Rayikod
-
అరచేతిలో ప్రాణం..వాగుపై ప్రయాణం
ధ్వంసమవుతున్న వంతెన రక్షణ గోడలు పట్టించుకోని అధికారులు రాయికోడ్:మండల కేంద్రమైన రాయికోడ్ గ్రామ సమీపంలోని వాగుపై నిర్మించిన వంతెన రక్షణ గోడలు ధ్వంసం కావడంతో ప్రయాణం ప్రమాదకరంగా మా రింది. రాయికోడ్–చిమ్నాపూర్ ప్రధాన రహదారిపై ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించిన వంతెనకు ఇరువైపులా ఉన్న రక్షణ గోడ (రెయిలింగ్)కు ఇనుప చువ్వలు పైకి తేలి కాంక్రీటు పాడైంది. వాహనాలు నడిపేటప్పుడు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా వాహనాలు వంతెన కింద పడిపోయే ప్రమాదం ఉంది. ఎన్నో ఏళ్ల క్రితం ని ర్మించిన ఈ వంతెనపై ప్రయాణికులు భ యంభయంగా ప్రయాణిస్తున్నారు. ఇప్పటికైనా రక్షణ గోడలు నిర్మించాలని వాహనదారులు, ప్రయాణికులు కోరుతున్నారు. అలాగే ఎప్పుడో నిర్మించిన వంతెనను సంబంధిత శాఖల ఇంజనీర్లు పరిశీలించి వంతెనపై ప్రయాణం ఎంతవరకు భద్రమో తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మండల పరిధిలోని రాయిపల్లి– కర్చల్ రహదారిపై రాయిపల్లి శివారులో ఉన్న మూలమలుపు ప్రాంతంలోని కల్వర్టు ధ్వంసమైంది. అక్కడ రోడ్డు కోతకు గురికావడంతో ప్రయాణం చేసేం దుకు వీల్లేకుండా ఉంది. దీంతో ఈ ప్రాం తంలో తరచుగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇక్కడ గతంలో పలు ప్రమాదాలు జరగడంతో పలువురు వా హన దారులు, ప్రయాణికులు గాయపడిన సంఘటనలూ ఉన్నాయి. కల్వర్టును నిర్మించి రోడ్డు మరమ్మతు చేయాలని ఎన్ని సార్లు మొర పెట్టుకున్నా ఫలితం లేదని కర్చల్, రాయిపల్లి, మామిడిపల్లి, ఇందూర్ తదితర గ్రామాలకు చెందిన వాహన దారులు వాపోతున్నారు. అధికారులు రోడ్డు, కల్వర్టులకు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. లోలెవల్ బ్రిడ్జిలతో ఇబ్బందులు మండలంలోని హుల్గేర, యూసుప్పూర్, రాయిపల్లి, కుసునూర్ గ్రామ శివార్లలోని వాగులపై గతంలో నిర్మించిన లో లెవల్ బ్రిడ్జిలతో ఇబ్బందులు వస్తున్నాయి. వర్షాకాలంలో బ్రిడ్జీలపై నుంచి పారుతుండటంతో రోజుల తరబడి వేరే గ్రామాలకు వెళ్లలేని పరిస్థితులు నెలకొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరుచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి.. రాయిపల్లి గ్రామ శివారులోని మూలమలుపు వద్ద కల్వర్టు ధ్వంసమై రోడ్డు కోతకు గురికావడంతో ఈ ప్రాంతంలో తరచుగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా కల్వర్టు మరమ్మతుకు ఎటువంటి చర్యలు చేపట్టడంలేదు. – సంగమేశ్వర్, కర్చల్ గ్రామం రక్షణ గోడలు నిర్మించాలి.. రాయికోడ్ వంతెనకు రక్షణగా ఉన్న గోడలకు మరమ్మతు చేయాలి. ఇక్కడ రాత్రివేళల్లో ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. ప్రమాదం పొంచి ఉన్నందున రక్షణ గోడలను పటిష్టం చేసి ప్రయాణికుల భద్రతకోసం చర్యలు తీసుకోవాలి – రవికుమార్, డ్రైవర్ రాయికోడ్ -
సర్కార్ బడికి తాళం!
