Rating agency Standard & Poors
-
దిగుమతి దేశాల గ్యాస్ రేట్లే పరిగణించాలి
భారత్‌లో గ్యాస్ ధర నిర్ణయంపై ఎస్అండ్పీ సూచన న్యూఢిల్లీ: గ్యాస్ రేటును నిర్ణయించ డంలో పుష్కలంగా నిల్వలున్న దేశాలను కాకుండా, తక్కువ నిల్వలుండి దిగుమతి చేసుకునే దేశాలనే ప్రాతిపదికగా తీసుకోవాలని భారత్‌కు రేటింగ్ ఏజెన్సీ స్టాండర్డ్ అండ్ పూర్స్ (ఎస్అండ్పీ) సూచించింది. లేకపోతే ధర గిట్టుబాటు కాక... ఇంధన అన్వేషణ కార్యకలాపాల కంపెనీలు కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం కష్టమని తెలియజేసింది. గ్యాస్ నిల్వలున్న దేశాల్లో రేట్ల ఆధారంగా ఇటీవలే భారత్ సహజ వాయువు రేటును యూనిట్‌కు 18 శాతం మేర కోత పెట్టి 4.24 డాలర్లకు తగ్గించిన నేపథ్యంలో ఎస్అండ్పీ సూచన ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం ఎగుమతి దేశాల సగటు ప్రకారం.. ప్రస్తుతం మిగులు సహజ వాయువు, మెరుగైన గ్యాస్ రవాణా మౌలిక సదుపాయాలు ఉన్న అమెరికా, కెనడా తదితర దేశాల్లో ధరల ఆధారంగా దేశీయంగా రేట్లను నిర్ణయిస్తున్నారు. అయితే, ఆయా దేశాలతో పోలిస్తే భారత్‌లో ఉత్పత్తి చాలా తక్కువ కాగా, రవాణా మౌలిక సదుపాయాలు కూడా సరిగ్గా లేవని... ఇలాంటి పరిస్థితుల్లో సదరు దేశాలను ప్రాతిపదికగా తీసుకోవడం సరికాదని ఎస్ అండ్ పీ అభిప్రాయపడింది. ఇప్పటికే ప్రాంతీయంగా ఇతర దేశాలతో పోల్చి చూసినా భారత్‌లో గ్యాస్ రేట్లు తక్కువగానే ఉన్నాయని, థాయ్‌ల్యాండ్, ఇండొనేషియాలో యూనిట్ ధర సగటున 8-10 డాలర్ల మేర ఉందని ఎస్అండ్పీ పేర్కొంది. అటు రానున్న కాలంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే చమురు, గ్యాస్ బ్లాకుల వేలానికి కూడా పెద్దగా స్పందన లభించకపోవచ్చని కూడా తెలియజేసింది. మరోవైపు, గ్యాస్ ధరలు తక్కువ స్థాయిలో ఉండటం వల్ల ప్రభుత్వ రంగ ఓఎన్జీసీ ఆదాయం రూ. 1,080-1,150 కోట్లు, ఆయిల్ ఇండియాకు రూ. 120-130 కోట్ల మేర తగ్గవచ్చని మరో రేటింగ్ ఏజెన్సీ ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ పేర్కొంది. -
కార్పొరేట్ పెట్టుబడులకు మరో రెండేళ్లు: ఎస్అండ్పీ
ముంబై: కార్పొరేట్ పెట్టుబడులు ఊపందుకోవాలంటే మరో రెండేళ్లు పట్టేసే అవకాశం ఉందని రేటింగ్ ఏజన్సీ స్టాండర్డ్ అండ్ పూర్స్ (ఎస్అండ్పీ) దక్షిణాసియా సీనియర్ డెరైక్టర్ (కార్పొరేట్ రేటింగ్స్ విభాగం) మెహుల్ సుక్కావాలా తెలిపారు. ప్రైవేట్ సంస్థలు కాస్త కోలుకోవాలంటే ప్రభుత్వం వ్యవస్థాగతంగా మరిన్ని సంస్కరణలు చేపట్టాల్సి ఉంటుందన్నారు. -
రూ. 65 వేల కోట్లకు స్పెక్ట్రం బిడ్లు
ముంబై: టెలికం స్పెక్ట్రం వేలం రెండో రోజున బిడ్ల విలువ రూ. 65,000 కోట్లకు చేరింది. గురువారం 5 రౌండ్లు జరిగాయి. దీంతో మొత్తం 11 రౌండ్లు జరిగినట్లయింది. హోలీ సందర్భంగా సెలవుదినం అయినప్పటికీ నేడు (శుక్రవారం) కూడా వేలం కొనసాగనుంది. 2జీ, 3జీ సేవలకు ఉపయోగపడే నాలుగు బ్యాండ్‌విడ్త్‌లలో సుమారు 386 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రంను టెలికం శాఖ వేలం వేస్తోంది. తొలి రోజున రూ. 60,000 కోట్ల మేర బిడ్లు వచ్చాయి. ఈ వేలం ద్వారా రూ. 82,000 కోట్ల నుంచి రూ. 1 లక్ష కోట్ల దాకా ప్రభుత్వ ఖజానాకు రాగలవని అంచనా. మరోవైపు, టెలికం కంపెనీలు తీవ్రంగా పోటీపడుతుండటం వల్ల స్పెక్ట్రం ధర గణనీయంగా పెరగొచ్చని, దీని వల్ల టారిఫ్‌లు కూడా భారీగానే పెరగొచ్చని రేటింగ్ ఏజెన్సీ స్టాండర్డ్ అండ్ పూర్స్(ఎస్అండ్పీ) తెలిపింది. అలాగే పెద్ద ఆపరేటర్లు, చిన్న ఆపరేటర్ల మధ్య వ్యత్యాసం కూడా గణనీయం గా పెరుగుతుందని పేర్కొంది. మరోవైపు, ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ రేట్లు తగ్గిస్తుండటం, టెలికం మార్కెట్లోకి కొత్తగా రిలయన్స్ జియో ప్రవేశం మొదలైన కారణాలతో డేటా విభాగంలో పోటీ తీవ్రతరమవుతుందని పేర్కొంది.