ravisastry
-
కరోనా బారిన భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్
లండన్: లండన్‌లో ఉన్న భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ రవిశాస్త్రితో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్‌లు కూడా కోవిడ్–19 బారిన పడ్డారు. వీరికి తాజాగా నిర్వహించిన ఆర్టీ–పీసీఆర్ పరీక్షలో కరోనా పాజిటివ్‌గా తేలినట్లు బీసీసీఐ ప్రకటించింది. శనివారం, ఆదివారం చేసిన ర్యాపిడ్ టెస్టుల్లో రవిశాస్త్రికి కరోనా ఉన్నట్లు తేలింది. దాంతో ఇంగ్లండ్‌తో మాంచెస్టర్‌లో జరిగే ఐదో టెస్టుకు వీరు అందుబాటులో ఉండరు. చదవండి: సిరీస్ వేటలో విజయబావుటా -
మిల్కా సింగ్ మృతి కి నివాళి అర్పించిన బీసీసీఐ
ముంబై: లెజండరీ అథ్లెట్.. ద ఫ్లయింగ్ సిక్కుగా ఖ్యాతి గాంచిన మిల్కా సింగ్ మృతి పట్ల బీసీసీఐ నివాళి అర్పించింది. మిల్కా సింగ్ మృతి తీవ్ర విషాదాన్ని మిగిల్చినట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ట్వీట్ చేశారు. భారత్‌కు చెందిన అతిగొప్ప క్రీడాకారుడు మిల్కా సింగ్ అని, భారతీయ యువత అథ్లెటిక్స్ వైపు మళ్లేందుకు మిల్కా సింగ్ ఆదర్శంగా నిలిచారని, అతనితో దగ్గర పరిచయం ఉన్నట్లు సౌరవ్ గంగూలీ తెలిపారు. బీసీసీఐ కార్యదర్శి జే షా కూడా నివాళి అర్పించారు. మిల్కాసింగ్ మృతి విషాదాన్ని మిగిల్చిందని, తరతరాలు ఎంతో మంది క్రీడాకారులకు మిల్కా ప్రేరణగా నిలిచారని, అసాధ్యం అంటూ ఏదీ లేదని ఆయన నిరూపించారని, మిల్కా మృతి పట్ల నివాళి అర్పిస్తున్నట్లు జే షా చెప్పారు. ఏషియా క్రీడల్లో స్ప్రింట్ విభాగంలో మిల్కాసింగ్ నాలుగు గోల్డ్ మెడల్స్ సాధించాడు. సురేష్ రైనా, అనిల్‌కుంబ్లే, జస్ప్రీత్ బుమ్రా, వెంకటేశ్ ప్రసాద్, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, ఇండియన్ క్రికెట్ టీమ్ కోచ్ రవిశాస్త్రి మిల్కాసింగ్ మృతి పట్ల నివాళి అర్పించారు. చదవండి: ఊరించి... ఉసూరుమనిపించి... -
అతడు భుజం గాయంతోనే ఆసీస్‌కు వచ్చాడు
ఏ మూడ్‌లో ఉన్నాడో... ఏ ఉద్దేశంతో అన్నాడో కాని... ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై తన మాటల ద్వారా టీమిండియా కోచ్ రవిశాస్త్రి కొత్త వివాదానికి తెరలేపాడు. పెర్త్ టెస్టు ఓటమిపై విమర్శల నుంచి వ్యక్తిగతంగా తప్పించుకోలేకపోగా... కెప్టెన్ విరాట్ కోహ్లి చెప్పిన దానికి భిన్నమైన వివరణ ఇచ్చి మరింత బోర్లాపడ్డాడు. అటువైపు బీసీసీఐనీ ఇరకాటంలోకి నెట్టాడు. అర్ధరాత్రి వివరణ ఇచ్చుకునేలా చేశాడు. ఇటువైపు ఈ మొత్తం చర్చకు కారణమైన ‘జడేజా 70–80 శాతం ఫిట్నెస్’... అసలు జట్టు సభ్యుల గాయాలు, వాటిపట్ల తీసుకోవాల్సిన చర్యలపై టీమిండియాకు నిర్దిష్టమైన ప్రణాళిక ఏమీ లేదన్న విషయాన్ని మరోసారి చాటింది. మెల్బోర్న్: ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా పూర్తి ఫిట్‌గా లేడని టీమిండియా కోచ్ రవిశాస్త్రి ప్రకటించాడు. రెండో టెస్టు సమయానికి అతడు 70–80 శాతం ఫిట్నెస్తోనే ఉన్నాడని... అందుకనే తుది జట్టులో ఆడించలేదని పేర్కొన్నాడు. జడేజా 80 శాతం ఫిట్నెస్తో ఉన్నా మెల్బోర్న్లో జరిగే మూడో టెస్టులో ఆడిస్తామంటూ చిత్రమైన వివరణ ఇచ్చాడు. ‘స్వదేశంలో రంజీ ఆడుతున్నప్పుడే జడేజా భుజం నొప్పితో ఇబ్బందిపడ్డాడు. ఆస్ట్రేలియాకు వచ్చిన నాలుగు రోజులకు ఇంజెక్షన్లు తీసుకున్నాడు. అవి ప్రభావం చూపేందుకు కొంత సమయం పట్టింది’ అని ఆదివారం ఇక్కడ మీడియా సమావేశంలో వివరించాడు. పెర్త్ ఓటమిపై విమర్శలకు స్పందిస్తూ ‘జట్టుకు ఏది మేలనుకున్నామో అదే చేశాం. సుదూరాన ఉన్నవారు మాట్లాడటం సులువు. మేమిప్పుడు దక్షిణ ధ్రువాన ఉన్నాం’ అంటూ వ్యంగ్యంగా స్పందించాడు. ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై రెండు రోజుల్లో ఓ నిర్ణయానికి వస్తామని, బ్యాట్స్‌మన్ రోహిత్‌శర్మ పరిస్థితి మెరుగైందని తెలిపాడు. దక్షిణాఫ్రికాలో వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా, ఇంగ్లండ్‌లో ఆఫ్ స్పిన్నర్ అశ్విన్, ఆస్ట్రేలియాలో రవీంద్ర జడేజా... వరుసగా మూడో విదేశీ పర్యటనలోనూ ఆటగాళ్ల గాయాలపై టీమిండియాలో దాగుడుమూతలు కొనసాగుతున్నాయి. జట్టు సభ్యుల వాస్తవ ఫిట్నెస్ను విస్మరించి చివరివరకు ఆడించడం... తీరా అది వికటించి విమర్శల పాలవడం కోహ్లి సేనకు సాధారణమైపోయింది. ఈ విషయంలో కెప్టెన్ విరాట్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రితో పాటు బీసీసీఐదీ తప్పున్నట్లుగా కనిపిస్తోంది. తాజాగా ముగిసిన పెర్త్ టెస్టులో ‘జడేజా ఉదంతమే’ దీనంతటికీ బలమైన సాక్ష్యం. అసలేం జరిగింది? రెండో టెస్టుకు ముందు రోజే జడేజా, భువనేశ్వర్ సహా భారత్ 13 మందితో జట్టును ప్రకటించింది. అంతకుముందు బీసీసీఐ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం అందరూ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమని తేలిపోయింది. అయితే, పిచ్ స్వభావం రీత్యా అంటూ నలుగురు పేసర్లతో దిగాడు కోహ్లి. కానీ, ఈ వ్యూహం వికటించింది. ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయన్ టీమిండియాను దెబ్బకొట్టాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకుండా ఆడిన భారత ప్రణాళికను అందరూ తప్పుబట్టారు. అయితే రవీంద్ర జడేజాను ఆడించే ఆలోచన తమకు రాలేదని మ్యాచ్ ముగిశాక విరాట్ వివరణ ఇచ్చాడు. మరోవైపు వివిధ కార ణాలతో జడేజా ఐదుగురు ఆటగాళ్లకు సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలో సుదీర్ఘ సమయం ఫీల్డింగ్ చేశాడు. బంతిని బలంగా విసరాల్సి వచ్చే బౌండరీ లైన్ దగ్గరే ఎక్కువసేపు ఉన్నాడు. కోహ్లి వివరణ, ఫీల్డింగ్‌కు దింపిన తీరునుబట్టి చూస్తే జడేజా ఫిట్‌గా ఉన్నాడనే అనుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడేం జరిగింది? టెస్టు ఓటమిపై విమర్శల పరంపర కొనసాగుతుండగానే, ఆదివారం మీడియాతో మాట్లాడిన రవిశాస్త్రి... జడేజా 70 నుంచి 80 శాతం ఫిట్నెస్తోనే ఉన్నాడని, లేనిపోని ఇబ్బంది ఎందుకనే పెర్త్ మ్యాచ్ ఆడించలేదని ప్రకటించాడు. ఇది పూర్తి అసంబద్ధంగా ఉండటంతో పెద్ద సంచలనమైంది. ఏ స్థాయి ఆటగాడినైనా వంద శాతం ఫిట్‌గా ఉంటేనే మైదానంలోకి దింపుతారు. మరి అలా లేని జడేజాను 13 