RBS
-
రైతు భరోసా కేంద్రాలతో రైతులకు అండగా నిలిచిన వైఎస్ జగన్
-
వాళ్లకి ఉద్యోగాల కోత: మనకే ఆ జాబ్స్
బ్రిటీష్ కు చెందిన రాయల్ బ్యాంకు ఆఫ్ స్కాంట్లాండ్(ఆర్బిఎస్) తమ యూకే వ్యాపారాలలో దాదాపు 443 ఉద్యోగాలకు కోత పెట్టాలని ప్లాన్ వేస్తోంది. ఆ ఉద్యోగాల్లో చాలావాటిని భారత్ కు తరలించాలని చూస్తున్నట్టు బ్యాంకు చెప్పింది. అయితే ఈ వార్త ఉద్యోగులకు జీర్ణించుకోలేనిదని, వారికి మద్దతుగా నిలిచేందుకు తాము చేయాల్సిందల్లా చేస్తామని బ్యాంకు ఓ ప్రకటనలో పేర్కొంది. 70శాతానికి పైగా ప్రభుత్వానికి చెందిన ఈ బ్యాంకు, దాదాపు ఒక దశాబ్దం నష్టాల తర్వాత తిరిగి మళ్లీ లాభాలను ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో బ్యాంకు అతిపెద్ద పునర్నిర్మాణ ప్రక్రియను చేపడుతోంది. చిన్న వ్యాపారాల రుణాలకు సాయంగా నిలిచేందుకు తమ ఉద్యోగాలను బదిలీచేస్తున్నామని బ్యాంకు పేర్కొంది. ఇది తాము చేపడుతున్న వ్యయాల కోతలో ఓ భాగమని కూడా తెలిపింది. తాము కస్టమర్లకు అందించే సేవల్లో కొన్ని మార్పులు చేస్తున్నామని, దీని ఫలితంగా యూకేలో 443 ఉద్యోగాలు పోతాయని బ్యాంకు అధికార ప్రతినిధి చెప్పారు. ఈ ఉద్యోగాలను భారత్ కు తరలించడం ద్వారా చాలా చౌకగా పనులు పూర్తి చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఉద్యోగాలు తరలించడం ద్వారా 2007-09 ఆర్థిక సంక్షోభ సమయంలో ఈ ముప్పు నుంచి తప్పించుకోవడానికి 46 బిలియన్ పౌండ్ల బైలౌట్ ను అందుకుంది. గత నెలలోనే బ్యాంకు కొన్ని ఉద్యోగాల కోత ఉంటుందని, వారిలో కొందర్ని భారత్ కు తరలిస్తామని కూడా చెప్పింది. -
ఇన్ఫోసిస్‌కు ఆర్బీఎస్ షాక్..
♦ భారీ కాంట్రాక్టు రద్దు ♦ ఆరు నెలల్లో 3వేల ఉద్యోగాలకు ముప్పు బెంగళూరు: భారీ కాంట్రాక్టును రద్దు చేసుకుంటూ రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్ (ఆర్బీఎస్) ఇన్ఫోసిస్‌కు గట్టి షాక్ ఇచ్చింది. ఇన్ఫోసిస్‌లో మూడు వేల ఉద్యోగాలపై దీని ప్రభావం ఉంటుందని, వచ్చే ఆరు నెలల కాలంలో 4 కోట్ల డాలర్ల ఆదాయాన్ని కోల్పోయే అవకాశం ఉందని తెలుస్తోంది. బ్రిటన్ వరకు విలియమ్స్ అండ్ గ్లిన్ (డబ్ల్యూ అండ్ జీ) బ్యాంకును ప్రత్యేక కంపెనీగా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను ఆర్బీఎస్ ఉపసంహరించుకోవడమే కాంట్రాక్టు రద్దుకు దారితీసింది. విలియమ్స్ అండ్ గ్లిన్ ఏర్పాటుకు సంబంధించి ఇన్ఫోసిస్, ఐబీఎం కంపెనీలకు 30 కోట్ల డాలర్ల విలువైన ఐదేళ్ల కాంట్రాక్టును ఆర్బీఎస్ కేటాయించింది. ఇందులో 20 కోట్ల డాలర్ల మేర వ్యాపారం ఇన్ఫోసిస్ నిర్వహించాల్సి ఉంది. కాగా, తాజా పరిణామంపై ఇన్ఫోసిస్ శనివారం ఓ ప్రకటన చేసింది. 