారణ ► ఇది అంటువ్యాధి కావడం వల్ల సోకిన పిల్లల నుంచి ఇతరులను దూరంగా ఉంచాలి. ► పిల్లలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి. వ్యక్తిగత పరిశుభ్రతతో చాలావరకు నివారణ సాధ్యం. ► వ్యాధి సోకిన పిల్లల దుస్తులు, వస్తువులు, ఆటబొమ్మలు... ఇతరులు తాకకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఈ పేరెలా వచ్చిందంటే... ఇది సోకిన పిల్లల ఒంటి మీద టొమాటో రంగులో ఉండే మచ్చలు (బ్లిస్టర్స్), ర్యాష్ ఏర్పడతాయి. దాంతో ఈ రుగ్మతను టొమాటో ఫీవర్ లేదా టొమాటో ఫ్లూ అని పిలుస్తున్నారు. సాధారణంగా ఐదేళ్ల లోపు పిల్లల్లోనే ఎక్కువగా కనిపించే ఇది... అంతకంటే పెద్దపిల్లల్లోనూ, పెద్దవారిలోనూ చాలా చాలా అరుదుగా మాత్రమే సోకుతుంది. -
పాప ఒంటి మీద తరచూ రాష్...ఎందుకిలా?
వూ పాప వయసు ఏడేళ్లు. రెండు నెలల కిందట ఓ రోజు బాగా ఆడుకున్న తర్వాత ఆమె ఒంటిపైన ఎర్రగా రాష్లాగా వచ్చింది. ఏదైనా పురుగు కుట్టిందేమో అనుకున్నాం. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఇంజెక్షన్ చేశారు. అప్పటి నుంచి ఎండలోకి వెళ్లినా, ఇంట్లోనే పరుగెత్తే ఆటలు ఆడినా, వేణ్ణీళ్ల స్నానం చేసినా ఈవిధంగా శరీరవుంతా ఎర్రగా రాష్ వస్తోంది. ఐదు, పది నిమిషాల్లో అదే తగ్గిపోతోంది. డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే శరీరంలో ఏదైనా పడని పదార్థాలు ఉంటే అలాగే వస్తుందని వుందులు ఇచ్చారు. వుందులు వాడినంతకాలం రాలేదు. వుందులు వూనేశాక వుళ్లీ వస్తోంది. ఇలా రావడం ఏమైనా హానికరవూ? దయచేసి వూ పాప సవుస్యకు పరిష్కారం చూపగలరు. – ఎమ్. దుర్గాభవాని, విజయవాడ మీ పాపకు ఉన్న కండిషన్‌ను ఆర్టికేరియా అంటారు. అందులోనూ మీ పాపకు ఉన్న కండిషన్ కోలినర్జిక్ ఆర్టికేరియా అనిపిస్తోంది. ఇది ఒక రకమైన అలర్జిక్ రుగ్మత. కాని విచిత్రం ఏమిటంటే... ఇది శారీరక శ్రమ (ఫిజికల్ యాక్టివిటీ) ఏదైనా చేయడం కలిగే ప్రేరణ (స్టివు్యులస్)తో ఎక్కువగా వస్తుంటుంది. ఫిజికల్ యాక్టివిటీ వల్ల శరీరంలో ఉష్ణోగ్రత పెరిగి చెవుటలు పట్టడం వల్ల ఈ సవుస్య ఉత్పన్నవువ#తుంది. సాధారణంగా దురదలు, చర్మం వేడెక్కడం, ఎర్రబడటం, వుచ్చలు, బొబ్బలు రావడం వంటి లక్షణాలు ఇందులో కనిపిస్తాయి. శరీరవుంతటా ఈ లక్షణాలు కనిపిస్తాయి. అయితే అరచేతుల్లో, అరికాళ్లలో రావడం వూత్రం కాస్తంత