మందిలో ఎలా చేర్చారు? ఎడమ భుజం గాయంతో ఇబ్బంది పడుతున్న అతడిని సబ్‌స్టిట్యూట్‌గా ఎలా పంపారు? తప్పని పరిస్థితుల్లో అనుకున్నా... బౌండరీల వద్ద ఎలా ఉంచుతారు? అనే ప్రశ్నలు వస్తున్నాయి. దీనర్థం చూస్తే... ఓటమిని కప్పిపుచ్చుకునేందుకు కారణాలు చెప్పబోయిన రవిశాస్త్రి బయటకు తెలియని జడేజా గాయం గురించి చెప్పేశాడు. అతడు 80 శాతం ఫిట్నెస్తో ఉన్నా మెల్బోర్న్లో ఆడిస్తామంటూ మరో పూర్తి విరుద్ధ ప్రకటన చేశాడు. అంతేకాక, ‘మీరు జడేజా గురించి అడిగారు. నేను చెప్పాను. ఇక జట్టు ఎంపికపై ఎలాంటి సందేహాలు లేవనుకుంటా? ఉంటే... అది మీ సమస్య’ అని మీడియాకు చురకలేశాడు. ఇదేం తీరు? జడేజా విషయం తెలిశాక కూడా అతడిని 13 మందిలో చేర్చడం పొరపాటే. ఎలాగూ నలుగురు పేసర్ల వ్యూహమే సరి అంటూ, స్పిన్నర్‌ను ఆడించమని కోహ్లి చెప్పాడు కాబట్టి అతడి స్థానంలో కుల్దీప్ పేరు ఉంచితే సరిపోయేది. అలాకాకుండా జడేజాతో ఏకంగా ఫీల్డింగ్ కూడా చేయించారు. ఇప్పటికే అశ్విన్‌కు ఫిట్నెస్ ఇబ్బందులున్న నేపథ్యంలో ఒకవేళ గాయం పెద్దదై జడేజా సిరీస్‌కే దూరమైతే ఏం చేసేవారు? ఇదే విధంగా ఇంగ్లండ్‌లో గాయం ఉన్నా అశ్విన్‌ను సౌతాంప్టన్ టెస్టులో ఆడించారు. ప్రత్యర్థి స్పిన్నర్ మొయిన్ అలీ విజృంభించిన చోట అతడు విఫలమై విమర్శలు మూటగట్టుకున్నాడు. తద్వారా జట్టు నిర్ణయానికి వ్యక్తిగతంగా బలయ్యాడు. బీసీసీఐ నష్ట నివారణ రవిశాస్త్రి వ్యాఖ్యలకు దుమారం రేగడంతో బీసీసీఐ నష్ట నివారణకు దిగింది. జడేజా పూర్తి ఫిట్నెస్తో ఉన్నందుకే ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేశామని ప్రకటించింది. ఈ మేరకు మెల్బోర్న్ సమయం ప్రకారం ఆదివారం అర్థరాత్రి దాటాక వివరణ ఇచ్చింది. ‘ఎడమ భుజం గాయం నుంచి జడేజా కోలుకుంటున్నాడు. మెల్బోర్న్ టెస్టుకు అందుబాటులో ఉంటాడు. స్వదేశంలో వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో అతడికీ ఇబ్బంది తలెత్తింది. నవంబరు 2న ముంబైలో ఇంజక్షన్ తీసుకున్నాడు. తర్వాత సౌరాష్ట్ర తరఫున రంజీ ఆడి... ఎలాంటి ఇబ్బంది లేకుండా 64 ఓవర్లు వేశాడు. ఫిట్‌గా ఉన్నట్లు తేలడంతోనే ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేశాం’ అని పేర్కొంది. నవంబరు 30న సీఏ ఎలెవెన్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా మరో ఇంజక్షన్ తీసుకున్నాడని వివరించింది. పెర్త్ టెస్టుకు ముందు నెట్స్‌లో జడేజా ప్రాక్టీస్ చేసినా... అది స్థాయికి తగినట్లు లేకపోవడంతో తుది జట్టులోకి తీసుకోలేదని పేర్కొంది. -
ఇలాంటి ప్రభుత్వాలొస్తాయని రావిశాస్త్రి ఊహించలేదు
-
ఇలాంటి ప్రభుత్వాలొస్తాయని రావిశాస్త్రి ఊహించలేదు
