కవిత్వానికి చమత్కారాన్ని జోడించి చక్కలిగింతలు పెట్టిన కవి ఆరుద్ర. ఇంకా చెప్పాలంటే చమత్కారాన్ని కూడా కవిత్వంగా మలవగలిగిన కవి ఆరుద్ర. పద ప్రయోగాల్లోనూ, వ్యక్తీకరణల్లోనూ ఆరుద్ర మార్కు తెలుస్తుంది. ‘మహాబలుడు’ చిత్రం కోసం ఆరుద్ర
‘ఓ ఓ విశాల గగనములో చందమామా
ప్రశాంత సమయములో కలువలేమా’ పాట రాశారు. అందులోని ఒక చరణంలో–
‘వన్నెలలో చిన్నెలలో తేనెలున్నవి
నా కన్నులనే గిన్నెలతో
తాగమన్నవి’ అంటాడు నాయకుడు. దానికి బదులుగా–
‘వొలికే మధువు కొసరే వధువు
రెండూ నీవే’ అని బదులిస్తుంది నాయిక.
1969లో వచ్చిన ఈ చిత్రానికి సంగీతం ఎస్.పి.కోదండపాణి. సుశీల, బాలసుబ్రహ్మణ్యం గాయనీ గాయకులు. దర్శకుడు సినిమాటోగ్రాఫర్ రవికాంత్ నగాయిచ్. వాణిశ్రీ,కృష్ణ నటీనటులు.
నా కన్నులనే గిన్నెలతో తాగమన్నవి
Published Tue, Jul 10 2018 7:51 PM | Last Updated on Tue, Jul 10 2018 7:51 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment