Ravi Kale
-
మాస్ పోలీస్
ఆయేషా హబీబ్, రవి కాలే ప్రధాన పాత్రల్లో శశికాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పోలీస్ పటాస్’. తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించిన 97వ చిత్రమిది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రాజ్యసభ సభ్యుడు టి.జి.వెంకటేష్ ఆవిష్కరించారు. ఇటీవల రోశయ్య 87వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ చిత్రం ట్రైలర్‌ను రోశయ్య చేతుల మీదగా ఆవిష్కరించారు. ‘‘ఈ చిత్రం ఘనవిజయం సాధించాలి’’ అన్నారు రోశయ్య. ‘‘ఆయేషా నటన ఈ చిత్రానికి హైలైట్. మాస్‌ను ఆకట్టుకునే అంశాలన్నీ ఈ సినిమాలో ఉంటాయి. త్వరలోనే సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు రామ సత్యనారాయణ. -
పోలీస్ పటాస్ @ 97
అయేషా హబీబ్, రవికాలే, కురిరంగా ముఖ్య పాత్రల్లో శశికాంత్ దర్శకత్వంలో కన్నడలో తెరకెక్కిన చిత్రం ‘జనగణమన’. ఈ సినిమాని భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ ‘పోలీస్ పటాస్’ పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని పారిశ్రామికవేత్త టీజీ వెంకటేశ్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘రామసత్యనారాయణ కమిట్మెంట్ ఉన్న నిర్మాత అని విన్నాను. ‘పోలీస్ పటాస్’ ఫస్ట్ లుక్, ట్రైలర్ చూశాక సినిమాలపట్ల ఆయనకు ఉన్న అభిరుచి తెలిసింది. అందుకే ఆయన 97సినిమాలు తీశారు. ఈ ఏడాదిలోనే 100 సినిమా కూడా నిర్మించాలి’’ అన్నారు. ‘‘నిర్మాతగా ‘పోలీస్ పటాస్’ నాకు 97వ సినిమా. ఈ సినిమా కన్నడలో విజయం అందుకుంది. అయేషా తిరుపతి అమ్మాయే. తను త్వరలోనే ఓ స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయాలని కోరుకుంటున్నా. ఈ నెలలో సినిమా రిలీజ్ చేస్తాం’’ అన్నారు రామసత్యనారాయణ. -
ఫోర్త్ గ్యాంగ్‌తో సంబంధం లేదు!
భయానికి కేరాఫ్ అడ్రస్ అనేలా సిల్వర్‌స్క్రీన్‌పై నటించి ప్రేక్షకుల మెప్పుపొందారు దండుపాళ్యం గ్యాంగ్. శ్రీనివాస్ రాజు దర్శకత్వంలో దండుపాళ్యం గ్యాంగ్‌గా పూజా గాంధీ, మకరంద్ దేశ్‌పాండే, రవి కాలే, రవి శంకర్ ముఖ్య పాత్రలుగా రూపొందిన చిత్రం ‘దండుపాళ్యం’. ఈ సినిమా హిట్ కావడంతో దండుపాళ్యం 2, దండుపాళ్యం 3 చిత్రాలను తెరకెక్కించారు శ్రీనివాస్ రాజు. ‘దండుపాళ్యం 3’ రిలీజ్‌కు రెడీ అయింది. దండుపాళ్యం సిరీస్‌లో ఇదే చివరిదని ఆయన ఇటీవల తెలిపారు. కానీ సడన్‌గా వెంకట్ అనే నిర్మాత సారథ్యంలో ‘దండుపాళ్యం 4’ తెరపైకి వచ్చింది. ‘‘ఈ దండుపాళ్యం 4తో నాకు ఎలాంటి సంబంధం లేదు. పోస్టర్‌పై నా ఫొటో ఉంది. అయితే నేను ఇందులో నటించడంలేదు. నటించమని నన్నెవరూ సంప్రదించలేదు. ‘దండుపాళ్యం 4’ పోస్టర్స్‌పై నా అనుమతి లేకుండా నా ఫొటోలను ఎలా వాడతారు’’ అని పూజగాంధీ పేర్కొన్నారు. మకరంద్ దేశ్‌పాండే అండ్ రవికాలే కూడా ‘దండుపాళ్యం 4’లో నటించడం లేదని స్పష్టం చేశారు. -
నాకు గొంతే ఇష్టం
‘పదకొండు మంది.. ఐదు సంవత్సరాలు.. ఎనభై కేసులు.. మూడు రాష్ట్రాల పోలీసుల కళ్లు కప్పి క్రూర మృగాల్లా తిరుగుతున్నారు’’ అంటూ ప్రారంభమయ్యే ‘దండుపాళ్యం 3’ ట్రైలర్ సినిమాపై ఆసక్తి పెంచుతోంది. ‘నీకు గొంతుపై ఉండే మాల్ ఇష్టం.. వీడికి గొంతు కింద ఉండే మాల్ ఇష్టం. నాకు గొంతే ఇష్టం’ అనే మరో డైలాగ్ దండుపాళ్యం గ్యాంగ్ క్రూరత్వాన్ని చూపేలా ఉంది. బొమ్మాళి రవిశంకర్, పూజాగాంధీ, మకరంద్ దేశ్‌పాండే, రవికాలే ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘దండుపాళ్యం 3’. శ్రీనివాసరాజు దర్శకత్వంలో రజనీ తాళ్ళూరి నిర్మించిన ఈ చిత్రం జనవరి 25న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా ట్రైలర్ విడుదల చేశారు. కన్నడ, తెలుగు భాషల్లో ఘనవిజయం సాధించి, కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించిన ‘దండుపాళ్యం’ సీక్వెల్స్‌లో భాగంగా ‘దండుపాళ్యం 3’ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ‘‘ఇటీవల విడుదలైన టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్‌కి కూడా అదే రేంజ్లో స్పందన వస్తోంది’’ అన్నారు దర్శకుడు శ్రీనివాసరాజు. ఈ చిత్రానికి సంగీతం: అర్జున్ జన్యా, కెమెరా: వెంకట్ ప్రసాద్. -
6 భాషల్లో ఆర్తి అగర్వాల్ చిత్రం