కార్మికుల ఉపాధిని దెబ్బతీయొద్దు
సిరిసిల్ల, న్యూస్‌లైన్ : సిరిసిల్ల వస్త్రోత్పత్తి రంగంపై ఆధారపడిన కార్మికుల ఉపాధిని దెబ్బతీయొద్దని చేనేత జౌళి శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ వెంకటేశ్వర్రావు కోరారు. ఆర్డీవో కార్యాలయంలో బుధవారం వస్త్రోత్పత్తిదారులతో జౌళి శాఖ అధికారులు సమావేశం నిర్వహించారు. పాలిస్టర్ పరిశ్రమకు సరఫరా అవుతున్న యారన్ రేట్ ఒక్కసారిగా పెరగడంతో ఆ మేరకు ఉత్పత్తైన గుడ్డకు ధర రాకపోవడంతో వస్త్రోత్పత్తిదారులు గుడ్డ ఉత్పత్తిని తగ్గించారు. దీంతో సగానికిపైగా సాంచాలు ఆగిపోయాయి. కార్మికులకు పనిలేని పరిస్థితి నెలకొంది. యారన్ ధరతగ్గిస్తే వస్త్రోత్పత్తి గిట్టుబాటవుతుం దని, లేకుంటే బట్ట ఉత్పత్తి చేయలేమని యజమానులు అధికారులకు విన్నవించుకున్నారు.
ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని, కార్మికులు రోడ్డున పడకుండా యజమానులు పరిశ్రమను నడపాలని సూచిం చారు. కాటన్ పరిశ్రమలో పెద్దగా ఇబ్బంది లేకపోగా, పాలిస్టర్ పరిస్థితి దయనీయంగా ఉందని యజమానులు వివరించారు. ఇక్కడి పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అధికారులు సూచించారు. ఆర్డీవో కె.శ్రీనివాస్, జౌళి శాఖ డెవలప్మెంట్ అధికారి అశోక్‌రావు, ఏడీవో రశీద్, ఎన్ఫోర్స్మెంట్ ఏడీఈ నారాయణ, వస్త్రోత్పత్తిదారులు సుదర్శన్, సత్యం, భాస్కర్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.