కోకో తోటలో మంటలు
రాయన్నపాలెం (పెదవేగి రూరల్): పెదవేగి మండలం రాయన్నపాలెంలో విద్యుదాఘాతంతో కోకో తోటలు మంటలు చెలరేగాయి. ఎకరన్నర పొలం కాలిబూడిదయ్యింది. అగ్నిమాపక సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. రాయన్నపాలెం గ్రామానికి చెందిన కూచిపూడి వెంకట భాస్కరరావు కోకో పొలం మీదుగా 11 కేవీ విద్యుత్ తీగల లైన్ ఉంది. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో విద్యుత్ తీగల నుంచి నిప్పులు చెలరేగి మంటలు వ్యాపించాయి. దీంతో కోకో చెట్లు కాలిపోయాయి. స్థానికులు, ఏలూరు అగ్నిమాపక సిబ్బంది రక్షణ చర్యలు చేపట్టినా ఫలితం లేదు. ప్రమాదంలో రూ.25 వేలు విలువైన డ్రిప్పులు, రూ.75 వేల పంట నష్టం వాటిల్లినట్టు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. మంటలను వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది నియంత్రించారు.