అరుదు. కొద్దివుంది పిల్లల్లో దీంతో పాటు శ్వాసకోశ సవుస్యలు తలెత్తే అవకాశాలూ ఉంటాయి. ఇది అలర్జిక్ టెండెన్సీస్ ఉన్న పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇది సాధారణంగా పదేళ్ల పిల్లల నుంచి 30 ఏళ్ల వరకు వ్యక్తుల వరకు చూస్తుంటాం. ఇది ఒకసారి వస్తే కొన్నేళ్లపాటు తరచూ కనిపిస్తుంటుంది. కారణాలు వుుందు చెప్పినట్లుగా ఇది ఫిజికల్ యాక్టివిటీతో కలిగే స్టివు్యులస్ వల్ల వస్తుంది. శరీరంలో ఉష్ణోగ్రత పెరిగి చెవుటలు పట్టడంతో ఈ పరిస్థితి ఏర్పడుతుంది. వేడివేడి ఆహార పదార్థాలు, వుసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారం, సోనాబాత్, ఉద్వేగాలతో కూడిన ఒత్తిడి (ఎమోషనల్ స్ట్రెస్) వల్ల కూడా ఇది రావచ్చు. కొందరిలో వేణ్ణిళ్ల స్నానం వల్ల ఆర్టికేరియా అటాక్ రావడం కూడా మామూలే. నిర్ధారణ ఈ పరిస్థితిని ఫిజికల్ యాక్టివిటీ చేయించడం ద్వారా, కొన్ని ప్రత్యేకమైన పరీక్షల ద్వారా నిర్ధారణ చేస్తారు. వుుందుగా చెప్పినట్లు కొందరిలో ఇది సుదీర్ఘకాలం పాటు తరచూ కనిపిస్తూ ఉన్నా... వురికొందరిలో దానంతట అదే అకస్మాత్తుగా తగ్గిపోవచ్చు కూడా. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ►ఆర్టికేరియాకు దారితీసే పరిస్థితులు అంటే... చెవుటపట్టే పరిస్థితులను నివారించడం (ఎక్సర్సైజ్ వంటి శారీరక కార్యకలాపాలు / ఫిజికల్ యాక్టివిటీ తగ్గించుకోవడం), వురీ ఎక్కువ ఉష్ణోగ్రతకు, వురీ ఎక్కువ తేవు (హ్యూమిడిటీ) వంటి వాతావరణ పరిస్థితులకు ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ►ఆహారంలో... వేడివేడి పదార్థాలు, వుసాలాలు, శీతల పానియాల వంటివి అవాయిడ్ చేయడం వుంచిది. చికిత్స ఈ కండిషన్ యాంటీహిస్టమైన్స్ అంటే ఉదాహరణకు సిట్రజైన్, లోరాటిడెన్ వంటి వుందులవల్ల చాలా వుట్టుకు తగ్గుతుంది. వాటితోపాటు ఇవు్యునోథెరపీ వల్ల కూడా కొంత ఉపయోగం ఉంటుంది. మీ పాపకు ఉన్న కండిషన్‌కు కేవలం ఒక సిట్టింగ్‌లో శాశ్వత పరిష్కారం లభించడం కష్టం. అయితే ఈ ఆర్టికేరియా వల్ల పాపకు మేజర్ సవుస్యలు ఏవీ రావ#. మీరు పైన పేర్కొన్న జాగ్రత్తలు తీసుకుంటూ మీ డర్మటాలజిస్ట్ పర్యవేక్షణలో చికిత్స తీసుకోండి. -డా. రమేశ్‌బాబు దాసరి, సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
అమ్మాయి ఎప్పుడూ నిరాశగా ఉంటోంది
