rayadurgam lands
-
సాక్షి ఎఫెక్ట్: రాయదుర్గం భూములపై ఎల్‌అండ్‌టి మెట్రో రైల్ వివరణ
సాక్షి, హైదరాబాద్: రాయదుర్గం భూములపై ఎల్అండ్టీ మెట్రో రైల్ వివరణ ఇచ్చింది. ప్రభుత్వం ఆమోదంతోనే సబ్‌లైసెన్స్ హక్కులను రాఫర్టీకి అప్పగిమంచామని, ఈజీఎంలో షేర్ హోల్డర్ల ఆమోదం పొందిన తర్వాతే బీఎస్ఈకి తెలిపామని ఎల్అండ్టీ మెట్రో రైల్ తెలిపింది. స్థిరాస్తి విక్రయించండం జరగదని స్పష్టం చేసింది. సబ్ లైసెన్స్‌పై కొన్ని అనుమతులు రావాల్సి ఉందనిఎల్అండ్టీ మెట్రో రైల్ పేర్కొంది. చదవండి: కేసీఆర్ పక్కా ప్లాన్.. బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్ట్ రెడీ.. -
ఆ భూములపై రైతులకే హక్కులు..
సాక్షి, అమరావతి: రాయదుర్గం సోలార్ పార్క్ కోసం రైతుల నుంచి భూములను సేకరించడం లేదని, ప్రభుత్వం కేవలం లీజు అగ్రిమెంట్ మాత్రమే చేసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ నూతన పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్ఆర్ఈడీసీఏపీ) స్పష్టం చేసింది. దీనికి సంబంధించి కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తల్లో నిజం లేదని స్పష్టం చేస్తూ నెడ్‌క్యాప్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. - రైతులకు ఆ భూములపై పూర్తి హక్కులుంటాయి. ఎకరానికి ఏటా ఇచ్చే లీజును ప్రభుత్వం రూ.25 వేల నుంచి రూ.30 వేలకు పెంచి రైతులకు సోలార్ పార్కు ద్వారా అధిక ఆదాయం సమకూరేలా చేసింది. రైతులకు ఇంత అధిక ఆదాయం వచ్చేలా చేస్తుంటే ప్రతిపక్షం రైతులకు ద్రోహం చేసేలా వ్యవహరించడం బాధ్యతారాహిత్యం. - రైతుల ఆదాయం పెంచేలా ప్రభుత్వం పాలసీ తెచ్చింది. రైతుల నుంచి లీజుకు తీసుకునే భూమికి ఏడాదికి ఎకరానికి రూ.30 వేలు చెల్లించడమే కాకుండా ప్రతి రెండేళ్లకు ఐదు శాతం పెంచుతుంది. భూములను లీజుకు తీసుకోవడంలో నెడ్‌క్యాప్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. రైతులు పూర్తిగా అంగీకారం తెలిపాకే లీజుకు తీసుకుంటోంది. రాష్ట్రంలో నాలుగు సోలార్ పార్కులను అభివృద్ధి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ సోలార్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్పీసీఎల్) జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటైంది. - నెడ్‌క్యాప్ అనుభవం లేని సంస్థ అనడంలో అర్థంలేదు. నెడ్‌క్యాప్ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సంస్థ. దీర్ఘకాలంగా పునరుత్పాదక ఇంధన వనరుల ప్రాజెక్టుల్లో పనిచేస్తోంది. -
రాయదుర్గం భూములపై తీర్పు వాయిదా
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలోని సర్వే నంబర్ 46లోని 84 ఎకరాల భూమిపై హైకోర్టు వెలువరించిన తీర్పును కొట్టివేయాలని విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో దాఖలు చేసిన రీకాల్ పిటిషన్లో వాదనలు ముగిశాయి. తీర్పును వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రైవేట్ వ్యక్తులు దాఖలు చేసిన రిట్ పిటిషన్లను పరిశీలించి విచారణ అర్హతను తేలుస్తామని చెప్పిన హైకోర్టు.. ఆ వ్యక్తులకు భూములపై హక్కులున్నాయని తీర్పు చెప్పడం చట్టవిరుద్ధమని ప్రభుత్వం అభిప్రాయపడింది. ఈ మేరకు రీకాల్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై న్యాయమూర్తులు జస్టిస్ గండికోట శ్రీదేవి, జస్టిస్ ప్రియదర్శిని ధర్మాసనం విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ వాదనలు వినిపించారు. ఆ 84 ఎకరాలు ప్రభుత్వానివేనని.. కొందరు తప్పుడు పత్రాలతో ఆ భూమిపై హక్కులు పొందారని చెప్పారు. గత ఏప్రిల్‌లో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని కోరారు. భూములపై బూర్గుల రామకృష్ణ, లింగమయ్య దాఖలు చేసిన రిట్లు విచారణార్హత తేల్చుతామన్న హైకోర్టు ఏకంగా వాళ్ల భూహక్కులపై ఉత్తర్వులు ఇవ్వడం చెల్లదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వాదనను పరిగణనలోకి తీసుకోకుండా తీర్పు వెలువరించడం సరికాదన్నారు. ప్రైవేట్ వ్యక్తుల తరఫున సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు, న్యాయవాది అశోక్ ఆనంద్ వాదనలు వినిపిస్తూ.. ద్విసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించాక దానిపై అభ్యంతరాలు ఉంటే సుప్రీంకోర్టును ఆశ్రయించాలే తప్ప.. మళ్లీ హైకోర్టుకు రాకూడదన్నారు. ప్రభుత్వ వాదనను అనుమతించవద్దని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. తీర్పును వాయిదా వేసింది. -
రాజ్‌నాథ్‌ను కలిసిన ఎంపీ కొత్తపల్లి గీత
న్యూఢిల్లీ: అరకు ఎంపీ కొత్తపల్లి గీత శుక్రవారం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ఢిల్లీలో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని రాయదుర్గంలో ఉన్న తమ భూమి విషయంలో నెలకొన్న వివాదంపై హోంమంత్రికి వివరించినట్టు ఆమె తెలిపారు. ఆ భూమికి సంబంధించి తమకు అనుకూలంగా హైకోర్టు రెండు ఆర్డర్లు ఇచ్చిందని గీత పేర్కొన్నారు. దీనికి సంబంధించిన అన్ని సాక్ష్యాదారాలను ప్రభుత్వానికి అందించినట్టు ఆమె తెలిపారు. అయితే రెవెన్యూ శాఖ తమ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోందని కొత్తపల్లి గీత ఆరోపించారు. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని హోం మంత్రిని కోరినట్టు ఆమె తెలిపారు. దీనిపై త్వరలోనే సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించనున్నట్టు కొత్తపల్లి గీత పేర్కొన్నారు. కాగా హైదరాబాద్ శివార్లలోని రాయదుర్గంలో అత్యంత విలువైన భూములను దక్కించుకునేందుకు అరకు ఎంపీ కొత్తపల్లి గీత, ఆమె భర్త పీఆర్కే రావు అడ్డదారులు తొక్కి, ఇందుకోసం తప్పుడు పత్రాలు సృష్టించారు. రిజిస్ట్రార్‌ను ప్రలోభపెట్టి వాటిని ధ్రువీకరింపజేసుకున్నారు. ఎనిమిది కంపెనీలు పెట్టి భూములను వాటి పేరున బదలాయించుకున్నారు. నకిలీ సేల్డీడ్లు హామీగా పెట్టి రుణం తీసుకుని బ్యాంకునూ మోసం చేశారు. నకిలీ డాక్యుమెంట్లతో భూమిలో కొంత భాగాన్ని ఇతరులకు అమ్మారు. రాయదుర్గంలోని సర్వే నంబర్ 83లో ఉన్న 99.07 ఎకరాల భూములు తమవేనని కొత్తపల్లి గీత చేస్తున్న వాదన అవాస్తవమని ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైంది. ఈ నెల 12న రెవెన్యూ శాఖ నుంచి సేకరించిన పహాణీలో ఆ భూములు.. దాని యజమానులు రుక్ముద్దీన్ అహ్మద్, ఆయన కుటుంబ సభ్యుల పేరిటే ఉన్నాయని తేలింది. ఇక పార్లమెంట్ సభ్యురాలిగా బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న కొత్తపల్లి గీత పేరిట నిబంధనలకు విరుద్ధంగా రెండు పాన్‌కార్డులు ఉన్న విషయం బయటపడింది.