readers response
-
పాఠక స్పందన
శ్రీ రమణ గారు హారీపోటర్ని అమ్మాయిగా చేసేశారు. హారీపోటర్ నవలలోని పాత్రే కానీ, నవల రచయిత కాదు. రాసిన విషయం ఎంతబాగున్నా, అసలైన సమాచారం తప్పు కాకూడదు కదా... - శ్రీకుమార్, ఇ మెయిల్ తేనెమనసులు సినిమా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇచ్చిన కథనం చాలా బాగుంది. మమ్మల్ని సంతోషపెట్టింది. ఎస్. రమ్య - ఇ మెయిల్ మార్చి 29వ తేదీ సంచికలో ప్రచురితం అయిన శ్రీకారాలు-శ్రీ మిరియాలూలో ‘మన అమ్మాయే’లో ప్రస్తావించిన హారీపోటర్ ఆ నవల్లోని ప్రధానపాత్ర పేరు. దాని రచయిత జేకే రౌలింగ్. కాబట్టి హారీపోటర్ మన అమ్మాయే అంటే చెల్లదు. - రాయపెద్ది అప్పా శేషశాస్త్రి, ఆదోని మార్చి 29వ తేదీ ఫన్డేలో ప్రచురితం అయిన బెస్ట్‌కేస్ ‘ముందే చెప్పి ఉంటే’ చాలా ఆసక్తికరంగా ఉంది. చెడు చేసే వాళ్లకు చెడే జరుగుతుంది అనడానికి ఈ కథే ఒక ఉదాహరణ. అతడు రౌడీలకు ఆశ్రయం ఇచ్చి ఉండకపోతే అతడి పాప బతికి ఉండేది కదా. - రాము, హైదరాబాద్. సూపర్‌స్టార్ కృష్ణ సినీరంగ ప్రవేశం, తేనె మనసులు 50 ఏళ్లు పూర్తి చేసుకొన్న సందర్భంగా ఇచ్చిన కవర్ స్టోరీ ఆసక్తికరంగా చదివింపజేసింది. శ్రీరమణ గారి కారాలు, మిరియాలు చక్కలిగింతలు పెడుతున్నాయి. నానీలు అలరిస్తున్నాయి. ప్రహేళిక భాషపై పట్టుసాధించేందుకు ఉపయోగకరంగా ఉంది. - రామచంద్రం, నారాయణపురం మెడికల్ మెమరీస్‌లో ‘ఆ చిన్నారులు మాట్లాడిన అపురూప వేళల్లో’ చాలా బాగుంది. నేను అమ్మని కాకపోయినా ఆ బాధను అర్థం చేసుకోగలను. వారికి ఉచితంగా చికిత్స చేసిన డాక్టర్ రచన గారిని, వారి తండ్రి వినయ్కుమార్ని అభినందిం చాలి. ఇలాగే చికిత్స చేయాలని కోరుతూ... - వనజ పాలకూరు, ఇ మెయిల్ మీ అభిప్రాయాలనూ, రచనలనూ స్వాగతిస్తున్నాం. మా చిరునామా: ఫన్డే, సాక్షి తెలుగు దినపత్రిక, 6-3-249/1, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34. ఫోన్: 040-23256000 funday.sakshi@gmail.com -
పాఠక స్పందన
ఉగాది పంచాంగంతో వచ్చిన ‘ఫన్ డే’ ముఖచిత్రం అద్భుతంగా ఉంది. కవుల మదిలో మెదిలే అద్భుత భావనలా చిత్రకారుడు అలవోకగా ప్రకృతి కన్యను చిత్రీకరించారు. చిత్రకారుడికి అభినందనలు. - పుష్పలత, సోమందేపల్లి, అనంతపురం ఒక గృిహ ణి అయిన నేను సొంతంగా ఒక పరిశ్రమను ప్రారంభిద్దాం అనుకొంటున్నాను. దీనికి స్ఫూర్తి మీరు ప్రచురిస్తున్న ‘మీరే పారిశ్రామికవేత్త’. ఈ శీర్షిక కింద వస్తున్న కథనాలు ప్రోత్సాహవంతంగా ఉంటున్నాయి. - రూత్ సునైనా, ఇ మెయిల్ తళుకులీను తారలతో మిలమిల మెరిసే ఆకాశంలా ఉంటుంది ‘ఫన్డే’. ఉగాది వంటి ప్రత్యేక సందర్భాల్లో విశేష సమాచారాలకే పరిమితం కావడం మాలాంటి పాఠకులను నిరుత్సాహపరుస్తుంది. ప్రత్యేక సందర్భాల్లో విడుదలయ్యే ఫన్డేలో కూడా మిగతా శీర్షికలకు స్థానం కల్పించ ప్రార్థన. - నేరెళ్ల వెంకటరావు, విజయనగరం మీ రీడర్‌గా చేరి అప్పుడే ఏడేళ్లు గడిచిపోయాయా! సాక్షిని రూపొందించే చేతులు, అవి పడిన శ్రమ చదువుతుంటే చాలా బాగుంది. అన్నం ముద్దను తినే ముందు కోత కోసిన వాడి నుంచి కంచంలో వడ్డించిన వారి వరకూ అందరినీ ‘సుఖీభవ’ అని తలుచుకున్నట్టుగా ఉంది. ఒక టీచర్‌గా మాకు కావాల్సిన సమాచారం, పిల్లలకు గెడైన్స్ సూపర్. ఇక ఫ్యామిలీ ఎడిటోరియల్స్, వైద్యం, సాహిత్యం, సాగుబడి, ఫన్డే ఏదైనా మాకు అర్థమయ్యే శైలిలో ఉంటాయి. పేపర్ కష్టాల్లో ఉన్నప్పుడు అందరూ ఒక్కమాట మీద ఉండటం, చైర్పర్సన్ వైఎస్ భారతి రెడ్డిగారి కృషి... అవసరమైనప్పుడు తన కష్టాలని దిగమింగి ధైర్యంగా ఆమె ప్రజల ముందుకు వచ్చి నిజాలు చెప్పడం నాకు చాలా నచ్చింది. ఇంకా మీరు వినూత్నంగా ఎప్పటికప్పుడు మా అభిమానాన్ని చూరగొంటారని ఆశిస్తూ.. మీ టీమ్ అందరికీ అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు. - వి.శశికళ, నాయుడుపేట, నెల్లూరు మీ అభిప్రాయాలనూ, రచనలనూ స్వాగతిస్తున్నాం. మా చిరునామా: ఫన్డే, సాక్షి తెలుగు దినపత్రిక, 6-3-249/1, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34. ఫోన్: 040-23256000 funday.sakshi@gmail.com -
పాఠక స్పందన
సంగీత దర్శకుడు ఇళయరాజా వెయ్యి సినిమాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దర్శకుడు వంశీ కవర్‌స్టోరీ రాయడం మాకు ఎనలేని సంతోషాన్ని కలిగించింది. కథనం ఆద్యంతం చదివించింది. - కె.సతీష్‌బాబు, కడప, వైఎస్సార్ జిల్లా దేశ రక్షణతో పాటు తమకు సామాజిక బాధ్యత కూడా ఉందంటూ ఆర్మీ కాన్వాయ్‌లో పిల్లలను పరీక్షకేంద్రానికి పంపి వారి విద్యాసంవత్సరాన్ని వృథా కాకుండా కాపాడిన వైనాన్ని ‘యుద్ధక్షేత్రం’లో కల్నల్ పి.ప్రసాద్ వివరించిన తీరు ఆసక్తికరంగా ఉంది. శ్రీరమణ ‘శ్రీకారాలు- శ్రీ మిరియాలు’ ఫన్నీగా చురుక్కుమనిపించేలా ఉంటున్నాయి. - యు.చిట్టిబాబు, న్యూ పాల్వంచ, ఖమ్మం మహిళా దినోత్సవం సందర్భంగా మహిళామణుల అభిప్రాయాలను కూర్చి ప్రచురించిన కథనం చక్కగా ఉంది. సంపాదకవర్గానికి అభినందనలు. - ప్రఫుల్ల చంద్ర, ధర్మవరం, అనంతపురం మార్చి 8నాటి సంచికలో శ్రీరమణ శీర్షిక ‘శ్రీకారాలూ - శ్రీమిరియాలు’లో ప్రస్తావించిన ఎస్వీరంగారావుగారి ఉదంతం ‘పాండవ వనవాసం’లోనిది కాదు. ‘నర్తనశాల’ సినిమాలోనిది. - కట్టకోలు సుబ్బారెడ్డి, ఉయ్యూరు మార్చి ఎనిమిది ఫన్డేలో ఇంటెలిజన్స్ విభాగం అధికారి మహేశ్ భగవత్ చెప్పిన రియల్క్రైమ్ స్టోరీ ‘తొమ్మండుగురు తోడేళ్లు’ ఆసక్తికరంగా ఉంది. ఈ కథనాన్ని చదవడం వల్ల నాకు మీడియాపై ఉన్న చెడు అభిప్రాయం తొలగిపోయింది. - తురకా శ్రీనివాస్‌రాజు, కొత్తూరు. ఇ-మెయిల్ బెస్ట్‌కేస్ ఫీచర్ చాలా బాగుంటుంది. పోలీసు వ్యవస్థపై నమ్మకం పెంచేలా ఉంది. ఈ ప్రయత్నంలో సాక్షి కృషి అభినందనీయం. - వై.సంజీవ్, పోతంగల్, ఇ-మెయిల్ మీ అభిప్రాయాలనూ, రచనలనూ స్వాగతిస్తున్నాం. మా చిరునామా: ఫన్డే, సాక్షి తెలుగు దినపత్రిక, 6-3-249/1, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34. ఫోన్: 040-23256000 funday.sakshi@gmail.com