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి విద్యాభివృద్ధికి పాటుపడాల్సిన ఆ శాఖ అధికారులు నిరుపేద చిన్నారులను బడికి దూరం చేస్తున్నారు. ఉన్న ఒక్క టీచర్‌ను.. వర్క్ అడ్జస్ట్మెంట్ పేరుతో వేరే మండలానికి పంపించి పాఠశాల మూతపడేలా చేశారని రాయికోడ్ మండల పరిధిలోని అల్లాపూర్వాసులు మండిపడ్డారు. ఇలాగైతే తమ పిల్లల బతుకులు ఏం కావాలని ప్రశ్నించారు. - ‘వర్క్ అడ్జస్ట్మెంట్’తో మూతపడిన పాఠశాల - ఉన్న ఒక్క టీచర్ని వేరే చోటకు పంపిన వైనం - ఆందోళనలో అల్లాపూర్వాసులు రాయికోడ్: ఉపాధ్యాయులు లేక, విద్యార్థుల సంఖ్యతగ్గిబోసిపోతున్న సర్కారీ బడులను బలోపేతం చేయాల్సిన విద్యాశాఖ అధికారులు దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. వర్క్ అడ్జస్ట్మెంట్ పేరుతో ఇష్టానుసారంగా టీచర్లను ఇతర మండలాలకు పంపిస్తూ పేద విద్యార్థులను చదువు నుంచి దూరం చేస్తున్నారు. మండలంలోని అల్లాపూర్ ప్రాథమిక పాఠశాలే దీనికి నిదర్శనం. దీనిలో 1 నుంచి 5వ తరగతి వరకు 25 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడ ఒకే టీచర్ ఉండటంతో.. గ్రామానికి చెందిన 40 మంది పిల్లలు ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలలకు వెళ్తున్నారు. నిరుపేద కుటుంబాలకు చెందిన 25 మంది మాత్రమే ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు. ఈ క్రమంలో స్కూల్లో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయురాలు సంతోషను వర్క్ అడ్జస్ట్మెంట్పై పటాన్చెరు మండలం కిష్టారెడ్డిపేటకు పంపించారు. వంట మనిషి నాగమ్మ బుధవారం మధ్యాహ్న భోజనం వడ్డించిన అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు పాఠశాలకు తాళం వేశారు. ఉన్న ఒక్క టీచర్‌ను కూడా ఇతర పాఠశాలకు పంపించడంపై తల్లిదండ్రులు, స్థానికులు మండిపడుతున్నారు. ఉన్నవాళ్లు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాల్లో చదివిస్తున్నారని.. కూలీనాలి చేసుకుని బతికే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. డీఈఓ కార్యాలయం నుంచి గత నెల 28న తమకు అందిన ఉత్తర్వుల మేరకు ఉపాధ్యాయురాలిని వర్క్ అడ్జస్ట్మెంట్పై పంపించామని ఎంఈఓ శ్రీనివాస్ తెలిపారు. పాఠశాల మూతపడటం, వర్క్‌అడ్జస్ట్‌మెంట్ అంటే అర్థమేంటని..? జోగిపేట డిప్యూటీ ఈఓ పోమ్యానాయక్‌ను అడగగా.. టీచర్‌ను ఇతర మండలానికి పంపించినట్లు తనకు సమాచారం లేదని జవాబు దాటవేశారు. రాష్ట్ర స్థాయి నాయకులు, అధికారుల నుంచి వచ్చిన వత్తిడి మేరకే పాఠశాల మూత పడుతోందని తెలిసినా అధికారులు నోరు మెదపడం లేదని తెలిసింది. ఈ ఏడాది జూలై లోను మండల పరిధిలోని కర్చల్ పాఠశాల ఉపాధ్యాయరాలు స్వప్నను కూడా ఇదే రీతిలో లింగారెడ్డిపల్లి పాఠశాలకు పంపించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అధికారులు తమ పాఠశాలలో సిబ్బందిని నియమించాలని స్థానికులు కోరుతున్నారు. -
బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ముస్లింలు