3వేల మందికి కోత... విలియమ్స్ అండ్ గ్లిన్ కార్యక్రమానికి సంబంధించి సలహా, అప్లికేషన్ డెలివరీ, టెస్టింగ్ సేవలు అందించేందుకు గాను ఇన్ఫోసిస్ భాగస్వామిగా ఉంది. ప్రత్యేకంగా కంపెనీ ఏర్పాటు చేయరాదన్న ఆర్బీఎస్ నిర్ణయం ఫలితంగా వచ్చే కొన్ని నెలల్లో 3,000 మంది ఉద్యోగులను తొలగించాల్సి ఉంటుంది. ఇందులో ఎక్కువ మంది భారత్ నుంచే ఉంటారు’ అని ఇన్ఫోసిస్ తన ప్రకటనలో స్పష్టం చేసింది. ఆర్బీఎస్ కాంట్రాక్టు రద్దుతో ఎంత ఆదాయం కోల్పోయే విషయాన్ని ఇన్ఫోసిస్ చెప్పలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 4 కోట్ల డాలర్ల ఆదాయంపై ప్రభావం పడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఐబీఎం మాత్రం తనకు సంబంధించిన కాంట్రాక్టులో అధిక భాగాన్ని ఇప్పటికే పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఊహించని పరిణామం ఆర్బీఎస్ కంపెనీ ద్వారా మూడేళ్ల కాలంలో రానున్న ఆదాయంపై ఇన్ఫోసిస్ ఇటీవలే ఓ కార్యాచరణ రూపొందించుకుంది. ఏటేటా ఆదాయంలో 15 శాతం వృద్ధి ఉంటుందని అంచనా వేసింది. ఇంతలోనే ఆర్బీఎస్ తీసుకున్న నిర్ణయంతో అంచనాలన్నీ తలకిందులయ్యాయి. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం... అతి తక్కువ వడ్డీ రేట్ల విధానం అభివృద్ధి చెందిన దేశాల్లో బ్యాంకులు, ఆర్థిక సేవల కంపెనీలకు ఇబ్బందిగా మారింది. దీనికి తోడు బ్రెగ్జిట్ పరిణామం ఆర్బీఎస్ వంటి బ్యాంకులకు మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టింది. ఈ పరిణామాలతో ఐటీ కంపెనీల బ్యాంకింగ్ సేవల వ్యాపారంపై ప్రతికూల ప్రభావం పడిందన్నది విశ్లేషకుల అంచనా. అమెరికాకు చెందిన దిగ్గజ ఐటీ సేవల కంపెనీ కాగ్నిజెంట్ 2016లో ఆదాయ అంచనాలను రెండు సార్లు తగ్గించడంతోపాటు, ఆర్థిక సేవల విభాగంలో గడ్డు పరిస్థితులే ఇందుకు కారణంగా పేర్కొనడాన్ని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. మార్పు ఫలితమే ఇది... ఆర్థిక సేవల రంగం మార్పు చెందే దశలో ఉంది. దీంతో బ్యాంకులు అవుట్సోర్స్పై వెచ్చించే వ్యయాలను పునఃసమీక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆర్బీఎస్ విషయానికి వస్తే ఈ ఏడాదిలో 80 కోట్ల పౌండ్ల ఖర్చును తగ్గించుకునే పనిలో ఉంది. - జిమిత్ అరోరా, బ్యాంకింగ్, ఆర్థిక సేవల విభాగం అధిపతి, ఎవరెస్ట్ గ్రూప్ నిర్వహణ లోపమే... ఆర్బీఎస్ ఏళ్ల కొద్దీ నిర్వహణ లోపం ఫలితంగా మూల్యం చెల్లించుకుంటోంది. బ్రెగ్జిట్ కారణంగా విలియమ్స్ అండ్ గ్లిన్ ఆలోచనను పక్కన పెట్టింది. వ్యయాలను తగ్గించుకోవడం అత్యంత ప్రాధాన్య అంశంగా మారిపోయింది. - టామ్ర్యూనర్, ఎండీ, హెచ్ఎఫ్ఎస్ రీసెర్చ్ -
మాల్యాకు ఆర్బీఎస్ షాక్!