హోమియో కౌన్సెలింగ్ మా అమ్మాయి వయసు 23 ఏళ్లు. గత కొంతకాలంగా ఎప్పుడూ పరధ్యానంగా ఉంటోంది. ఎవరితోనూ సరిగా మాట్లాడటం లేదు. మాట్లాడినా ఆ మాటలు నిరాశపూరితంగా ఉంటున్నాయి. ఎప్పుడూ ఒంటరిగా కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటోంది. ఆమెకు సరైన హోమియో మందు సూచించండి. – జి, మాలతి, నిజామాబాద్ మీరు చెబుతున్న లక్షణాలు డిప్రెషన్ వ్యాధిని సూచిస్తున్నాయి. డిప్రెషన్‌ను మనసుకు సంబంధించిన ఒక రకమైన రుగ్మత. దీనికి గురైన వారు విచారం, నిస్సహాయత, అపరాధభావం, నిరాశలలో ఉంటారు. భావోద్వేగాలు మారుతుంటాయి. శారీరకంగానూ కొన్ని మార్పులు కనిపిస్తాయి. అకస్మాత్తుగా బరువు కోల్పోవడం లేదా పెరగడం, చికాకు పడుతుండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరు నిర్దిష్టంగా కొన్ని కాలాలలో డిప్రెషన్‌కు గురయ్యే అవకాశం ఉంది. ఈ వ్యాధితో బాధపడేవారు పూర్తి డిప్రెషన్లోకి కూరుకుపోయేలోపే చికిత్స అందించడం మంచిది. హోమియో విధానంలో దీనికి మంచి చికిత్స ఉంది. డిప్రెషన్‌ను రెండు రకాలుగా చెప్పవచ్చు. మొదటిది వంశపారంపర్యంగా వచ్చేది. రెండోది న్యూరోటిక్ డిప్రెషన్. ఇవి... మన చుట్టూ ఉండే వాతావరణం, సంఘంలో అసమానతలు, ఉద్యోగం కోల్పోవడం, ఎవరైనా దగ్గరివాళ్లు దూరం కావడం లేదా చనిపోవడం, తీవ్రస్థాయి మానసిక వేదన... వంటి ఎన్నో అంశాల వల్ల రావచ్చు. వివిధ పరిశోధనల ద్వారా ఈ ఆధునిక కాలంలో దీన్ని డిప్రెసివ్ డిజార్డర్‌గా పేర్కొన్నారు. దీనిలో రకాలు : మేజర్ డిప్రెషన్ : ఇందులో డిప్రెషన్ లక్షణాలు తీవ్రస్థాయిలో ఉంటాయి. ఆకలి లేకపోవడం, నిద్రలేకపోవడం, పనిలో శ్రద్ధ లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. డిస్థిమిక్ డిజార్డర్ : రోగి తక్కువస్థాయి డిప్రెషన్లో దీర్ఘకాలం పాటు ఉంటాడు. అయితే కొన్నిసార్లు రోగి నార్మల్‌గా ఉన్నట్లుగా అనిపించి, తిరిగి డిప్రెషన్ లక్షణాలు కనిపిస్తాయి. సైకియాటిక్ డిప్రెషన్ : డిప్రెషన్‌తో పాటు భ్రాంతులు కూడా కనిపిస్తుంటాయి. పోస్ట్ నేటల్ డిప్రెషన్ : మహిళల్లో ప్రసవం తర్వాత దీని లక్షణాలు కనిపిస్తుంటాయి. సీజనల్ ఎఫెక్టివ్ డిప్రెషన్ : సూర్యరశ్మి తగ్గడం వల్ల కొంతమందిలో సీజనల్‌గా డిప్రెషన్ లక్షణాలు కనిపిస్తుంటుంది. బైపోలార్ డిజార్డర్ : ఈ డిప్రెషన్లో కొంతమంది పిచ్చిగా, కోపంగా, విపరీతమైన ప్రవర్తనను కనబరుస్తుంటారు. కొంత ఉద్రేకం తర్వాత నార్మల్ అయిపోతారు. హోమియో వైద్యవిధానంలో నేట్రమ్మూర్, ఆరమ్‌మెట్, సెపియా, ఆర్సినిక్ ఆల్బ్, సిమిసిఫ్యూగో వంటి మందులు డిప్రెషన్ తగ్గించడానికి బాగా పనిచేస్తాయి. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ చర్మంపైన దద్దుర్లు తగ్గుతాయా? నా వయసు 23 ఏళ్లు. నాకు తరచూ చర్మం మీద ఎర్రని దద్దుర్లు కనిపిస్తున్నాయి. కొద్దిసేపటికి అవి తగ్గుతున్నాయి. మామూలుగా వాటితో ఎలాంటి హానీ లేదు. కానీ చూడటానికి దద్దుర్లు భయంకరంగా కనిపిస్తున్నాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే ‘అర్టికేరియా’ అన్నారు. మందులు వాడుతున్నప్పుడు తగ్గినట్లు తగ్గినా... ఆ తర్వాత ఏమాత్రం ఫలితం కనిపించడం లేదు. నా సమస్యకు హోమియోలో పరిష్కారం ఉందా? – ఎమ్. గౌతమ్, నెల్లూరు అర్టికేరియా చాలా సాధారణంగా కనిపించే చర్మ సమస్య. ప్రతి ఐదుగురిలో ఒకరు తమ జీవితకాలంలో ఏదో ఒక సమయంలో ఈ సమస్యతో బాధపడుతుంటారు. ఇది ఏ వయసు వారికైనా కనిపించవచ్చు. కొందరిలో ఈ సమస్య 24 గంటల్లో దానంతట అదే తగ్గుతుంది. కానీ మరికొందరిలో ఇది దీర్ఘకాలం కొనసాగుతూ తీవ్ర సమస్యగా పరిణమిస్తుంది. దీన్ని రెండురకాలుగా విభజించవచ్చు. అవి... అక్యూట్ అర్టికేరియా : సమస్య ఆరు వారాల కంటే తక్కువ రోజులు ఉన్నట్లయితే దాన్ని అక్యూట్ అర్టికేరియా అంటారు. సమస్యను ప్రేరేపించే అంశాలు ఎదురైనప్పుడు ఇది కలుగుతుంది. క్రానిక్ అర్టికేరియా : ఆరువారాలకు పైబడి కొనసాగితే దాన్ని క్రానిక్ అర్టికేరియా అంటారు. ఇలా దీర్ఘకాలిక సమస్యగా మారడానికి కారణాలు ఇంకా స్పష్టంగా లభించలేదు. అయితే మన ఒంట్లో అంతర్లీనంగా ఉండే ఆరోగ్య సమస్యలైన థైరాయిడ్, లూపస్ వంటి వాటి వల్ల ఆర్టికేరియా కనిపించవచ్చు. కారణాలు : మన శరీరానికి సరిపడని పదార్థాలు శరీరంలోకి ప్రవేశించినప్పుడు వాటికి ప్రతిస్పందనగా మన ఒంట్లో హిస్టమైన్స్ అనే పదార్థంలో పాటు కొన్ని రకాల రసాయనాలు రక్తప్రవాహంలోకి విడుదల అవుతాయి. వాటి ప్రభావం చర్మంపై కనిపిస్తుంది. ఇదే సమస్య మన రోగ నిరోధక శక్తి మనపైనే దుష్ప్రభావం చూపినప్పుడు కూడా కనిపిస్తుంది. అర్టికేరియాను ప్రేరేపించే అంశాలు : ∙నొప్పి నివారణకు ఉపయోగించే మందులు ∙కీటకాలు, పరాన్నజీవులు ∙ఇన్ఫెక్షన్ కలిగించే బ్యాక్టీరియా, వైరస్లు, అధిక