రాయికోడ్: మండలంలోని రాయిపల్లి గ్రామంలో బుధవారం నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో స్థానిక ముస్లింలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు స్వయంగా రంగురంగుల పూలను తీసుకువచ్చి ఐదు అడుగుల బతుకమ్మను తయారు చేశారు. తయారు చేసిన బతుకమ్మను స్థానిక మహిళలకు అందజేశారు. హిందువులతో పాటు పండుగ వేడుకల్లో పాల్గొని మతసామరస్యాన్ని చాటిన యాదుల్, నబీసాబ్, చాంద్‌పాష, ఖాసీంసాబ్ తదితరులను స్థానిక శాలివాహన సంఘం నాయకులు పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. మసీదు అభివృద్ధి కోసం స్థానిక ఉపసర్పంచ్ చేతుల మీదుగా రూ.1100లను అందజేశారు. కార్యక్రమంలో విద్యార్థి జేఏసీ జిల్లా ఉపాధ్యక్షుడు కాశీ బస్వరాజ్ పాటిల్, శాలివాహన సంఘం నాయకులు, గ్రామపెద్దలు సాయిలు, అంజయ్య, మల్లయ్య, సంగయ్య, కాశీనాథ్, కృష్ణ, విఠల్, చెట్టయ్య తదితరులు పాల్గొన్నారు. -
మంచంపట్టిన పల్లెలు!
►జ్వరం, కీళ్ల నొప్పులతో ఆస్పత్రుల బాటపడుతున్న రోగులు ►సొమ్ము చేసుకుంటున్న ప్రైవేట్ ఆస్పత్రులు రాయికోడ్: నెల రోజుల నుంచి మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు తీవ్ర జ్వరం, కీళ్ల నొప్పులతో బాధపడుతూ మంచం పడుతున్నారు. కుటుంబసభ్యుల్లో ఒకరికి తగ్గకముందే మరొకరు జ్వరం, కీళ్ల నొప్పులతో మంచాన పడుతుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మండలంలోని ఇం దూర్, కర్చల్, ఇటికేపల్లి, రాయికోడ్, పీపడ్పల్లి, రామోజిపల్లి, జమ్గి తదితర గ్రామాల్లో రోగాల భయంతో జనం బెం బెలెత్తుతున్నారు. అయితే నెల రోజులుగా జ్వరం, కీళ్ల నొప్పులు ఎందుకు వస్తున్నాయో, అసలు ఏ రోగం వల్ల ప్రజలు అస్వస్థతకు గురవుతున్నారో వై ద్యాధికారులు ఇప్పటివరకు నిర్ధారించ లేకపోయారు. స్థానిక ల్యాబ్‌లో మలేరియా, టైఫాయిడ్ పరీక్షలు చేపట్టి వైద్యులు చేతులు దులుపుకున్నారు. ఇటికేపల్లి గ్రామస్తుల ఫిర్యాదు మేరకు మూడు రోజుల క్రితం రోగుల రక్త నమూనాలను హైదరాబాద్‌కు పంపిం చారు. ఆయా గ్రామాల్లో విజృంభిస్తున్న జ్వరం, కీళ్ల నొప్పులతో పేద రోగులు రాయికోడ్ పీహెచ్‌సీకి పరుగులు పెడుతున్నారు. అయితే డాక్టరు లేకపో వడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రిలోని డాక్టర్ షా మిలి ఇన్చార్జ్గా విధులు నిర్వహి స్తున్నారు. అయితే డాక్టర్ ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు వెళుతున్నారో తెలియని దుస్థితి నెలకొందని రోగులు వాపోతున్నారు. కిందిస్థాయి సిబ్బంది ఎలాంటి పరీక్షలు చేయకుండా తోచిన మందులిచ్చి పంపుతున్నారని మండిపడుతున్నారు. పారిశుద్ధ్య లోపం, కలుషిత నీటి సరఫరా కాదని, పంచాయితీ అధికారులు, వ్యాధి నిర్ధారణ కాలేదని ప్రభుత్వ వైద్యాధికారులు చెబుతు న్నారు. దీంతో రోజు రోజుకు రోగుల సంఖ్య పెరుగుతుండటంతో జ్వరం, కీళ్ల నొప్పులెందుకు వస్తున్నాయో తెలియక స్థానికులు అయోమయానికి గురవుతున్నారు. ప్రజల అవసరాన్ని, ప్రభుత్వ వైద్య శాఖ నిర్లక్ష్యాన్ని మండలంలోని పలువురు ప్రైవేటు డాక్టర్లు సొమ్ము చేసుకుంటున్నారు. రోగాన్ని నిర్ధారించకుండానే వివిధ రకాల మందులను రాసి, రూ.వందల్లో వసూలు చేస్తు నిరుపేదల జేబులను ఖాళీ చేస్తున్నారు. వారి వైద్యం వల్ల తాత్కాలికంగా జ్వరం, కీళ్ల నొప్పులు తగ్గుతున్నా సంపూర్ణంగా కోలుకోవడం లేదని పలువురు రోగులు వాపోతున్నారు. -
పక్కనే మంజీర.. అయినా ఎక్కిళ్లే..