కింగ్‌ఫిషర్ బీర్ యూరప్‌కు బ్యాంకింగ్ సేవలు నిలిపివేసే యోచన లండన్/వాషింగ్టన్: భారత్‌లో రుణ ఎగవేతల కేసుల్లో చిక్కుకుని బ్రిటన్‌కు పలాయనం చిత్తగించిన విజయ్ మాల్యాకు... విదేశాల్లో కూడా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్ బీర్ యూరప్ లిమిటెడ్(కేబీఈఎల్)కు వచ్చే నెల నుంచి రుణ సదుపాయంతో పాటు ఇతర బ్యాంకింగ్ సేవలన్నింటినీ కూడా పూర్తిగా నిలిపివేసే ప్రణాళికల్లో గ్లోబల్ బ్యాంకింగ్ దిగ్గజం రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లండ్(ఆర్బీఎస్) ఉంది. మాల్యా నేతృత్వంలోని యూబీ గ్రూప్ తన విదేశీ బీర్ బిజినెస్‌ను కాలిఫోర్నియా కేంద్రంగా ఉన్న మెండోసినో బ్రూవింగ్ కంపెనీ ద్వారా నిర్వహిస్తోంది. అమెరికాలో కింగ్‌ఫిషర్‌తో పాటు పలు ఇతర బ్రాండ్లను దీని ద్వారా విక్రయిస్తోంది. అయితే, ఇతర దేశాల్లో మాత్రం దీని పూర్తిస్థాయి అనుబంధ సంస్థ అయిన యూబీ ఇంటర్నేషనల్(యూకే), కేబీఈఎల్ ద్వారా వ్యాపార కార్యకలాపాలు జరుగుతున్నాయి. మెండోసినోకు ప్రస్తుతం మాల్యానే చైర్మన్‌గా ఉన్నారు. భారత్‌లో బ్యాంకులకు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, దీని ప్రమోటర్ అయిన మాల్యా దాదాపు రూ.9,000 కోట్ల మేర రుణ బకాయిలను చెల్లించకపోవడంతో ఆయనపై సెబీ, ఈడీ, ఎస్ఎఫ్ఐఓ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలు ఇప్పటికే విచారణను ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. మాల్యా దేశం విడిచి వెళ్లిపోవడంతో వివాదం మరింత ముదిరింది. తాజాగా ప్రభుత్వం మాల్యా పాస్‌పోర్టును 4 వారాల పాటు సస్పెండ్ కూడా చేసింది. దశాబ్దం క్రితం కేబీఈఎల్కు ఆర్బీఎస్ 2.8 మిలియన్ డాలర్ల రివాల్వింగ్ రుణ సదుపాయాన్ని ఇచ్చినట్లు మెండోసినో అమెరికా స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థకు తెలిపింది. ఆర్బీఎస్ తమకు ఇచ్చిన టెర్మినేషన్ నోటీసులను మే 31 వరకూ పెంచినట్లు చెబుతోంది. 2015 సెప్టెంబర్ వరకూ కేబీఈఎల్ చెల్లించాల్సిన బకాయి రూ. 5 కోట్లకు పైగా ఉంది. కాగా, నిధుల కొరతను ఎదుర్కొంటున్న మెండోసినో నుంచి మాల్యా గతేడాది రూ.1.7 కోట్లకుపైనే వేతన ప్యాకేజీని అందుకోవడం గమనార్హం. ఈడీ ఆరోపణలు అవాస్తవం: యూబీ గ్రూప్ ఐడీబీఐ బ్యాంక్ నుంచి తీసుకున్న రుణంలో కొంత మొత్తాన్ని మాల్యా విదేశాల్లో ఆస్తులు కొనుగోలుకు బదలాయించినట్లు ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ చేసిన ఆరోపణలను విజయమాల్యా నియంత్రణలోని యూబీ గ్రూప్ ఆదివారం తోసిపుచ్చింది. ఐడీబీఐ బ్యాంక్ నుంచి కింగ్‌ఫిషర్ పొందిన రూ.950 కోట్ల మొత్తంలో రూ.430 కోట్లు విదేశీ ఆస్తుల కొనుగోళ్లకు మళ్లించినట్లు ఈడీ ఆరోపించిన నేపథ్యంలో యూబీ గ్రూప్ దీనిపై ఒక ప్రకటన చేసింది. విదేశీ ఆర్థిక లావాదేవీల వివరాలు అన్నీ త్వరలో మాల్యా వెల్లడిస్తారనీ వివరించింది. ఎన్పీఏలకు ఏకీకృత నిర్వచనం! బ్యాంకింగ్ మొండిబకాయిలకు(ఎన్పీఏ) సం బంధించి ప్రపంచవ్యాప్తంగా ఏకీకృత నిర్వచనాన్ని తీసుకురావాలని బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్(బీఐఎస్) ప్రతిపాదించింది. అదేవిధంగా రుణ గ్రహీత చెల్లింపులు సరిగ్గా చేయనప్పుడు బ్యాంకులు అనుసరించే పద్ధతుల(ఫోర్బేరన్స్)కు కూడా ప్రపంచవ్యాప్తంగా ఒకే నిర్వచనం ఉండాలని భావిస్తోంది. విజయ్ మాల్యా సహా అనేక మంది కార్పొరేట్ రుణ ఎగవేతదారుల నుంచి భారతీయ బ్యాంకులు తమ బకాయిల వసూళ్ల కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో బీఐఎస్ ప్రతిపాదన ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం వివిధ దేశాల్లోని బ్యాంకులు రుణాలను ఎన్పీఏలుగా విడదీసేందుకు విభిన్న అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నాయని.. దీనికి అంతర్జాతీయంగా ఒక ప్రామాణికం అంటూ లేదని బీఐఎస్ పేర్కొంది. ఈ అంశంపై ఒక వివరణాత్మక సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేసింది. స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తున్న బీఐఎల్లో 60కిపైగా సెంట్రల్ బ్యాంకులకు సభ్యత్వం ఉంది. ప్రస్తుతం ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ దీనికి వైస్ చైర్మన్‌గా ఉన్నారు. మూడేళ్ల కాలా నికి ఆయన 2015లో ఈ పదవికి ఎన్నికయ్యారు.