ఆర్బీఐ సీనియర్ అధికారి అరెస్ట్
బెంగళూరు: అక్రమ నోట్ల మార్పిడి వ్యవహారంలో రిజర్వ్ బ్యాంకు సీనియర్ అధికారిని అరెస్ట్ చేశారు. మంగళవారం బెంగళూరులో సీబీఐ అధికారులు ఆయనతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. రిజర్వ్ బ్యాంకు అధికారి పేరు, ఆయన హోదా వంటి వివరాలు తెలియరాలేదు. కమీషన్ తీసుకుని 1.5 కోట్ల రూపాయల పాత నోట్లకు కొత్త కరెన్సీ ఇచ్చినట్టు ఆరోపణలు వచ్చాయి. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. ఈ రోజు కర్ణాటకలో ఈడీ అధికారులు దాడులు చేశారు.
గత నెల 8న కేంద్ర ప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసిన దేశ వ్యాప్తంగా కొంతమంది బ్యాంకు, పోస్టల్ అధికారులు అక్రమాలకు పాల్పడ్డారు. సీబీఐ అధికారులు కొందరిని అరెస్ట్ చేశారు.