రాయికోడ్, న్యూస్‌లైన్: పక్కనే మంజీర పారుతున్నా.. చుక్కనీరు అందక రాయికోడ్ కన్నీళ్లు పెడుతోంది. నిత్యం నీటి ఎద్దడితో ప్రజలు అవస్థలు పడుతున్నారు. కేవలం రూ. 60 కోట్లు నిధులు ఖర్చు చేస్తే 47 గ్రామాలకు దాహార్తిని తీర్చే మంచినీటి పథకంపై పాలకులు శీతకన్ను వేశారు. పాంపాడ్ గ్రామ శివారులో మంజీర నదిలో అంతర్గత బావిని నిర్మించి, 100 హెచ్‌పీ సామర్థ్యం గల మోటార్లతో మంజీరా నీటిని ఆయా గ్రామాలకు తరలించాలని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సంకల్పించారు. ఈమేరకు ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 60 కోట్లు అవసరమవుతాయని అధికారు లు ప్రతిపాదనలు పంపారు. కానీ వైఎస్సార్ మరణంతో ఆ ప్రతిపాదనలు అటకెక్కాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ 2012 వార్షిక బడ్జెట్లో రూ.37.50 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. పథకం సర్వే పనులే ఏడాదిపాటు సాగాయి. పాంపాడ్‌లో అంతర్గత బావి.. రాయికోడ్, మునిపల్లి మండలాల్లోని 47 గ్రామాలకు నీరందించేందుకు మండల పరిధిలోని పాంపాడ్ నుంచి రెండు మండలాల్లోని ఆయా గ్రామాలకు సుమారు 150 కిలో మీటర్ల మేర పైపులైను ఏర్పాటు చేయనున్నారు. నిర్మాణ పనుల మందకొడిగా సాగుతున్నాయి. ఇప్పటివరకు కేవలం 40 కిలోమీటర్ల మేర పైపులైను మాత్రమే ఏర్పాటైంది. అది కూడా అసంపూర్తిగానే ఉన్నాయి. అంతర్గత బావి, ఫిల్టర్ బెడ్ నిర్మాణాల పనులు కూడా సాగుతున్నాయి. పనులు ఇలానే కొనసాగితే అంచనా వ్యయం భారీగా పెరగటంతో పాటు, ఏళ్ల తరబడి ఆలస్యమయ్యే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం ద్వారా రాయికోడ్ మండలంలోని 29 గ్రామా లు, మునిపల్లి మండలంలోని 18 గ్రామాలకు చెందిన 60 వేల జనాభాకు మంజీర నీటిని సరఫరా చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా మండలంలోని మహబత్‌పూర్ గ్రామంలో 1.75 లక్షల లీటర్ల సామర్థ్యం గల ట్యాంకును నిర్మించాలి. అదేవిధంగా మహమ్మదాపూర్, ఝరాసంఘం మండలంలోని కప్పాడ్, ము నిపల్లి మండలంలోని మేళసంఘం గ్రామాల్లో మరో మూడు 90 వేల లీటర్ల నీటి సామర్థ్యం ఉన్న ట్యాంకులను నిర్మించనున్నారు. ప్రజల్లో నైరాశ్యం వేసవి వచ్చిందంటే ఆయా మండలాల్లోని గ్రామీణులు గుక్కెడు నీటి కోసం అష్టకష్టాలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే పలుసార్లు ప్రభుత్వాధికారులకు, నాయకులకు తమ గోడును విన్నవించారు. ఏడేళ్లు గడుస్తున్నా అధికారులు ఇదిగో వచ్చే.. అదిగో వచ్చే అని చెప్తున్నారే కాని కాల్వ నిర్మాణ పనులు మాత్రం పూర్తి చేయకపోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