ఒత్తిడి, సూర్యకాంతి ∙మద్యం, కొన్ని సరిపడని ఆహార పదార్థాలు ∙అధిక లేదా అల్ప ఉష్ణోగ్రతలు ∙జంతుకేశాలు, పుప్పొడి రేణువులు వంటి చాలా అంశాలు అర్టికేరియాను ప్రేరేపిస్తాయి. లక్షణాలు : ∙చర్మంపై ఎరుపు లేదా డార్క్ కలర్లో దద్దుర్లు ఏర్పడటం ∙విపరీతమైన దురదగా అనిపించడం ∙దద్దుర్లలో మంట, నొప్పి కూడా అనిపించడం ∙కళ్లచుట్టూ, చెంపలు, చేతులు, పెదవులపై కూడా అవి ఏర్పడవచ్చు. ∙గొంతులో వాపు ఏర్పడి అది వాయునాళాలకు అడ్డుగా పరిణమించి ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావచ్చు ∙దద్దుర్ల పరిమాణం పెరుగుతూ, తగ్గుతూ వాటిని ప్రేరేపించే అంశాలకు గురైనప్పుడు కనిపిస్తూ... ఆ తర్వాత అదృశ్యమవుతూ ఉండవచ్చు. చికిత్స : హోమియో ప్రక్రియ ద్వారా కాన్స్టిట్యూషన్ పద్ధతుల్లో అత్యంత సునిశితమైన పరిశీలనతో తగిన మందులు ఇవ్వవచ్చు. వాటి వల్ల రోగనిరోధక కణాలను బలోపేతం చేయడం వల్ల అవి అర్టికేరియాను సమర్థంగా ఎదుర్కొంటాయి. రోగి శారీరక, మానసిక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని, నిపుణులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడితే ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ ఒళ్లంతా తెల్లమచ్చలు... పరిష్కారం సూచించండి నా వయసు 37 ఏళ్లు. నా శరీరమంత తెల్లమచ్చలు వచ్చాయి. మొదట్లో కాస్త చిన్నవిగా ఉండి, ఇప్పుడు క్రమంగా పెద్దవవుతూ అందరూ గమనించేలా ఉంటున్నాయి. నలుగురిలో వెళ్లడానికి ఇబ్బందిగా ఉంది. దాంతో ఎంతో మానసిక వేదన అనుభవిస్తున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే బొల్లి అని చెప్పారు. నాకు హోమియోలో పరిష్కారం సూచించండి. – డి. మనోహర్‌రావు, మిర్యాలగూడ బొల్లి వ్యాధి చర్మంపై మెలనిన్ కణాలు తగ్గడం వల్ల కలుగుతుంది. శరీరానికి చర్మం ఒక కవచం లాంటిది. అన్ని అవయవాలలో చర్మం అతి పెద్దది. ఇందులో చెమట గ్రంథులు, రక్తనాళాలు, నరాలతో పాటు చర్మం చాయకు కారణమైన మెలనోసైట్స్ కూడా ఉంటాయి. ఏప్రాంతంలోనైనా చర్మంలో ఉండే ఈ కణాలు తగ్గినప్పుడు అక్కడ తెల్ల మచ్చలు వస్తాయి. ఈ మచ్చలనే బొల్లి లేదా ల్యూకోడెర్మా అంటారు. చర్మం వెలుపల పొరల్లో ఉండే మెలనోసైట్ కణజాలాలు విడుదల చేసే ‘మెలనిన్ అనే ప్రత్యేక పదార్థం, టైరోసినేజ్ అనే ఎంజైమ్ వల్ల సరైన మోతాదులో విడుదల అవుతుంది. బొల్లి వ్యాధిలో ఈ ఎంజైము అనేక కారణాల వల్ల లోపిస్తుంది. దాంతో మెలనిన్ విడుదలకు అంతరాయం ఏర్పడి, చర్మం రంగును కోల్పోతుంది. ఈ టైరోసినేజ్ అనే ఎంజైమ్ తగ్గుదలకు ఈ కింది పరిస్థితులు కారణం కావచ్చు. బొల్లి వ్యాధికి ముఖ్యమైన కారణాల్లో మానసిక ఒత్తిడి ఒకటి. ఇది స్త్రీ, పురుషుల తేడా లేకుండా, వయసుతో సంబంధం లేకుండా రావచ్చు. డిప్రైషన్, యాంగై్జటీ న్యూరోసిస్ మొదలైన మానసిక పరిస్థితులు దీనికి దారితీయవచ్చు. పోషకాహారలోపం కూడా బొల్లి వ్యాధికి దారితీయవచ్చు. జన్యుపరమైన కారణాలతో వంశపారంపర్యంగా కూడా వ్యాధి రావచ్చు. దీర్ఘకాలిక గ్యాస్ట్రిక్ సమస్యలు : ఆహారంలో రాగి, ఇనుము మొదలైన ధాతువులు లోపించడం వల్ల విటమిన్లు, ప్రోటీన్ల వంటి పోషకాహార లోపం వల్ల గానీ, అమీబియాసిస్, బద్దెపురుగుల వంటి పరాన్నజీవుల వల్లగానీ తెల్లమచ్చలు కనిపించవచ్చు. మందులు, రసాయనాలు దుష్ఫలితాలు, క్వినోన్స్, క్లోరోక్విన్, యాంటీబయాటిక్స్ వంటి పరిశ్రమల్లో పనిచేయడం లేదా వాటిని సరైన మోతాదులో వాడకపోవడం వల్ల కూడా బొల్లి వ్యాధి వచ్చే అవకాశం ఉంది. కొన్ని ఎండోక్రైన్ గ్రంథులు స్రవించే హర్మోన్స్ లోపాలు, డయాబెటిస్‌లో వంటి వ్యాధులలో తెల్లమచ్చలు ఎక్కువగా కనిపించే వీలుంది. వ్యాధి నిరోధక శక్తి (ఇమ్యూనిటీ) తగ్గడం, మన వ్యాధి నిరోధకత మనకే ముప్పుగా పరిణమించే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వల్ల మన సొంతకణాలే మనపై దాడి చేయడం వల్ల కూడా బొల్లి సోకే అవకాశం ఉంది. లక్షణాలు : మొదట చిన్న చిన్న మచ్చలుగా ఏర్పడి, ఆ తర్వాత శరీరం అంతటా వ్యాపిస్తాయి. చివరకు తెలుపు రంగులోకి మారతాయి. చర్మం పలుచబడినట్లు అవుతుంది. కొన్నిసార్లు ఎండవేడిని తట్టుకోలేరు. జుట్టు రంగుమారడం, రాలిపోవడం, వంటి లక్షణాలు ఉంటాయి. ఈ మచ్చలు ముఖ్యంగా చేతులు, పెదవులు, కాల్ల మీద రావచ్చు. ఇవి పెరగవచ్చు లేదా అని పరిమాణంలో ఉండిపోవచ్చు. చికిత్స: తెల్లమచ్చలకు హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. తూజా, నైట్రిక్ యాసిడ్, నేట్రమ్‌మ్యూరియాటికమ్, ఆర్సెనికమ్ ఆల్బమ్, లాపిస్ అల్బా, రస్టాక్స్ వంటి మందులతో తెల్లమచ్చలకు సమర్థంగా చికిత్సను అందించవచ్చు. డాక్టర్ టి.కిరణ్ కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ -
చర్మంపై తరచూ దద్దుర్లు... తగ్గుతాయా?
