ఐటీ ఉద్యోగి రవీంద్ర ఇప్పాల అరెస్టు
అల్లిపురం(విశాఖపట్నం): సోషల్ మీడియాపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ప్రభుత్వ వైఫల్యాలపై సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్న వారి అరెస్టుల పరంపర కొనసాగుతోంది. గతవారం ‘పొలిటికల్ పంచ్’ అడ్నిన్ ఇంటూరి రవికిరణ్‌ను అరెస్టు చేసిన విశాఖ పోలీసులు బుధవారం ఐటీ ఉద్యోగి రవీంద్ర ఇప్పాలను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. విశాఖ పోలీసులు బెంగుళూరు రామకృష్ణనగర్‌లోని రవీంద్ర ఇంటికి మంగళవారం రాత్రి చేరుకున్నారు.
ఈ నెల 22న విశాఖపట్నం ఎస్సీ, ఎస్టీ సెల్ ఏసీపీ మెహనరావు ముందు హాజరుకావాలంటూ నోటీసు ఇచ్చారు. మరికొద్ది సేపటి తరువాత ఏసీపీ రమ్మంటున్నారని రవీంద్రను ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్లిన పోలీసులు బెంగుళూరు నుండి విమానంలో హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. రాత్రి అక్కడే ఉంచి, దాదాపు మూడు గంటలపాటు విచారించారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి జడ్జి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.