పాప ఒంటి మీద తరచూ రాష్‌...ఎందుకిలా? | Health Tips To Control Rashes For Children | Sakshi
Sakshi News home page

పాప ఒంటి మీద తరచూ రాష్‌...ఎందుకిలా?

Jan 3 2020 5:04 AM | Updated on Jan 3 2020 5:04 AM

Health Tips To Control Rashes For Children - Sakshi

వూ పాప వయసు ఏడేళ్లు. రెండు నెలల కిందట ఓ రోజు బాగా ఆడుకున్న తర్వాత ఆమె ఒంటిపైన ఎర్రగా రాష్‌లాగా వచ్చింది. ఏదైనా పురుగు కుట్టిందేమో అనుకున్నాం. డాక్టర్‌ దగ్గరికి తీసుకెళ్తే ఇంజెక్షన్‌ చేశారు. అప్పటి నుంచి ఎండలోకి వెళ్లినా, ఇంట్లోనే పరుగెత్తే ఆటలు ఆడినా, వేణ్ణీళ్ల స్నానం చేసినా ఈవిధంగా శరీరవుంతా ఎర్రగా రాష్‌ వస్తోంది. ఐదు, పది నిమిషాల్లో అదే తగ్గిపోతోంది. డెర్మటాలజిస్ట్‌ దగ్గరికి వెళ్తే శరీరంలో ఏదైనా పడని పదార్థాలు ఉంటే అలాగే వస్తుందని వుందులు ఇచ్చారు. వుందులు వాడినంతకాలం రాలేదు. వుందులు వూనేశాక వుళ్లీ వస్తోంది. ఇలా రావడం ఏమైనా హానికరవూ? దయచేసి వూ పాప సవుస్యకు  పరిష్కారం చూపగలరు. – ఎమ్‌. దుర్గాభవాని, విజయవాడ

మీ పాపకు ఉన్న కండిషన్‌ను ఆర్టికేరియా అంటారు. అందులోనూ మీ పాపకు ఉన్న కండిషన్‌ కోలినర్జిక్‌ ఆర్టికేరియా అనిపిస్తోంది. ఇది ఒక రకమైన అలర్జిక్‌ రుగ్మత. కాని విచిత్రం ఏమిటంటే... ఇది శారీరక శ్రమ (ఫిజికల్‌ యాక్టివిటీ) ఏదైనా చేయడం కలిగే ప్రేరణ (స్టివు్యులస్‌)తో ఎక్కువగా వస్తుంటుంది. ఫిజికల్‌ యాక్టివిటీ వల్ల శరీరంలో ఉష్ణోగ్రత పెరిగి చెవుటలు పట్టడం వల్ల ఈ సవుస్య ఉత్పన్నవువ#తుంది. సాధారణంగా దురదలు, చర్మం వేడెక్కడం, ఎర్రబడటం, వుచ్చలు, బొబ్బలు రావడం వంటి లక్షణాలు ఇందులో కనిపిస్తాయి. శరీరవుంతటా ఈ లక్షణాలు కనిపిస్తాయి. అయితే అరచేతుల్లో, అరికాళ్లలో రావడం వూత్రం కాస్తంత అరుదు. కొద్దివుంది పిల్లల్లో దీంతో పాటు శ్వాసకోశ సవుస్యలు తలెత్తే అవకాశాలూ ఉంటాయి. ఇది అలర్జిక్‌ టెండెన్సీస్‌ ఉన్న పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇది సాధారణంగా పదేళ్ల పిల్లల నుంచి 30 ఏళ్ల వరకు వ్యక్తుల వరకు చూస్తుంటాం. ఇది ఒకసారి వస్తే కొన్నేళ్లపాటు తరచూ కనిపిస్తుంటుంది.

కారణాలు 
వుుందు చెప్పినట్లుగా ఇది ఫిజికల్‌ యాక్టివిటీతో కలిగే స్టివు్యులస్‌ వల్ల వస్తుంది. శరీరంలో ఉష్ణోగ్రత పెరిగి చెవుటలు పట్టడంతో ఈ పరిస్థితి ఏర్పడుతుంది. వేడివేడి ఆహార పదార్థాలు, వుసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారం, సోనాబాత్, ఉద్వేగాలతో కూడిన ఒత్తిడి (ఎమోషనల్‌ స్ట్రెస్‌) వల్ల కూడా ఇది రావచ్చు. కొందరిలో వేణ్ణిళ్ల స్నానం వల్ల ఆర్టికేరియా అటాక్‌ రావడం కూడా మామూలే.

నిర్ధారణ 
ఈ పరిస్థితిని ఫిజికల్‌ యాక్టివిటీ చేయించడం ద్వారా, కొన్ని ప్రత్యేకమైన పరీక్షల  ద్వారా నిర్ధారణ చేస్తారు. వుుందుగా చెప్పినట్లు కొందరిలో ఇది సుదీర్ఘకాలం పాటు తరచూ కనిపిస్తూ ఉన్నా... వురికొందరిలో దానంతట అదే అకస్మాత్తుగా తగ్గిపోవచ్చు కూడా.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు 
►ఆర్టికేరియాకు దారితీసే పరిస్థితులు అంటే... చెవుటపట్టే పరిస్థితులను నివారించడం (ఎక్సర్‌సైజ్‌ వంటి శారీరక కార్యకలాపాలు / ఫిజికల్‌ యాక్టివిటీ తగ్గించుకోవడం), వురీ ఎక్కువ ఉష్ణోగ్రతకు, వురీ ఎక్కువ తేవు (హ్యూమిడిటీ) వంటి వాతావరణ పరిస్థితులకు ఎక్స్‌పోజ్‌ కాకుండా చూసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. 
►ఆహారంలో... వేడివేడి పదార్థాలు, వుసాలాలు, శీతల పానియాల వంటివి అవాయిడ్‌ చేయడం వుంచిది.

చికిత్స 
ఈ కండిషన్‌ యాంటీహిస్టమైన్స్‌ అంటే ఉదాహరణకు  సిట్రజైన్, లోరాటిడెన్‌ వంటి వుందులవల్ల చాలా వుట్టుకు తగ్గుతుంది. వాటితోపాటు ఇవు్యునోథెరపీ వల్ల కూడా కొంత ఉపయోగం ఉంటుంది. మీ పాపకు ఉన్న కండిషన్‌కు కేవలం ఒక సిట్టింగ్‌లో శాశ్వత పరిష్కారం లభించడం కష్టం. అయితే ఈ ఆర్టికేరియా వల్ల పాపకు మేజర్‌ సవుస్యలు ఏవీ రావ#. మీరు పైన పేర్కొన్న జాగ్రత్తలు తీసుకుంటూ మీ డర్మటాలజిస్ట్‌ పర్యవేక్షణలో చికిత్స తీసుకోండి. -డా. రమేశ్‌బాబు దాసరి, సీనియర్‌ పీడియాట్రీషియన్, రోహన్‌ హాస్పిటల్స్, విజయనగర్‌ కాలనీ, హైదరాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement