Ravi kanth
-
చూపునిచ్చిన ప్రేమ
యెరికో ప్రాంతంలో ఉన్న ఒక బిక్షకుడు ప్రతిరోజు మాదిరిగానే ఆ రోజు కూడా బిచ్చమెత్తుకోవడానికి తమ ప్రాంతానికి వెళ్లాడు. ఆ సమయంలో ఆ దారిగుండా నజరేయుడైన యేసు వెళుతున్నాడు అని ఆ బిక్షకుడు విని వెంటనే పెద్దగా అరవడం ప్రారంభించాడు. నేను గుడ్డివాడను కదా ఆయన నా అరుపులు వింటాడా అనే ఆలోచన చేయకుండా తన ప్రయత్నాన్ని తను చేస్తున్నాడు. మనలో చాలామందిమి ఏ మాత్రం ప్రయత్నం చేయకుండానే ఒక నిర్ణయానికి వచ్చి ఇక అది జరగదు కదా అని ఏడుస్తూ కూర్చుంటాం. కానీ ఆ భిక్షకుడు అలా కూర్చోకుండా కళ్లు కనిపించకపోయినా తన గొంతుకతో అరుస్తున్నపుడు అక్కడ ఉన్నవారంతా అతడిని వారించారు. కానీ బిక్షకుడు అరవడం ఆపలేదు ఎప్పుడైతే మనం విశ్వాసంతో ఇది జరుగుతుంది, దేవుడు దీనిని చేయగలడు అని నమ్ముతామో ఖచ్చితంగా దేవుడు ఆ పనిని జరిగిస్తాడు. ఆ బిక్షకుడి∙విషయంలోనూ అదే జరిగింది. అందరూ అరవవద్దని అంటున్నా అతను ఇంకా పెద్దగా కేకలు వేయడం మొదలు పెట్టాడు. అతడి హృదయంలో తన పట్ల ఉన్న విశ్వాసానికి ప్రభువు ఆగాడు. ఆ బిక్షకుడిని తన వద్దకు పిలవమని చెప్పగానే అప్పటి వరకూ అతను కూర్చోవడానికి ఆధారమైన తన బట్టను పారవేసాడు. అంటే నన్ను యేసు పిలుస్తున్నాడు.. అంటే ఇక నాకు ఆ బట్టతో పనిలేదు.. నాకు కళ్లొస్తున్నాయి.. అని భిక్షకుడు నమ్మాడు గనుకనే ఆ బట్టను పారవేయగలిగాడు ఈ సందర్బంలో మనం ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం ‘‘విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా’’ (హెబ్రీ 11:6). మనం కూడా దేవుని యెద్దకు వెళుతున్నాం మరి నిజంగానే విశ్వాసంతోనే వెళుతున్నామా? అడుగుతున్నాము కానీ పొందలేకపోతున్నాము అంటే ఆ బిక్షకుడికి ఉన్న విశ్వాసం మనకు లేదన్నమాట, ఆ బిక్షకుడు తన దగ్గరకి రాగానే ప్రభువు అడిగిన మాట ‘నేను నీకేమి చేయగోరుచున్నావు’ అని. అంటే మనం ఆయనను నమ్మితే ఆయన సమాధానం ఇస్తాడు. దగ్గరకు పిలుచుకుంటాడు. ఆయనకు మనకు ఏం కావాలో తెలిసినా మనలనే అడుగుతాడు. మనం అడిగిందే చేస్తాడు. ఆ బిక్షకుడు దృష్టిని ఇమ్మని అడిగితే ప్రభువు ‘‘నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది’’ అంటున్నాడు. అంటే మన విశ్వాసం వలననే ప్రభువు పని చేస్తాడు. ఆ అంధుడు అరిచినపుడు ఆగడం, అతడిని తన దగ్గరకు పిలుచుకోవడం వెనక ప్రభువు ప్రేమ కనిపిస్తుంది. ఆ బిక్షకుడి పట్ల కరుణ కనిపిస్తుంది. ప్రభువు ప్రేమ చెట్టు వంటిది. చెట్టు ఎలాగైతే ఎందరొచ్చినా వాళ్ల ప్రాంతం, మతం, కులం చూడకుండా నీడనిస్తుందో ప్రభువు ప్రేమ కూడా చెట్టు వంటిదే. ఎలాంటి వారికైనా ఈ మహావృక్షం కింద నీడ దొరుకుతుంది. మనం చేయవలసినదల్లా ఒకటే ఆ చెట్టుకిందకు రావడం. – రవికాంత్ బెల్లంకొండ -
నా కన్నులనే గిన్నెలతో తాగమన్నవి
కవిత్వానికి చమత్కారాన్ని జోడించి చక్కలిగింతలు పెట్టిన కవి ఆరుద్ర. ఇంకా చెప్పాలంటే చమత్కారాన్ని కూడా కవిత్వంగా మలవగలిగిన కవి ఆరుద్ర. పద ప్రయోగాల్లోనూ, వ్యక్తీకరణల్లోనూ ఆరుద్ర మార్కు తెలుస్తుంది. ‘మహాబలుడు’ చిత్రం కోసం ఆరుద్ర ‘ఓ ఓ విశాల గగనములో చందమామా ప్రశాంత సమయములో కలువలేమా’ పాట రాశారు. అందులోని ఒక చరణంలో– ‘వన్నెలలో చిన్నెలలో తేనెలున్నవి నా కన్నులనే గిన్నెలతో తాగమన్నవి’ అంటాడు నాయకుడు. దానికి బదులుగా– ‘వొలికే మధువు కొసరే వధువు రెండూ నీవే’ అని బదులిస్తుంది నాయిక. 1969లో వచ్చిన ఈ చిత్రానికి సంగీతం ఎస్.పి.కోదండపాణి. సుశీల, బాలసుబ్రహ్మణ్యం గాయనీ గాయకులు. దర్శకుడు సినిమాటోగ్రాఫర్ రవికాంత్ నగాయిచ్. వాణిశ్రీ,కృష్ణ నటీనటులు. -
కనువిప్పు కలిగించని ‘కాలుష్యం’
సరిగ్గా 33 ఏళ్ల క్రితం 1984 డిసెంబర్ 2న మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నగరంలో ‘యూనియన్ కార్బైడ్ కెమికల్స్’ ఫ్యాక్టరీలో నుంచి విషవాయువులు వెలువడి నగరంలోని వేలాదిమంది ప్రజలను నిమిషాలలో మట్టుబెట్టాయి. ఈ ఘోరకలిని అందరూ గుర్తుంచుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 2ను ‘జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం’గా ప్రకటించింది. భోపాల్ దుర్ఘటన వల్ల 8 నుంచి 10 వేల మంది మరణించగా, మొత్తంగా 25,000 మంది ఈ గ్యాస్ లీకేజీ అనంతర పరిణామాలతో మరణించినట్లు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా పరోక్షంగా 5 లక్షలమందికి పైగా ప్రజలు అనారోగ్యాల బారినపడ్డారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పారిశ్రామిక కాలుష్య ఘోరకలి. అయితే ఈ విషాదాంతం ప్రపంచ దేశాలకు ఒక కనువిప్పు కాగా, భారతదేశంలో మాత్రం ప్రభుత్వాలకు కనువిప్పు కలుగలేదు. సంఘటన జరిగి నేటికి 33 సంవత్సరాలు కావస్తున్నా, ఇప్పటికీ దాదాపు రెండున్నర లక్షల మంది వైద్యం చేయించుకుంటూనే ఉన్నారు. ఇంకా విషవాయువు వెలువడిన ప్రాంతం చుట్టుప్రక్కల ప్రజలు జీవచ్ఛవాల్లా బతుకుతున్నారు. బాధాకరమైన విషయమేమిటంటే సంఘటన జరిగి 33 ఏళ్లు కావస్తున్నా ఇప్పటికీ ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల్లో విషపదార్థాల తొలగింపు పూర్తి కాలేదు. అక్కడి భూగర్భ జలాలపై ఇంతవరకు 15 అధ్యయనాలు జరిగినా వ్యర్థాల తొలగింపు, భూగర్భ జలాల శుద్ధి జరగలేదు. నేటికీ ప్రమాద బాధితులు నష్టపరిహారం కోసం కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఈ ప్రమాదానికి కారణమైన ‘‘యూనియన్ కార్బైడ్ కెమికల్స్’’ యజమాని ప్రమాదం జరిగిన నాలుగు రోజుల తరువాత భారత్‌కు వచ్చాడు. అతడిని 1984 డిసెంబర్ 7న అరెస్ట్ చేశారు. అయితే ఎంత త్వరగా అరెస్ట్ చేశారో అంతే త్వరగా ప్రధాన నిందితుడు వారెన్ అండర్సన్ ‘భారత్‌కు మళ్లీ తిరిగి వస్తానని హామీ ఇచ్చి’ ప్రభుత్వ లాంఛనాలతో అమెరికాకు వెళ్ళిపోయాడు. యూనియన్ కార్బైడ్ సంస్థను యాజమాన్యం మరో కంపెనీకి అమ్మడం వలన బాధితులు ఎవరిని ఆశ్రయించాలో తెలియడం లేదు. ఇంతా చేస్తే బాధితులకు దక్కిన తలసరి నష్టపరిహారం కూడా 15 వేలకు మించలేదు. ప్రపంచీకరణ పేరుతో అభివృద్ధి చెందిన దేశాలు వర్థమాన దేశాల ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. విదేశీ కంపెనీలు అభివృద్ధి పేరుతో భారత్ లాంటి వర్థమాన దేశాలలో పరిశ్రమలు స్థాపించి లాభాలు పిండుకొంటున్నాయి. మన ప్రభుత్వాల ఉదాసీనత వలన దేశ ప్రజల ప్రాణాలు, దేశ పర్యావరణాన్ని ఫణంగా పెట్టి పారిశ్రామిక అభివృద్ధి జరుగుతోంది. భోపాల్ దుర్ఘటనలో మరణించినవారంతా పేదప్రజలే కావడంతో ప్రమాదంలో మరణించిన వారి సంఖ్యను లెక్కపెట్టకుండా సామూహికంగా ఖననం చేశారు. అభివృద్ధి అంటే పర్యావరణ పరిరక్షణ, దేశ ప్రజ లకు పూర్తి రక్షణతో కూడిన అభివృద్ధి ఉండాలి. అంతేకానీ ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టి పారిశ్రామిక కాలుష్యానికి కారణమవుతున్న ఇలాంటి దుర్ఘటనలు ఇకనైనా ప్రభుత్వాలకు కనువిప్పు కలిగించాలి. దేశంలో ఎన్నో పర్యావరణ చట్టాలున్నా, వాటిని సమగ్రంగా అమలు చేయడం లేదు. ముఖ్యంగా పారిశ్రామిక పర్యావరణ చట్టాలను అమలు చేయడంలో ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి. ఆయా కంపెనీల యాజమాన్యాలకు పూర్తి ఆదేశాలు అందించాలి. అలా చేసినప్పుడే భోపాల్ లాంటి దుర్ఘటనలు మళ్లీ ఉత్పన్నం కాకుండా చూసుకోగలం. (నేడు జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం) - మోతి రవికాంత్, వ్యవస్థాపకులు సేఫ్ ఎర్త్ ఫౌండేషన్ ‘ 99633 24239 -
క్షణం దర్శకుడితో రానా
తొలి సినిమా క్షణంతోనే సూపర్ హిట్ కొట్టిన యంగ్ డైరెక్టర్ రవికాంత్ పెరుపు. అడవి శేష్ హీరోగా తెరకెక్కిన క్షణం సినిమా సంచలన విజయం సాధించటంతో పాటు భారీ వసూళ్లను కూడా సాధించి పెట్టింది. దీంతో దర్శకుడు రవికాంత్ కు అవకాశాలు క్యూ కట్టాయి. అయితే రెండో సినిమా విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్న ఈ యంగ్ డైరెక్టర్ తాజాగా తన సెకండ్ ప్రాజెక్ట్ ను ఫైనల్ చేశాడు. క్షణం రిలీజ్ అయిన వెంటనే సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో రెండో సినిమా చేసేందుకు ఓకె చెప్పాడట. రానా, వెంకటేష్‌ల కాంబినేషన్లో రవికాంత్ దర్శకత్వంలో సినిమా ఉంటుందన్న ప్రచారం జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం రానా ఒక్కడితోనే రవికాంత్ సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ ప్రాజెక్ట్ పై త్వరలోనే ప్రకటన రానుంది.