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 21 ఏళ్లు. నాకు తరచూ చర్మం మీద ఎర్రని దద్దుర్లు కనిపిస్తున్నాయి. కొద్దిసేపటికి అవి తగ్గుతున్నాయి. అయితే ఎలాంటి హానీ లేకపోయినా... దద్దుర్లు భయంకరంగా కనిపిస్తున్నాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే ‘అర్టికేరియా’ అన్నారు. మందులు వాడుతున్నప్పుడు తగ్గినట్లు తగ్గినా... ఆ తర్వాత ఏమాత్రం ఫలితం కనిపించడం లేదు. హోమియో చికిత్స ద్వారా సమస్య పూర్తిగా నయమవుతుందా? – కె. ముని కృష్ణ, చిత్తూరు అర్టికేరియా చాలా సాధారణంగా కనిపించే చర్మ సమస్య. ప్రతి ఐదుగురిలో ఒకరు తమ జీవితకాలంలో ఏదో ఒక సమయంలో ఈ సమస్యతో బాధపడుతుంటారు. ఇది ఏ వయసు వారికైనా కనిపించవచ్చు. కొందరిలో ఈ సమస్య 24 గంటల్లో దానంతట అదే తగ్గుతుంది. కానీ మరికొందరిలో ఇది దీర్ఘకాలం కొనసాగుతూ తీవ్ర సమస్యగా పరిణమిస్తుంది. దీన్ని రెండురకాలుగా విభజించవచ్చు. అవి... అక్యూట్ అర్టికేరియా: సమస్య ఆరు వారాల కంటే తక్కువ రోజులు ఉన్నట్లయితే దాన్ని అక్యూట్ అర్టికేరియా అంటారు. సమస్యను ప్రేరేపించే అంశాలు ఎదురైనప్పుడు ఇది కలుగుతుంది. క్రానిక్ అర్టికేరియా: ఆరువారాలకు పైబడి కొనసాగితే దాన్ని క్రానిక్ అర్టికేరియా అంటారు. ఇలా దీర్ఘకాలిక సమస్యగా మారడానికి కారణాలు ఇంకా స్పష్టంగా లభించలేదు. అయితే మన ఒంట్లో అంతర్లీనంగా ఉండే ఆరోగ్య సమస్యలైన థైరాయిడ్, లూపస్ వంటి వాటి వల్ల ఆర్టికేరియా కనిపించవచ్చు. కారణాలు: మన శరీరానికి సరిపడని పదార్థాలు శరీరంలోకి ప్రవేశించినప్పుడు వాటికి ప్రతిస్పందనగా మన ఒంట్లో హిస్టమైన్స్ అనే పదార్థంలో పాటు కొన్ని రకాల రసాయనాలు రక్తప్రవాహంలోకి విడుదల అవుతాయి. వాటి ప్రభావం చర్మంపై కనిపిస్తుంది. ఇదే సమస్య మన రోగ నిరోధక శక్తి మనపైనే దుష్ప్రభావం చూపినప్పుడు కూడా కనిపిస్తుంది. అర్టికేరియాను ప్రేరేపించే అంశాలు: నొప్పి నివారణకు ఉపయోగించే మందులు కీటకాలు, పరాన్నజీవులు ఇన్ఫెక్షన్ కలిగించే బ్యాక్టీరియా, వైరస్లు అధిక ఒత్తిడి, సూర్యకాంతి మద్యం, కొన్ని సరిపడని ఆహార పదార్థాలు అధిక లేదా అల్ప ఉష్ణోగ్రతలు జంతుకేశాలు, పుప్పొడి రేణువులు వంటి చాలా అంశాలు అర్టికేరియాను ప్రేరేపిస్తాయి. లక్షణాలు: చర్మంపై ఎరుపు లేదా డార్క్ కలర్లో దద్దుర్లు ఏర్పడటం విపరీతమైన దురదగా అనిపించడం దద్దుర్లలో మంట, నొప్పి కూడా అనిపించడం కళ్లచుట్టూ, చెంపలు, చేతులు, పెదవులపై కూడా అవి ఏర్పడవచ్చు గొంతులో వాపు ఏర్పడి అది వాయునాళాలకు అడ్డుగా పరిణమించి ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావచ్చు దద్దుర్ల పరిమాణం పెరుగుతూ, తగ్గుతూ వాటిని ప్రేరేపించే అంశాలకు గురైనప్పుడు కనిపిస్తూ... ఆ తర్వాత అదృశ్యమవుతూ ఉండవచ్చు. చికిత్స: హోమియో ప్రక్రియ ద్వారా కాన్స్టిట్యూషన్ పద్ధతుల్లో అత్యంత సునిశితమైన పరిశీలనతో తగిన మందులు ఇవ్వవచ్చు. వాటి వల్ల రోగనిరోధక కణాలను బలోపేతం చేయడం వల్ల అవి అర్టికేరియాను సమర్థంగా ఎదుర్కొంటాయి. రోగి శారీరక, మానసిక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని, నిపుణులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడితే ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండ్‌డి హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్