సాక్షి, విశాఖపట్నం: ఉన్నదున్నట్టు, నిఖార్సుగా నిర్భయంగా రావిశాస్త్రిలా రాసే రచయితలు నేటి సమాజం, సాహితీ లోకం, పత్రికలు, టీవీల్లోనూ లేరని సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి అన్నారు. నేడు రావిశాస్త్రిలాంటి రచయితలుంటే అణువిద్యుత్ కేంద్రాలు ఏర్పాటయ్యేవి కావని, గోమాంసం తిన్నారని ముస్లింలను హత్య చేసే వికారపు ఘటనలపై స్పందించే వారన్నారు. ఆయన హయాంలో ఇలాంటివి లేవని, ఇలాంటి ప్రభుత్వాలు అధికారంలోకి వస్తాయని, ఇలాంటి భావజాలం దేశంలో బలంగా వ్యాప్తిస్తుందని అప్పట్లో ఆయన ఊహించి ఉండరని చెప్పారు. శనివారం సాయంత్రం విశాఖ పౌరగ్రంథాలయంలో రాచకొండ విశ్వనాథ శాస్త్రి 95వ జయంతి సందర్భంగా రావిశాస్త్ర్రి లిటరరీ ట్రస్టు ఆవిర్భావం, అవార్డు ప్రదానోత్సవ సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో బోలెడంత ఘర్షణ జరుగుతున్నా పత్రికల్లో దానికి అద్దం పట్టేలా రాసేవారూ లేరని, ప్రభుత్వ నిర్ణయాలను విమర్శిస్తూ రాసే అవకాశం లేదని పేర్కొన్నారు. షేక్స్పియర్ అంతటి గొప్ప రచయితలు మనకు లేకపోవచ్చు గాని తెలుగుసాహిత్యంలో అంతటి దిగ్గజాలున్నారన్నారు. నేటి తరం రచయితలు, సాహితీవేత్తలు రావిశాస్త్రిని స్ఫూర్తిని తీసుకోవాలని కోరారు. సాహిత్యంలోనూ, రాజకీయాల్లోనూ, సమాజంలోనూ గొప్ప సేవ చేసిన వ్యక్తుల్ని జ్ఞాపకం చేసుకునే సంప్రదాయం తక్కువగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత నీలం సంజీవరెడ్డి, చెన్నారెడ్డి, జలగం వెంగళరావు, టంగుటూరి ప్రకాశం పంతులు, తెన్నేటి విశ్వనాథం వంటి మహనీయుల గురించి వారి కుటుంబాలు గాని, సమాజం గాని స్నేహితులు గాని తలచుకునే అవకాశం లేదన్నారు.అపర చాణక్యుడిగా పేరొందిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మరణించిన ఎనిమిదేళ్ల వరకు ఆయన సంతాప సభ జరగలేదని గుర్తు చేశారు. మొదటి సంతాప సభను తానే నిర్వహించానని, ఆ సభకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ హాజరయ్యారని చెప్పారు. పీవీతో తనకు బంధుత్వం లేకపోయినా సాన్నిహిత్యం ఉందన్నారు. ఆయన కుమారులకు సంతాప సభలు నిర్వహించే శక్తి, సామర్థ్యాలున్నా వారికా సంకల్పం లేదన్నారు. విశ్వనాథ సత్యనారాయణ జ్ఞాపకాలను గుర్తు చేసుకునే ప్రయత్నాలు జరగలేదన్నారు. రావిశాస్త్రి గురించి అలాంటి ప్రయత్నాలు జరిగినందుకు, ఆయన పేరిట లిటరరీ ట్రస్టు ఏర్పాటు, అవార్డులివ్వడం వంటివి చేయడం అభినందనీయమని చెప్పారు. ఇలాగే తెలుగు భాషకు సేవచేసిన వారికి పురస్కారాలు ఇచ్చి ప్రోత్సహించాలన్నారు. ఒక భాషపై అధికారం సంపాదించిన వారికి ఇంకో భాషపై పట్టు సాధంచడం పెద్ద కష్టం కాదని పేర్కొన్నారు. రామతీర్థకు రావిశాస్త్రి అవార్డు ప్రదానం తొలుత రావిశాస్త్రి లిటరరీ ట్రస్టును రామచంద్రమూర్తి ప్రారంభించారు. అనంతరం రచయిత, కవి రామతీర్థకు రావిశాస్త్రి పేరిట నెలకొల్పిన తొలి అవార్డును ప్రదానం చేశారు. అనంతరం రావిసారాలు వ్యాస సంపుటిని, ఆంగ్లంలో రచించిన ’రాకంటూర్ రాచకొండ’ పొట్టి పిట్టకధల సంపుటిని ఆవిష్కరించారు. వేడుకగా జరిగిన ఈ సాíß తీ కార్యక్రమంలో ప్రజాకవి వంగపండు ప్రసాదరావు, ఆచార్య చందు సుబ్బారావు, రావిశాస్త్రి కుమారులు ప్రసాద్, ఉమాకుమారశాస్త్రి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఎల్.ఆర్.స్వామి, రచయితలు జగద్ధాత్రి, శిబానంద కల్యాణ రామారావు, జయశీలరావు, డీవీ సూర్యారావు, పేరి రవికుమార్, మంగు శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.