అనుమానాస్పదంగా ఇద్దరి మృతి
రాయికోడ్, న్యూస్‌లైన్: అనుమానాస్పదంగా ఓ వ్యక్తి మృ తి చెందిన సంఘటన రాయికోడ్ మండలంలోని చిమ్నాపూర్‌లో ఆదివారం చో టుచేసుకుంది. ఎస్ఐ శ్రీనివాస్, స్థానికు ల కథనం ప్రకారం.. అందోల్ మండ లం డాకూర్‌కు చెందిన పెద్దగొల్ల రాజు (30)కు మండలంలోని జంమ్గి గ్రామానికి చెందిన గడ్డమీది శంకర్ రెండో కూతురు సంధ్యతో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. కాగా శనివారం రాజు తన భార్య తల్లిదండ్రుల వద్దకు వచ్చి ఆ దివారం ఉదయం స్వగ్రామానికి తిరిగి ప్రయాణమయ్యాడు. అయితే జంమ్గి నుంచి బయల్దేరిన అతడు చి మ్నాపూర్ వచ్చి మద్యం సేవించాడు. మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఓ దాబా పక్కన అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. మధ్యాహ్నం 4.30 గంటలవుతున్నా ఆ వ్యక్తి అక్కడి నుంచి కదలకపోవడంతో స్థానికులు దగ్గరికి వెళ్లి చూడగా నోట్లో నుంచి బురుగులు వచ్చిన ఆనవాళ్లను కనిపించాయి. దీంతో వారు పోలీసుల కు సమాచారం అందించారు. ఎస్ఐ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా అప్పటికే రాజు మృతి చెందాడు. విషయం మృతుడి మామకు తెలియడం తో సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహం వద్ద బోరున విలపించాడు. నా లుగేళ్ల క్రితం తన తన పెద్ద అల్లుడు సై తం మద్యం సేవించి చిమ్నాపూర్‌లోనే చనిపోయాడని రోదిస్తు తెలిపాడు. మృ తుడి తల్లిదండ్రులు వచ్చిన అనంతరం శవాన్ని పోస్టుమార్టంకు తరలిస్తామని ఎస్ఐ చెప్పారు. అయితే సంగారెడ్డిలోని పెట్రోలు బంక్‌లో పని చేస్తాడని, అక్కడి కి వెళ్తున్నానని చెప్పి ఇక్కడికి ఎందుకు వచ్చాడోనని మృతుడి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. నాగిరెడ్డిగూడెంలో.. జిన్నారం: అనుమానాస్పదస్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన జిన్నా రం మండలంలోని నాగిరెడ్డిగూడెం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. ఏఎస్ఐ మల్లారెడ్డి కథనం ప్రకారం.. నాగిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన ఏర్పుల అశోక్ (35) ఎప్పటిలాగే శనివా రం రాత్రి ఇంట్లో నిద్రించాడు. ఉదయం తెల్లవారేసరికి మృతి చెంది ఉన్నాడు. ఈ విషయాన్ని గమనించిన మృతుడి భార్య లక్ష్మి పోలీసులకు సమాచారాన్ని అందించారు. సంఘటనా స్థలాన్ని ఏఎస్ఐ మల్లారెడ్డి సందర్శిం చారు. మృతికిగల కారణాలపై ఆరా తీశారు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నామని ఏఎస్ఐ తెలిపారు. అయితే ఈ మృతిపై అశోక్ తల్లి పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.