వాళ్లకి ఉద్యోగాల కోత: మనకే ఆ జాబ్స్
వాళ్లకి ఉద్యోగాల కోత: మనకే ఆ జాబ్స్
Published Mon, Jun 26 2017 12:34 PM | Last Updated on Tue, Sep 5 2017 2:31 PM
బ్రిటీష్ కు చెందిన రాయల్ బ్యాంకు ఆఫ్ స్కాంట్లాండ్(ఆర్‌బిఎస్) తమ యూకే వ్యాపారాలలో దాదాపు 443 ఉద్యోగాలకు కోత పెట్టాలని ప్లాన్ వేస్తోంది. ఆ ఉద్యోగాల్లో చాలావాటిని భారత్ కు తరలించాలని చూస్తున్నట్టు బ్యాంకు చెప్పింది. అయితే ఈ వార్త ఉద్యోగులకు జీర్ణించుకోలేనిదని, వారికి మద్దతుగా నిలిచేందుకు తాము చేయాల్సిందల్లా చేస్తామని బ్యాంకు ఓ ప్రకటనలో పేర్కొంది. 70శాతానికి పైగా ప్రభుత్వానికి చెందిన ఈ బ్యాంకు, దాదాపు ఒక దశాబ్దం నష్టాల తర్వాత తిరిగి మళ్లీ లాభాలను ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో బ్యాంకు అతిపెద్ద పునర్నిర్మాణ ప్రక్రియను చేపడుతోంది. చిన్న వ్యాపారాల రుణాలకు సాయంగా నిలిచేందుకు తమ ఉద్యోగాలను బదిలీచేస్తున్నామని బ్యాంకు పేర్కొంది.
ఇది తాము చేపడుతున్న వ్యయాల కోతలో ఓ భాగమని కూడా తెలిపింది. తాము కస్టమర్లకు అందించే సేవల్లో కొన్ని మార్పులు చేస్తున్నామని, దీని ఫలితంగా యూకేలో 443 ఉద్యోగాలు పోతాయని బ్యాంకు అధికార ప్రతినిధి చెప్పారు. ఈ ఉద్యోగాలను భారత్ కు తరలించడం ద్వారా చాలా చౌకగా పనులు పూర్తి చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఉద్యోగాలు తరలించడం ద్వారా 2007-09 ఆర్థిక సంక్షోభ సమయంలో ఈ ముప్పు నుంచి తప్పించుకోవడానికి 46 బిలియన్ పౌండ్ల బైలౌట్ ను అందుకుంది. గత నెలలోనే బ్యాంకు కొన్ని ఉద్యోగాల కోత ఉంటుందని, వారిలో కొందర్ని భారత్ కు తరలిస్తామని కూడా చెప్పింది.
Advertisement
Advertisement